Yadadri Accident: తెలంగాణ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్లిన ఓ కారు నేరుగా చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులోవున్న ఆరుగురిలో ఒక్కరు మాత్రమే బయటపెట్టారు. మిగతా ఐదుగురు మృతి చెందారు. అసలేం జరిగిందంటే..
హైదరాబాద్‌లోని హయత్ నగర్ ప్రాంతానికి చెందిన ఐదుగురు యువకులు భూదాన్ పోచంపల్లికి వెళ్తున్నారు. అయితే యువకులంతా యాదాద్రి భువనగిరి జిల్లాలో బోధన్ పోచంపల్లి మండలం జూలూరు గ్రామ శివారులోకి రాగానే ఏం జరిగిందో తెలీదుగానీ నేరుగా చెరువులోకి దూసుకెళ్లింది షిఫ్ట్ డిజైర్ కారు.
ఘటన సమయంలో ఆరుగురు కారులో ఉన్నారు. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మణికంఠ అనే వ్యక్తి బయటపడ్డాడు. మృతులు వంశీ గౌడ్, దినేష్ హర్ష, బాలు, వినయ్ ఉన్నారు. వీరంతా స్నేహితులు. బంధువుల ఇంటికి వెళ్తున్నట్లు తెలుస్తోంది.
కారు చెరువులో పడిన విషయాన్ని జూలూరు గ్రామస్తులు గమనించారు. వెంటనే వారిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. అప్పటికే ఐదుగురు మరణించగా, కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని సమీపంలో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో నిమగ్నమయ్యారు. యువకులు భూదాన్ పోచంపల్లికి ఎందుకు వెళ్తున్నారు అనేదానిపై ఆరా తీస్తున్నారు.
ALSO READ: ప్రిన్సిపాల్‌ని తుపాకీతో కాల్చి చంపిన విద్యార్థులు.. హత్య తరువాత డాన్సులు!
యువకులంతా హయత్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడి నుంచి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. పోస్టుమార్టం తర్వాత యువకుల డెడ్ బాడీలను కుటుంబసభ్యులకు అందజేయనున్నారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
ఘోర ప్రమాదం ఐదుగురు దుర్మరణం
యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు హైదరాబాద్‌కు చెందిన హర్ష, దినేశ్, వంశీ, బాలు, వినయ్‌గా… pic.twitter.com/UGCEFg4m9c
— ChotaNews (@ChotaNewsTelugu) December 7, 2024