Naveen polishetty.. నవీన్ పోలిశెట్టి(Naveen polishetty).. స్టాండప్ కమెడియన్ గా కెరియర్ ఆరంభించారు. ఇక తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషించిన నవీన్ పోలిశెట్టి ‘జాతి రత్నాలు’ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్నారు. గత ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాలో నటించిన ఈయన ఆ తర్వాత ఆక్సిడెంట్ కి గురై, ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఆహా ఓటీటీ వేదికగా బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె సీజన్ 4’ ఆరవ ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చారు. ఈ కార్యక్రమానికి శ్రీలీల (Sreeleela)తో కలిసి వచ్చిన విషయం తెలిసిందే.
బాలయ్య షోలో శ్రీ లీలతో సందడి చేసిన నవీన్ పోలిశెట్టి..
ఈ ఎపిసోడ్ నిన్న రాత్రి రిలీజ్ చేశారు. ఇందులో శ్రీ లీల, నవీన్ పోలిశెట్టి తమ కామెడీతో మంచి హంగామా చేశారు. గత కొన్ని నెలల క్రితం నవీన్ పోలిశెట్టి తనకు యాక్సిడెంట్ అయిందని, ఆపరేషన్ కూడా జరిగిందని, అందుకే రెస్ట్ తీసుకున్నానని గతంలో ఒక వీడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆక్సిడెంట్ విషయంపై బాలయ్య (Balayya) ప్రశ్నించగా పూర్తి వివరాలను వెల్లడించారు నవీన్ పోలిశెట్టి.
యాక్సిడెంట్ పై తొలిసారి స్పందించిన నవీన్ పోలిశెట్టి..
ఈ షోలో పాల్గొన్న నవీన్ పోలీస్ శెట్టి మాట్లాడుతూ.. “పెద్ద యాక్సిడెంట్ జరిగింది. చేతికి ఏకంగా మూడు ఫ్యాక్చర్స్ అయ్యాయి. వాటికి ఆపరేషన్ కూడా చేశారు. పూర్తిగా రికవరీ అవ్వడానికి కనీసం 8 నెలల సమయం పడుతుందని డాక్టర్ చెప్పారు. కానీ ఈ గ్యాప్ లో నేను సినిమా కథలు వినడం ప్రారంభించాను..త్వరలో ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో వస్తున్నాను. ఈ ఎనిమిది నెలల సమయం మంచికే జరిగింది. స్క్రిప్ట్ ఇంకా బెటర్ గా చేసుకోవడానికి ఈ సమయం ఉపయోగపడింది” అంటూ తెలిపారు నవీన్ పోలిశెట్టి. ఏది ఏమైనా చేతికి మూడు చోట్ల ఫ్రాక్చర్స్ అయ్యాయని చెప్పడంతో అభిమానులు సైతం కలవరపాటుకు గురి అవుతున్నారు. ఇకపోతే ఈ విషయం విన్నాక బాలయ్య మాట్లాడుతూ.. “భగవంతుడు ఏమి చేసినా మనమంచికే. ఏది జరిగినా కూడా దానిని ధైర్యంగా ఎదుర్కోవాలి అప్పుడే ముందడుగు వేస్తాము” అంటూ నవీన్ పోలిశెట్టికి ధైర్యం చెప్పాడు.
నవీన్ పోలిశెట్టి కెరియర్..
యూట్యూబ్ వీడియోలతో పాటు షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ ఆరంభించి, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా 2019లో విడుదలై మంచి విజయం అందుకుంది. అదే సంవత్సరం ‘చిచోర్’ అనే సినిమా ద్వారా హిందీ పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టారు. అందులో కీలకపాత్ర పోషించారు. వీటి కంటే ముందు అనగా 2012లో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, ‘డి ఫర్ దోపిడి’, ‘నేనొక్కడినే’ చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి, జాతి రత్నాలు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇక చివరిగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty)తో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఇక ఆ తర్వాత ఆక్సిడెంట్ అవ్వడంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈయన త్వరలో మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక నవీన్ పోలిశెట్టి నటుడు గానే కాకుండా రచయితగా కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు.