BigTV English
Advertisement

UP News: ఏకాంత సేవలో ప్రియుడితో భార్య.. కోపంతో ముక్కు కొరికేసిన భర్త

UP News: ఏకాంత సేవలో ప్రియుడితో భార్య.. కోపంతో ముక్కు కొరికేసిన భర్త

UP News:  యూపీలో రకరకాల  క్రైమ్ స్టోరీలు పుట్టుకొస్తున్నాయి. ఆ ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలీదు. చివరకు ప్రియుడికి దగ్గరైంది ఆ మహిళ. ఏకాంతంగా ఉన్న సమయంలో భర్తకు దొరికిపోయింది. కోపంతో ఊగిపోయిన భర్త, భార్య ముక్కుని కొరికేశాడు. సంచలనం రేపిన ఈ ఘటన యూపీలో వెలుగుచూసింది.


పచ్చని కాపురంలో వివాహేతర సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. తప్పు ఎవరివల్ల జరిగింది అనేది పక్కనబెడితే.. భార్యభర్తలు కాసేపు కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు చక్కబడతాయి. ఫలితంగా వివాహ బంధం మరింత బలంగా ఉంటుంది.  ఇగోలకు పోయిన ఎడముఖం.. పెడముఖంగా వ్యవహరిస్తున్నారు.

ఆలుమగలు కలిసి కూర్చుని మాట్లాడుకోలేని పరిస్థితులు మొదలయ్యాయి. దీనికారణంగా అనేక అనర్థాలకు దారి తీస్తున్నాయి. అలాంటి ఘటన యూపీలోని బయటపడింది. హర్దోయ్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన రామ్ ఖిలావన్ దంపతులు ఉండేవారు. వారి మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నాయ తెలీదు.


కాకపోతే భార్యభర్తల మధ్య చిన్నచిన్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. రామ్ ఖిలావన్ భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భార్య అంతర్గత  వ్యవహారం ఎప్పుటి నుంచి జరుగుతుందో తెలీదు. కాకపోతే భార్య కదలికలపై కన్నేశాడు ఆమె భర్త రామ్ ఖిలావన్. అతడి అనుమానం నిజమైంది.

ALSO READ: హనీమూన్ మర్డర్ కేసులోకి కొత్త వ్యక్తి

సరిగ్గా ప్రియునితో ఏకాంతంగా ఉన్న సమయంలో భార్యని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. వారిద్దరి అలా చూసి కోపంతో రగిలిపోయాడు.. ఊగపోయాడు కూడా. చివరకు భార్య ముక్కును బలంగా కొరికివేశాడు. దీంతో భాదిత భార్య రోదనలు తీవ్రంకావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

బాధితురాలిని ట్రీట్‌మెంట్ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భర్తను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమెకు మెరుగైన చికిత్సను అందించేందుకు లక్నోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసును అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పిన జిల్లా పోలీసులు, భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.

హనీమూన్‌కు ముందు లవర్‌తో పరార్

యూపీలోని బదౌన్ జిల్లాలో మరో సంఘటన బయటకు వచ్చింది. బదౌన్‌ ప్రాంతానికి చెందిన సునీల్‌కు గతన 17న వివాహం జరిగింది. పెళ్లి తర్వాత వధువు అత్త ఇంట్లో అడుగుపెట్టింది. కాకపోతే భార్యభర్తల ఎలాంటి ఆ కార్యక్రమాలు జరగలేదు. 9 రోజులపాటు అక్కడే ఉన్న ఆ మహిళ ఆ తర్వాత పుట్టింటికి వెళ్లింది. ఆమె వచ్చిన తర్వాత హనీమూన్ కోసం నైనిటాల్ కు ప్లాన్ చేశాడు.

అప్పటికే ఆమెకి ఓ లవర్స్ ఉన్నాడు. ప్రేమించినవాడ్ని వదులుకోలేక ఉండలేక పోయింది. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా ప్రియుడితో వెళ్లిపోయింది. తన భార్య కనిపించలేదని ఆందోళనకు గురైన ఆమె భర్త సునీల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సునీల్ భార్య కోసం గాలింపు చేపట్టారు.

అదే సమయంలో ఇరు కుటుంబాలకు షాకిస్తూ ప్రియుడితో కలిసి పోలీసుల ముందుకు వచ్చింది ఆ నవ వధువు. తాను ఎక్కడికీ వెళ్లలేదని, తాను ప్రేమించిన వాడితో వెళ్లిపోయినట్లు ఓపెన్‌గా చెప్పేసింది. ప్రియుడితో జీవితాంతం కలిసి ఉంటానని చెప్పిది. భార్య మాటలు విని షాకైన సునీల్, చివరకు ఆమె వెళ్లి పొమ్మన్నాడు. సునీల్ ఫ్యామిలీ వ్యవహారానికి ఫుల్‌స్టాప్ పడింది.

Related News

Nellore Accident: నెల్లూరులో స్కార్పియో యాక్సిడెంట్.. నలుగురు టీచర్లు స్పాట్!

Rajendranagar Accident: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం వాహనం..

Chittoor Leopard Attack: చిరుతపులి దాడిలో లేగదూడ మృతి.. భయాందోళనలో గ్రామస్థులు

Ahmedabad Crime: దృశ్యం మూవీ తరహాలో.. భర్తని చంపి వంట గదిలో పూడ్చింది, ఆ తర్వాత..

Sangareddy News: చీమల భయం.. అనుక్షణం వెంటాడాయి, నావల్ల కాదంటూ వివాహిత ఆత్మహత్య

Road Accident: బీచ్‌కి వెళ్లి వస్తూ.. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు మృతి

Hyderabad News: సహజీవనం.. డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో ఒకరు మృతి, మరొకరి పరిస్థితి

Hyderabad News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. నలుగురు చిక్కారు, మరి డ్రోన్ల మాటేంటి?

Big Stories

×