BigTV English

Honeymoon Murder: హనీమూన్ మర్డర్ కేసులోకి కొత్త వ్యక్తి, సోనమ్ నుంచే ఏకంగా 119 కాల్స్!

Honeymoon Murder:  హనీమూన్ మర్డర్ కేసులోకి కొత్త వ్యక్తి, సోనమ్ నుంచే ఏకంగా 119 కాల్స్!

Meghalaya Honeymoon Murder Case: మేఘాలయ హనీమూన్‌ మర్డర్ కేసులో రోజు రోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు సోనమ్ తో పాటు ముగ్గురు నిందితులు ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు భావించగా, ఇప్పుడు మరో వ్యక్తి పేరు ఈ కేసులోకి వచ్చింది. సంజయ్‌ వర్మ  అనే వ్యక్తి పేరును పోలీసులు ఈ కేసులో చేర్చారు. ప్రధాన నిందితురాలు సోనమ్‌ తో సంజయ్ వర్మ 119 ఫోన్‌ కాల్స్‌ మాట్లాడినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇంతకీ ఎవరీ సంజయ్ వర్మ అని పోలీసులు ఆరా తీస్తున్నారు.


ప్రస్తుతం సంజయ్ ఫోన్ స్విచ్ ఆఫ్  

సోనమ్ నుంచి వందకు పైగా కాల్స్ వచ్చి సంజయ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అయితే, ప్రస్తుతం సంజయ్‌ వర్మ ఫోన్‌ స్విచ్ ఆఫ్‌ చేసి ఉన్నట్లు గుర్తించారు. రాజా రఘువంశీ హత్య కేసులో సంజయ్‌ వర్మ ప్రమేయం ఏమైనా ప్రమేయం ఉందా? అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం అతడి గురించి తెలుసుకునేందుకు సోనమ్ తో పాటు మిగతా నిందితులను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


సీన్ రీ క్రియేషన్ తో వెలుగులోకి కొత్త విషయాలు

తాజాగా హత్య జరిగిన స్థలంలో పోలీసులు సీన్ రీ క్రియేషన్ చేశారు. ఈ సందర్భంగా పలు వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య జరిగిన స్థలంలో సోనమ్ తో పాటు ముగ్గురు నిందితులు అక్కడే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కత్తితో మూడుసార్లు పొడిచి చంపినట్లు వెల్లడించారు. ఇందుకోసం రెండు కత్తులను ఉపయోగించినట్లు చెప్పారు. హత్యకు ప్రధాన సూత్రధారి అయిన రాజ్ కుష్వాహా అనుమానం రాకుండా హత్యా స్థలానికి దూరంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మూడు వేట్లతో రాజా రఘు వంశీని హత్య చేసినట్లు తూర్పు ఖాసీ హిల్స్ పోలీసు సూపరింటెండెంట్ వివేక్ సయీమ్  తెలిపారు. అందులో ఒకటి వేటు విశాల్ వేయగా, రెండవ దెబ్బ ఆకాష్ కొట్టినట్లు తెలిపారు. చివరి వేటు ఆనంద్ వేసినట్లు వెల్లడించారు. రాజా మీద తొలివేటు పడగానే సోనమ్ అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిపారు. రాజా చనిపోయిన తర్వాత అతడి మృతదేహాన్ని లోయలో పడేసినట్లు వెల్లడించారు. ఆ తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు.

Also Read : మహిళా ఉద్యోగి ఇంట్లోకి దొంగచాటుగా దూరిన బాస్.. 

సోనమ్ పేరెంట్స్ కు నార్క్ టెస్ట్ చేయాలన్న రాజా సోదరుడు

అటు ఈ కేసుకు సంబంధించి సోనమ్ పేరెంట్స్ కు కూడా నార్కో టెస్టులు చేయాలని రాజా సోదరుడు పోలీసులను కోరారు. తన సోదరుడి హత్య వారికి కుటుంబ సభ్యులకు తెలిసిన వారే చేయడంతో, దీని గురించి వారి తల్లిదండ్రులకు కూడా తెలిసి ఉండే అవకాశం ఉందన్నారు. ఈ కేసులో మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే సోనమ్ పేరెంట్స్, కుటుంబ సభ్యులకు నార్కో టెస్టులు చేయాలన్నారు.

Read Also:  ఓయో రూమ్‌లో భార్య బాగోతం.. భర్తను చూసి బిల్డింగ్‌ పైనుంచి దూకేసి..

Related News

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Big Stories

×