Hari Hara Veeramallu : ఏపీ డిప్యూటీ సీఏం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు వరుస సినిమాలను అనౌన్స్ చేసాడు. అందులో ఒకటి హరిహర వీరమల్లు.. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ అవ్వలేదు. ఇప్పటికే మార్చి నుంచి మే కు షిఫ్ట్ అయ్యింది. ఇప్పుడు ఆ డేట్ కూడా పోస్ట్ పోన్ అవ్వబోతుందనే వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు హరి హర వీరమల్లు రిలీజ్ డేట్ విషయంలో స్పస్పెన్స్ కంటిన్యూ అయ్యింది. మార్చి డేట్ మిస్ అయిన తరువాత మే 9న రిలీజ్ అని ప్రకటించిన కూడా దాదాపు ఆ డేట్ కూడా మారేలా ఉందని ఇండస్ట్రీలో టాక్..
వీరమల్లు షూటింగ్ పెండింగ్..
పవన్ కళ్యాణ్ నటిస్తున్న వీరమల్లు మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. కేవలం నాలుగు రోజుల డేట్స్ ఇస్తే సినిమా పూర్తి అవుతుంది. కానీ డేట్స్ మాత్రం పవన్ ఇవ్వట్లేదు. ఇప్పటికే ఈ చిత్రాన్ని 11 సార్లు వాయిదా వేశారు. చివరికి మే 9న విడుదల చేయబోతున్నామని ఇటీవలే ఒక అధికారిక ప్రకటన చేశారు. కానీ ఆ తేదీన కూడా రావడం కష్టమే అని ఫిల్మ్ నగర్ లో ఓ వార్త షికారు చేస్తుంది. ఇదే ఫైనల్ షూటింగ్ కావడంతో ఖచ్చితంగా ఇది చెయ్యాలి. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో డేట్స్ ఇవ్వడానికి కుదర్లేదు. నిర్మాత అడిగి అడిగి ఇక అలసిపోయారు. దాంతో ఈ మూవీ నిర్మాత పరిస్థితి దారుణంగా మారింది.
Also Read : ‘బ్రహ్మముడి’ కోసం మానస్ ఒక్కరోజుకు తీసుకొనే రెమ్యూనరేషన్ ఎంత..?
కొడుకుకు అగ్ని ప్రమాదం..
ఇటీవల తన కొడుకుకు అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.. దాంతో ఆయన మరో నాలుగు రోజులు అక్కడే ఉన్నారు. ఇండియాకు ఇవాళ తిరిగి వచ్చేసాడు. డేట్స్ గురించి టీమ్ అడిగితే మరో వారం రోజులు టైం అడిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రత్నం కి ఏమి మాట్లాడలేని పరిస్థితి. ఒకపక్క అమెజాన్ ప్రైమ్ సంస్థ నుండి తీవ్రమైన ఒత్తిళ్లు ఎదురు అవుతున్నాయి. మే నెలలో విడుదల చేయకపోతే మీతో కాంట్రాక్టు రద్దు చేసుకుంటామని సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది.. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ 4 రోజుల షూటింగ్ పూర్తి చేసుకోవాల్సి ఉంది.. అది పూర్తి అయితే మాత్రం త్వరలోనే సినిమాను థియేటర్లలోకి తీసుకొని రావచ్చు. ఇప్పటికే నిర్మాతకు బడ్జెట్ 300 కోట్ల రూపాయిలు దాటేసింది. పాపం ఆయన బాధని ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదట. మరోపక్క పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కూడా సహనం నశించింది. మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఇప్పటికైన స్పందిస్తారేమో చూడాలి.. ఇక దీంతో పాటుగా పవన్ కళ్యాణ్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను కూడా చెయ్యాల్సి ఉంది. ఓజీ మూవీ సగం పైగా షూటింగ్ పూర్తి అయ్యింది. దానికి ఎప్పుడు మోక్షం కలుగుతుందో చూడాలి..