BigTV English

Gurugram Crime| 7 ఏళ్ల బాలుడిని హత్య చేసిన తల్లి లివ్ ఇన్ పార్టనర్.. ఎందుకు చేసాడంటే..

ప్రీతి అనే మహిళ భర్త విజయ్ కుమార్ గత సంవత్సరం ప్రమాదంలో చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె ఉత్తర్ ప్రదేశ్, బిజ్ నోర్ కు చెందిన వినీత్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇంట్లో అభ్యంతరం చెప్పడంతో వినీత్, ప్రీతి సహజీవనం చేస్తున్నారు. ప్రీతికి ఆమె భర్త వల్ల ఇద్దరు కుమారులు మను (7), ప్రీత్ (8) ఉన్నారు. ఇద్దరు పిల్లలు కూడా తల్లి వద్దే ఉన్నారు.

Gurugram Crime| 7 ఏళ్ల బాలుడిని హత్య చేసిన తల్లి లివ్ ఇన్ పార్టనర్.. ఎందుకు చేసాడంటే..

Gurugram Crime| ఒక ఏడు సంవత్సరాల బాలుడిని.. అతని తల్లితో సహజీవనం చేసే వ్యక్తి దారుణంగా కొట్టి చంపాడు. మరో బాలుడు పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన సోమవారం రాత్రి గురుగ్రామ్ లో జరిగింది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రీతి అనే మహిళ భర్త విజయ్ కుమార్ గత సంవత్సరం ప్రమాదంలో చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె ఉత్తర్ ప్రదేశ్, బిజ్ నోర్ కు చెందిన వినీత్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇంట్లో అభ్యంతరం చెప్పడంతో వినీత్, ప్రీతి సహజీవనం చేస్తున్నారు. ప్రీతికి ఆమె భర్త వల్ల ఇద్దరు కుమారులు మను (7), ప్రీత్ (8) ఉన్నారు. ఇద్దరు పిల్లలు కూడా తల్లి వద్దే ఉన్నారు.

Also Read: రూ.30 లక్షలు ఇస్తామని చెప్పి మోసం..కిడ్నీ దాతల దా‘రుణం’


పిల్లలంటే ఇష్టపడని వినీత్ తరుచూ.. ప్రీతి ఇంట్లో లేని సమయంలో వారిని కొట్టేవాడని వారి తాత తెలిపాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన వినీత్.. ఇంట్లో ప్రీతి లేకపోవడం చూసి.. ఇద్దరు పిల్లలను చితకబాదాడు. చిన్న వాడు మనుని బలంగా గోడకేసి విసిరి కొట్టాడు. మరో పిల్లాడు ప్రీత్ ని నేలకేసి కొట్టాడు. ఈ ఘటనలో మను తల నుంచి తీవ్రంగా రక్తస్రావం అయింది.

ప్రీతి ఇంటికి రాగానే ఇద్దరు పిల్లలు అపస్మారక స్థితిలో రక్త కారడం చూసి.. కేకలు పెట్టింది. దీంతో పొరుగు ఇంటి వారు వచ్చి పిల్లలను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో డాక్టర్లు మను చనిపోయాడని నిర్ధారించారు. మరో పిల్లాడు ప్రీత్ పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో డాక్టర్లు అతనికి చికిత్స అందిస్తున్నారు.

Also Read: విరాట్ కోహ్లికి చెందిన పబ్ పై కేసు నమోదు.. బెంగళూరులో ఎఫ్ఐఆర్

మను హత్యకు కారణమైన వినీత్ ని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Man kills LIve-in Partner’s son In Gurugram

 

Tags

Related News

Cyber fraud: 2 నెలల్లో 500 కోట్లు.. ఇదేం మోసం.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు!

Sahasra Murder Case: మా బిడ్డను హత్య చేసినట్టే వాడిని చంపేయాలి.. పీఎస్ ముందు కుటుంబ సభ్యుల నిరసన

Sahasra Murder: సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు.. క్రికెట్ బ్యాట్ కోసమే ఇదంతా..?

Dharmasthala Case Updates: ధర్మస్థల మాస్‌ బరియల్‌ కేసులో బిగ్ ట్విస్ట్‌..

Sahasra Murder Case: సహస్ర హత్య కేసులో నమ్మలేని నిజాలు.. బాలుడి సైకో అవతారం బయడపడింది..!

West Bengal News: భార్యను ముక్కులు ముక్కలుగా నరికి.. గుండెను వేరు చేసి.. చివరకు..?

Big Stories

×