Honeymoon Murder Case: రాజా రఘువంశీ-సోనమ్ హనీమూన్ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు ఎంత తప్పు చేసినా, ఎక్కడో దగ్గర దొరికిపోతారు. ఈ కేసులో సోనమ్ కూడా అదే చేసింది. భర్తను చంపాలన్న కంగారులో కీలక ఆధారాలను హోమ్ స్టేలో విడిచిపెట్టింది. మేఘాలయ పోలీసుల దర్యాప్తుకు కీలకమయ్యాయి. ఈ కేసు గుట్టు విప్పడానికి అవి సహాయపడ్డాయి.
క్రైమ్ సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో తెరపైకి చూస్తేనే గానీ తెలీదు. రాజా రఘువంశీ హత్య కేసులో సోనమ్ స్కెచ్ మామూలుగా లేవు. ట్విస్టుల మీద ట్విస్టుల బయటపడుతున్నాయి. భర్తను చంపిన విషయంలో ఎలాంటి ఆధారాలు దొరక్కుండా జాగ్రత్త పడింది సోనమ్. భర్తను దూరం పెడుతూ తన ప్లాన్ ఒకొక్కటిగా అమలు చేస్తూ వచ్చింది.
నిందితులు అరెస్టు కావడంతో మేఘాలయలో ఏం జరిగింది? ఆ గుట్టు విప్పే పనిలో పడ్డారు ఇండోర్ పోలీసులు. రాజా హత్య కేసును ఛేదించడంలో హోమ్‌స్టేలో కీలకమైన ఆధారాలు మేఘాలయ పోలీసులకు చిక్కాయి. అప్పటివరకు వీరి గురించి ఎలాంటి ఆచూకీ లభించలేదు.
చివరకు హోమ్ స్టే కీలకంగా మారింది. అక్కడ దొరికిన ఆధారాల్లో మంగళసూత్రం, చేతి రింగు లభించాయి. దాని ఆధారంగా కేసు ఒక్కో అడుగు ముందుకెళ్లిందని మేఘాలయ డీజీపీ నోంగ్‌రాంగ్ ఆయా విషయాలు మీడియా దృష్టికి తెచ్చారు. రాజా-సోనమ్ జంట మే 20న గౌహతి మీదుగా మేఘాలయకు చేరుకున్నారు.
ALSO READ: మరో భర్త బలి.. ఈసారి నదిలోకి తోసేసి
మే 23న తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని సోహ్రాలో-నోంగ్రియాట్ గ్రామంలోని హోమ్‌స్టే చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి సోనమ్ సహా నిందితులంతా కనిపించకుండా ఎస్కేప్ అయ్యారు. సోహ్రాలోని హోమ్‌స్టేలో సోనమ్ వదిలివేసిన సూట్‌కేస్ నుండి మంగళసూత్రం, ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మేఘాలయ డీజీపీ తెలిపారు.
కొత్త పెళ్లయిన వివాహిత మంగళసూత్రం, రింగు వదిలి వెళ్ళడంపై కొత్త అనుమానాలు వచ్చాయన్నారు. వివాహిత హిందూ మహిళలు ధరించే పవిత్రమైన హారం లాంటింది మంగళసూత్రం. భర్తతో భార్య బంధాన్ని సూచిస్తుందన్నారు. కొత్తగా పెళ్లయిన వాళ్లు మంగళసూత్రాన్ని మెడ నుంచి అసలు బయటకు తీయరని అన్నారు.
మే 22న ముందస్తు బుకింగ్ లేకుండా సోహ్రాలోని హోమ్‌స్టేలోకి అడుగుపెట్టింది ఈ జంట. వారికి అక్కడ గది దొరకలేకపోవడంతో సూట్‌కేస్‌ను హోమ్‌స్టేలో ఉంచాలని డిసైడ్ అయ్యారు. మే 23న తెల్లవారుజామున అక్కడి నుంచి బయలుదేరారు. ఉదయం టెక్కింగ్ చేసి అక్కడ ఓ స్కూటర్ తీసుకొని వీసావ్‌డాంగ్ జలపాతానికి వెళ్లారు. అక్కడ రాజాను భార్య ముందు కాంట్రాక్ట్ కిల్లర్లు చంపినట్టు అనుమానిస్తున్నారు.
నాంగ్రియాట్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు దంపతులతో పాటు హిందీ మాట్లాడే మరో ముగ్గురు వ్యక్తులను చూసినట్లు ఓ టూర్ గైడ్ పోలీసులకు చెప్పాడు. దీంతో దర్యాప్తు చేసేందుకు పోలీసులకు మరిన్ని ఆధారాలు లభించాయి. లభించిన ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ చూపించి విచారించడంతో నిందితులు నేరం అంగీకరించినట్లు సమాచారం.