Star Heroine: నాడే కాదు నేటికీ కూడా చాలామంది డబ్బు సంపాదించుకోవడానికి ముఖానికి రంగు పులుముకున్నాము అంటూ చెప్పిన సందర్భాలు కోకొల్లలు. “దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని”.. అవకాశాలు వచ్చినప్పుడే.. తమ లక్ష్యాన్ని విచ్ఛిన్నం చేయకుండా కోట్ల రూపాయలను వెనకేసుకుంటూ.. ఇటు ఎంతోమంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు. ఈ కోవలోకి ప్రముఖ శాండల్ వుడ్ బ్యూటీ రచితా రామ్(Rachita Ram) కూడా వచ్చే చేరారు . ఈమెను కన్నడ నాట డింపుల్ క్వీన్ గా అభిమానులు ఆప్యాయంగా పిలుస్తూ ఉంటారు. కుటుంబానికి వేలకోట్ల ఆస్తులున్నా.. సినిమాపై అభిరుచితోనే హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఎప్పుడు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఎంతో మందిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.
ప్రైవేట్ జెట్ కలిగిన కన్నడ హీరోయిన్..
ఈమెకు స్టార్ హీరో రేంజ్ లో పాపులారిటీనే కాదు సంపాదన కూడా ఉందని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు
ఈమెకంటూ ఒక ప్రైవేట్ జెట్, లగ్జరీ కార్ అద్భుతమైన బంగ్లా అన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. రచితా రామ్ విషయానికి వస్తే.. కన్నడ నాట అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో ఒకరిగా పేరు సొంతం చేసుకున్నారు. 12 సంవత్సరాలుగా కన్నడ చిత్ర పరిశ్రమలో పలు చిత్రాలలో నటించి, తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నారు. రచితా రామ్ కన్నడలో పునీత్ రాజకుమార్ (Punith Raj Kumar), శివరాజ్ కుమార్ (Shiva Raj Kumar), సుదీప్(Sudeep ), గణేష్ (Ganesh), దర్శన్(Darshan )వంటి కన్నడ స్టార్ హీరోలు అందరితో కూడా కలిసి నటించింది. పుష్కర కాలంగా విజయవంతమైన సినిమాలు చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.
రచితా రామ్ సినిమాలు..
రచితా రామ్ సినిమాల విషయానికొస్తే.. మాన్సూన్ రాగా, లవ్ యు రచ్చు , రన్న, క్రాంతి వంటి కన్నడ హిట్ సినిమాలలో నటించింది. అక్కడ తన అందంతోనే కాదు నటనతో కూడా అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఇకపోతే ఒక్కో సినిమాకు దాదాపుగా కోటి రూపాయల వరకు పారితోషకం తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. వాస్తవానికి టాలీవుడ్, బాలీవుడ్ లో ఈ అమౌంట్ పెద్దది ఏమీ కాకపోయినా.. కన్నడ నాట ఇది ఒక పెద్ద అమౌంట్ అని చెప్పవచ్చు. 2013లోనే బుల్బుల్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె, హీరోయిన్గా నటిస్తూనే పలు రియాల్టీ షోలలో కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు పలు ప్రోగ్రామ్లకు జడ్జిగా వ్యవహరించడం వల్ల భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఇంస్టాగ్రామ్ లో కూడా బ్రాండింగ్ ప్రమోషన్ చేస్తూ ఉంటారు. అక్కడే భారీ స్థాయిలో చార్జీలు కూడా వసూలు చేస్తున్నట్లు సమాచారం.
రచిత రామ్ ప్రైవేట్ జెట్ చూశారా?
ఇక రచిత రామ్ ఇటీవల తన ప్రైవేట్ జట్టులో ప్రయాణించే వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో ఈమెకి ఉన్న ప్రైవేట్ జట్టు చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ప్రైవేట్ జెట్ కలిగి ఉన్న ఏకైక నటిగా కూడా నిలిచారు. ఇంకా ఈమె ఆస్తులు కూడా వందల కోట్లు ఉన్నాయని సమాచారం. ఏది ఏమైనా ఇక్కడ బడా హీరోలు మాత్రమే ఇలా ప్రైవేటు జెట్ కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ అక్కడ కన్నడ హీరోయిన్ ప్రైవేట్ జెట్ కలిగి ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.