Gukesh Visits tirumala : వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచిన భారత యువ గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం దొమ్మరాజు గుకేష్ పేరు ప్రస్తుతం మారుమ్రోగుతున్న విషయం తెలిసిందే. చెస్ విషయంలో ఎవరినీ కదిలించినా గుకేష్ గురించే చర్చించుకోవడం విశేషం. ఇటీవల సింగపూర్ వేదికగా జరిగిన వరల్డ్ చెస్ ఛాంపియన్ టోర్నీ ఫైనల్ లో 18 ఏళ్ల గుకేష్ డిఫెండింగ్ ఛాంపియన్ చైనా స్టార్ డింగ్ లిరెన్ ను ఓడించాడు. దీంతో వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా దొమ్మరాజు గుకేష్ రికార్డు సృష్టించాడు. గుకేష్ విజయంలో టీమిండియా మాజీ కోచ్ ప్యాడీ ఆప్టన్ కీలక పాత్ర పోషించాడు. మెంటల్ కండిషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్ కి మంచి గుర్తింపు ఉంది. గుకేష్ ఏకాగ్రత దెబ్బ తినకుండా ప్యాడీ ఆప్టన్ అతనికీ అండగా నిలిచాడు. వరల్డ్ చెస్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో గుకేష్ ఏకాగ్రతను దెబ్బ తీసేందుకు చైనా ప్లేయర్ డింగ్ లిరెన్ తీవ్రంగా ప్రయత్నించాడు.
Also Read : WTC Final 2025: దక్షిణాఫ్రికాకు నరకం చూపిస్తున్న ఆసీస్.. తొలి రోజు స్కోర్ ఎంతంటే ?
ఇక ఇదిలా ఉంటే.. తాాజాాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు వరల్డ్ చెస్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్. అయితే తనకు తిరుమల లోని శ్రీవేంకటేశ్వరుడి దర్శనం మంచిగా లభించిందని.. తాను వరల్డ్ ఛాంపియన్ గా గెలవడానికి కారణం తిరుమల వెంకటేశ్వరుడు అని చెప్పాడు. తిరుమల శ్రీ వారి ఆశీస్సులతోనే వరుస విజయాలు సాధించానని.. అందుకే తిరుమల శ్రీవారి మొక్కును తీర్చుకున్నానని తెలిపాడు. తాను మంచి హర్డ్ వర్క్ చేయడం వల్ల మంచి ఫలితాలుమ వచ్చాయని వెల్లడించాడు గుకేష్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం విశేషం. ప్రపంచ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచిన దొమ్మరాజు గుకేష్ కు ట్రోఫీ తో పాటు రూ.11.45 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు.
ఇదిలా ఉంటే.. నార్వే చెస్ 2025 టోర్నమెంట్ విజేతగా ప్రపపంచ నెంబర్ 1 మాగ్నస్ కార్ల సన్ నిలిచాడు. ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్, భారత యువ సంచలనం గుకేష్, అమెరికాా గ్రాండ్ మాస్టర్ ఫాబియానో కరువాను ఓడించి టైటిల్ ను గెలుచుకున్నాడు మాగ్నస్. ఇక ఈ ఏడాది ప్రారంభంలో క్యాండిడేట్స్ టోర్నీలో గుకేష్ గెలిచిన తరువాత.. మెంటల్ కండిషనింగ్ కోచ్ కోసం వెతికాడు. ఈ తరుణంలోనే కోచ్ ప్యాడీ ఆప్టన్ ను సంప్రదించాడు. ప్యాడీ కోచింగ్ గుకేష్ కి ఎంతగానో ఉపయోగపడింది. గుకేష్ ను ఒత్తిడిలోకి నెట్టేందుకు లిరెన్ చాలా ప్రయత్నించినప్పటికీ.. బెదరలేదు. నేరుగా తనవైపే చూసినా భయపడలేదు. దేని గురించి ఆలోచించకుండా తన పని ఏంటో తాను చేసుకుపోయాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో మానసికంగా బలంగా ఉండేందుకు గుకేష్ పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాడు. ముఖ్యంగా చెస్ పై పూర్తిగా అవగాహన పెంచుకున్న తరువాతనే బరిలోకి దిగాడు. అందుకే గుకేష్ ప్రపంచ వరల్డ్ ఛాంపియన్ షిప్ టైటిల్ సాధించాడు.
?igsh=amtyeHg4bndsczg3