Noida: దేశంలో ఎండలు ఇంకా మండిపోతున్నాయి. ఇంకా రుతుపవనాలు అన్ని రాష్ట్రాలకు పూర్తిగా వ్యాపించలేదు. అధిక వేడి కారణంగా ఏసీలు తపాసుల మాదిరిగా పేలిపోతున్నాయి. తాజాగా యూపీలోని నోయిడా సెక్టార్-119లో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
నోయిడాలోని హౌసింగ్ సొసైటీలో భారీ అగ్నిప్రమాదం
సోమవారం ఉదయం నొయిడాలోని సెక్టార్ 119లో ఉన్న అరణ్య సొసైటీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భారీ ఎత్తైన భవనంలో భారీ ఈ ప్రమాదం సంభవించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం.. ఎయిర్ కండిషనింగ్ యూనిట్‌లో భారీ పేలుడు సంభవించడంతో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది.
ఘటన గురించి తెలియగానే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు ఆరు ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది అపార్ట్‌మెంట్‌లోని మిగతా వారిని అప్రమత్తం చేశారు. మంటలు ఇతర ఫ్లాట్లకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. దాదాపు నాలుగు గంటలపాటు శ్రమించారు సిబ్బంది.
ఏసీ యూనిట్‌లో భారీ పేలుడు, ఎగిసిపడిన మంటలు
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెబుతున్నారు పోలీసులు. మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత వస్తుందని చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చే పనిలో పడ్డారు. మహాజన్‌కు చెందిన 2105 నంబర్ ఫ్లాట్ దెబ్బతింది. అందులో మహాజన్, ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలతో ఉంటున్నారు.
నోయిడాలో జరిగిన అగ్నిప్రమాదంపై యూపీ సీఎం యోగి రియాక్ట్ అయ్యారు. అధికారులకు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. రెస్క్యూ చర్యలను వేగవంతం చేయాలన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందేలా చూడాలని అధికారులను నిర్దేశించారు. అన్ని స్థాయిలలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి కోరారు.
ALSO READ: కారు రివర్స్ చేస్తుండగా ప్రమాదం.. ఓకే ఫ్యామిలీలో నలుగురు మృతి, ఇలా మీరు చేయొద్దు!
జూన్ నెల ప్రారంభంలో నోయిడాలోని సెక్టార్ 74, సెక్టార్ 52 ల్లో రెండు నివాస భవనాలలో అగ్నిప్రమాదాలు నమోదయ్యాయి . సెక్టార్ 74లోని 28 అంతస్తుల ఐవీ కౌంటీ సొసైటీలోని 12వ అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో ఉదయం 8 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటన మూడోది. ఎల్ నినో కారణంగా దేశవ్యాప్తంగా రుతుపవనాల రాక ఆలస్యమైంది. యూపీ, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
పగటి వేళ కాదు రాత్రిళ్లు ఉష్ణోగ్రతలు సాధారణానికి మించి నమోదు అవుతున్నాయి. ఫలితంగా ప్రజలు తీవ్రమైన ఉక్కపోత సమస్యను ఎదుర్కొంటున్నారు. డే అండ్ నైట్ ఏసీలు ఆన్ చేసి ఉండడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ తరహా ఘటనల నేపథ్యంలో కూలర్లు, ఏసీల విషయంలో జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచనలు చేస్తున్నారు అధికారులు.
#BREAKING | Massive fire breaks out at Noida's Aranya society after AC blast; firefighting operation underway #NoidaFire #Noida #AasthaSpintexIPOLive pic.twitter.com/u2SbZBfvw2
— RapidBulletin (@BulletinRa3) June 29, 2026