E-Paper
Advertisement

విశాఖ స్క్రాప్ గోడౌన్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

విశాఖ స్క్రాప్ గోడౌన్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు
Advertisement

Visakhapatnam: విశాఖపట్నంలోని సీ హార్స్ జంక్షన్ వద్ద భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. టౌన్ కొత్త రోడ్డు సమీపంలోని ఒక స్క్రాప్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించింది. దుకాణంలో పాత సామాగ్రి, ప్లాస్టిక్ వంటి వ్యర్థాలు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి, ఆకాశమంత ఎత్తున దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది.

ఈ ప్రమాదం జరిగిన ప్రాంతానికి అతి సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండటం గమనార్హం. మంటలు గనుక అదుపు తప్పి పెట్రోల్ బంక్ వరకు వ్యాపిస్తే పరిస్థితి ఊహించని విధంగా ఉంటుందని భావించిన స్థానికులు ఒక్కసారిగా పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Advertisement

ప్రస్తుతానికి అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా కట్టడి చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. విశాఖపట్నంలోని ప్రధాన కూడలిలో ఈ ఘటన జరగడంతో ట్రాఫిక్ కూడా కాసేపు నిలిచిపోయింది.

Also Read:పెళ్లి విందులో ‘లెగ్ పీస్’ వార్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Advertisement

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×