Shahid Afridi: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఏదో ఒక కామెంట్ చేస్తూ… వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో భాగంగా జరిగే మ్యాచ్ లపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నాడు. అలాంటి షాహిద్ అఫ్రిది మొబైల్ ఫోన్ల (mobile phones) వినియోగంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. పెళ్లిళ్లు అయ్యే వరకు అమ్మాయిలకు మొబైల్ ఫోన్స్ ఇవ్వకూడదని.. సూచనలు చేశారు. అమ్మాయిలకు పెళ్లిళ్లు కాకముందు మొబైల్స్ ఇస్తే వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయని బాంబు పేల్చారు. తన కూతురికి కూడా పెళ్లి తర్వాతనే మొబైల్ ఇచ్చానని గుర్తు చేశారు. దీంతో షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసే షాహిద్ అఫ్రిది… తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మొబైల్ వినియోగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఫోన్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోరారు. మొబైల్ ఫోన్లు వాడడం అంటేనే పెద్ద రోగమని మండిపడ్డారు. వాటిని చిన్న పిల్లలకు ఇచ్చి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన దృష్టిలో అమ్మాయిలకు మొబైల్ ఫోన్స్ అస్సలు ఇవ్వకూడదని బాంబు పేల్చారు. పెళ్లి తర్వాత మాత్రమే మహిళలకు మొబైల్స్ ఇస్తే మంచిదని సూచనలు చేశారు.
తాను కూడా తన కూతుర్లకు వివాహం తర్వాత మొబైల్స్ ( Mobiles) కొనిచ్చానని స్పష్టం చేశాడు. మొబైల్స్ చూపిస్తూ మరి.. షాహిద్ అఫ్రిది ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. పొద్దున లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు అందరూ మొబైల్స్ వినియోగిస్తున్నారని.. దీనివల్ల అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. చిన్నపిల్లడి నుంచి ముసలాడి వరకు అందరూ మొబైల్ ఫోన్స్ వాడడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొబైల్ ఫోన్స్ లేకపోతే జీవితమే లేనట్లుగా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగాడు. రోజులో కొన్ని గంటలైనా మొబైల్ ఫోన్స్ కు దూరంగా ఉండాలని రిక్వెస్ట్ చేశారు. లేకపోతే పెను ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో జనాలు అప్డేట్ అవుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో మొబైల్ ఫోన్లను పెళ్లిళ్లు అయ్యేవరకు వాడకూడదు అంటే ఎలా ? కొంచమైనా సిగ్గుండాలి అలాంటి మాటలు మాట్లాడడానికి అంటూ షాహిద్ అఫ్రిదికి కౌంటర్ ఇస్తున్నారు.
Former Pakistani cricketer Shahid Afridi said that children and girls should not be given mobile phones. According to him, girls should get mobile phones only after marriage.
Shahid Afridi even said that he gave mobile phones to his own daughters only after their marriage. He… pic.twitter.com/k60RgpOPSA
— Saffron Chargers (@SaffronChargers) May 12, 2026