Medipalli Lovers Suicide: నేటి సమాజంలో ప్రేమ అనేది ఒక మధురమైన అనుభూతిగా మిగలాల్సింది పోయి.. విషాదాంతంగా మారుతోంది. ప్రేమించిన వ్యక్తి కోసం బతకాలి అన్న సంకల్పం కంటే.. ప్రేమించిన వ్యక్తి కోసం చావాలి అన్న నిర్ణయమే నేటి యువతలో ఎక్కువగా కనిపిస్తోంది. ఒకరు మరణిస్తే ‘నువ్వు లేని లోకంలో నేను ఉండలేను’ అంటూ మరొకరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటనే ఇప్పుడు మేడ్చల్ జిల్లా మేడిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
మేడ్చల్ జిల్లా మేడిపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రియురాలి మరణం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు మహేష్ అనే యువకుడు. మేడిపల్లి గ్రామానికి చెందిన సిద్ధగోని మహేష్ , పూజ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. అయితే .. మంగళవారం పూజ తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహానికి లోనయ్యారు. పూజ మరణానికి మహేష్ కారణమని ఆరోపిస్తూ.. అతని ఇంటి ముందు ఆందోళనకు దిగారు.
ప్రియురాలి మరణం కలిగించిన బాధ ఒకవైపు.. ఆమె కుటుంబం చేస్తున్న ఆరోపణలు మరోవైపు మహేష్‌ను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశాయి. దీంతో బుధవారం నాడు బ్రహ్మణపల్లి చెరువు సమీపంలో మహేష్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిని అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ జంట మరణంతో మేడిపల్లిలో తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ: ఎనిమిది మందిపై కుక్క దాడి.. కొట్టి చంపిన గ్రామస్తులు
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో విషాదం
ప్రియురాలు చనిపోయిందన్న ఆవేదనతో హయత్ నగర్ పరిధిలో మహేష్ ఆత్మహత్య
కొంతకాలంలో ఓ యువతిని ప్రేమిస్తున్న మహేష్
ఇరువర్గాల పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో నిన్న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న ప్రియురాలు
రెండు రోజుల వ్యవధిలో ఆత్మహత్య… pic.twitter.com/D3nElh6rhL
— BIG TV Breaking News (@bigtvtelugu) January 7, 2026