Medchal Road Accident : మేడ్చల్ చెక్ పోస్ట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టీవీఎస్ వాహనాన్ని వెనకనుంచి లారీ ఢీ ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు.
మేడ్చల్ చెక్ పోస్ట్ వద్ద పెను ప్రమాదం చోటు చేసుకుంది. టీవీఎస్ ను వెనుకు నుంచి లారీ ఢీకొనటంతో ముగ్గురు మృతిచెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తుంది. టీవీఎస్ పై వెళ్తున్న భార్యాభర్త చిన్నారిపై నుంచి లారీ దూసుకెళ్లటంతో అక్కడిక్కడే మృతి చెందగా.. బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడ్ని ఆసుపత్రికి తరలించి.. మృతదేహాలను పోస్ట్ మార్టంకు పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ALSO READ : సీఎంఆర్ కాలేజీ కేసులో ఇద్దరి అరెస్ట్.. పోలీసుల దర్యాప్తులో తేలింది ఇదే!