Prabhas: సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియా తప్పనిసరిగా ఉండాలి. ఎప్పటికప్పుడు వారంతా ప్రేక్షకులతో టచ్‌లో ఉంటూ వారి పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను అందరితో పంచుకుంటూ ఉండాలి అని అంటుంటారు. అలా లేకపోతే సినీ సెలబ్రిటీలను ప్రేక్షకులు మర్చిపోతారేమో అనే ఒక భయం ఉంటుంది. అయినా కూడా ఇప్పటికీ పలువురు స్టార్లు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికీ కొందరికి సోషల్ మీడియాలో అఫీషియల్ అకౌంట్స్ లేవు. కొన్నాళ్ల క్రితం వరకు పాన్ ఇండియా ప్రభాస్ కూడా ఇదే లిస్ట్‌లో ఉండేవాడు. కానీ కొన్నేళ్ల క్రితం తన ఫ్యాన్స్‌ను హ్యాపీ చేయడం కోసం తను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టాడు. మరి ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇలాంటి ఒక స్పెషల్ డే గుర్తుందా.?
ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగు
‘మిర్చి’ సినిమా తర్వాత దాదాపు అయిదేళ్లు గ్యాప్ తీసుకొని ‘బాహుబలి’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్. ‘మిర్చి’ వరకు ప్రభాస్‌కు కాస్త ఫ్యాన్ బేస్ ఉన్నా ‘బాహుబలి’ తర్వాతే తను పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. అప్పటివరకు కూడా తనకు సోషల్ మీడియా అకౌంట్ అనేది లేదు. తనకు సంబంధించిన ప్రొఫెషనల్ విషయాలన్నీ మేకర్సే స్వయంగా ప్రకటించేవారు. కానీ తను మాత్రం సోషల్ మీడియాకు దూరంగానే ఉండేవాడు. అలాంటిది ‘బాహుబలి’ రిలీజ్ అయిన తర్వాత తనకు కూడా ఒక సోషల్ మీడియా అకౌంట్ ఉంటే బాగుంటుంది అనుకున్నాడో ఏమో ప్రభాస్.. ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టాడు.
అదే పోస్టర్‌తో
2015లో ‘బాహుబలి’ విడుదలయ్యి బ్లాక్‌బస్టర్ అయ్యింది. ఆ తర్వాత రెండేళ్లకే ‘బాహుబలి 2’ వచ్చి అది అంతకు మించిన హిట్‌ను సాధించింది. దీంతో ప్రభాస్‌కు పాన్ ఇండియా రేంజ్ పాపులారిటీ వచ్చింది. అందుకే బాగా ఆలోచించి ‘బాహుబలి 2’ విడుదలయిన రెండేళ్ల తర్వాత తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండడం కోసం ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశాడు. 2019 ఏప్రిల్ 17న ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టి తన మొదటి పోస్ట్ షేర్ చేశాడు ప్రభాస్. ‘బాహుబలి 2’ నుండి ఒక పోస్టర్‌ను తన మొదటి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌గా అప్లోడ్ చేశాడు. దీంతో కొన్నిరోజుల వరకు అదే ఫోటోను చాలామంది ఫ్యాన్స్ కూడా తమ డీపీలుగా పెట్టుకున్నారు. అలా ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంటర్ అయ్యి ఆరేళ్లు పూర్తయ్యింది.
Also Read: ఇక్కడ జవాన్ కలెక్షన్స్ ఈజీగా లేస్తాయ్.. ఆయన స్టార్ పవర్ అలాంటిది
రిలీజ్ కోసం వెయిటింగ్
ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తను చివరిగా నటించిన ‘సలార్’ సినిమాతో ప్రభాస్‌కు మంచి కమ్ బ్యాక్ దొరికింది. చాలాకాలంగా ఫ్లాప్స్‌లో ఉన్న తనను మళ్లీ ఫామ్‌లోకి తీసుకొచ్చింది ఈ సినిమా. అందుకే ఇదే సక్సెస్ స్ట్రీక్‌ను కంటిన్యూ చేయాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ‘రాజా సాబ్’ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ మూవీ 2025 సంక్రాంతికే విడుదల కావాల్సింది. కానీ పలు కారణాల వల్ల పోస్ట్‌పోన్ అవుతూ వస్తోంది. సమ్మర్‌లో అయినా విడుదల అవుతుందేమో అని ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. ప్రస్తుతం ఫ్యాన్స్ అంతా ‘రాజా సాబ్’ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.