Director Bobby: రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి పవర్ సినిమాతో దర్శకుడుగా మారాడు. రవితేజ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి డైరెక్షన్ చేసే అవకాశం దొరికింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఇక ఎన్టీఆర్ హీరోగా జై లవకుశ అనే సినిమాతో అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. బాబీ కెరియర్ లో దాదాపు అన్ని హిట్ సినిమాలు పడ్డాయి. ఇప్పటివరకు బాబీ చేసిన ఫిలిమ్స్ లు బెస్ట్ ఫిలిం అంటే వాల్తేరు వీరయ్య అని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమాకి చాలామంది రివ్యూవర్స్ చాలా తక్కువ రేటింగ్ ఇచ్చినా కూడా అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత చేసిన సినిమాలన్నిటిలో కూడా ఈ సినిమాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మెగాస్టార్ నుంచి అభిమానులకి ఏం కోరుకుంటారు అవి ప్రజెంట్ చేశాడు బాబి.
ఇక ప్రస్తుతం బాబి నందమూరి బాలకృష్ణతో డాకు మహారాజ్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుక విడుదలకు సిద్ధమవుతుంది. సినిమాకి సంబంధించి రీసెంట్ గా టీజర్ కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ టీజర్ ప్రారంభం నుంచి చివరి వరకు చాలా ఆసక్తికరంగా ఉంది. సినిమా మీద అంచనాలను కూడా మరింత పెంచింది. ముఖ్యంగా బాలకృష్ణ సినిమా అంటే తమన్ ఎలా మ్యూజిక్ ఇస్తాడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సీన్స్ ని తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంటాడు తమన్. ఈ టీజర్ లో కూడా తమన్ సిగ్నేచర్ కనిపించింది. అలానే ఊహించిన దానికంటే కొన్ని రెట్లు ఎక్కువగానే టీజర్ ఉంది. రామ్ గోపాల్ వర్మ వంటి దర్శకులు కూడా ఈ ట్రైలర్ గురించి ప్రశంసించారు.
Also Read : Mahesh Babu Instagram Story: మహేష్ బాబు కి ఏమైనా పని చెప్పండి రాజమౌళి గారు
ఇక ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు బాబి. ఆ ఇంటర్వ్యూలో పలు రకాల ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ చిరంజీవి గారు కథలో కేవలం వేలు మాత్రమే కాకుండా బాడీ మొత్తం పెట్టేస్తారు. కథ ఏంటి.? సీన్ ఏంటి.? డైలాగ్స్ ఏంటి అని అంతగా సినిమాల్లో ఇన్వాల్వ్ అవుతారు అంటూ చెప్పుకొచ్చాడు. కానీ బాలకృష్ణ విషయానికి వస్తే డైరెక్టర్ ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్లిపోతాడు. ఒక క్వశ్చన్ కూడా చేయడు. అది దర్శకుడికి ఇంకా ఎక్కువ బర్డెన్ పెంచుతుంది. ఇంకా కేర్ఫుల్ గా పనిచేసేలా చేస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు బాబి. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుక విడుదల కానుంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.