BigTV English

Maha Kumbh Mela: కుంభమేళాలో డబ్బులే డబ్బులు.. టెక్నిక్ అదిరింది కదూ..

Maha Kumbh Mela: కుంభమేళాలో డబ్బులే డబ్బులు.. టెక్నిక్ అదిరింది కదూ..

Maha Kumbh Mela: మహా కుంభమేళాకు కోట్లల్లో భక్తులు తరలి వస్తున్నారు. ప్రయాగ్ రాజ్ వద్ద ఎటు చూసినా భక్త జనసందోహం కనిపిస్తోంది. ఎందరో సత్పురుషులు, నాగ సాదువులు, అఘోరాలు తరలిరాగా భక్తులు వారిని దర్శిస్తున్నారు. అయితే ఎందరో భక్తులకు మహా కుంభమేళా భక్తితో పాటు భుక్తిని అందిస్తోంది. ఇక్కడ జరిగే వ్యాపారాలు కూడ అధిక లాభాలను తెచ్చిపెడుతున్నాయట. దేశ విదేశాల నుండి భక్తులు రావడంతో ప్రయాగ్ రాజ్ వద్ద వ్యాపారం జోరుగా సాగుతోంది. అయితే కొందరు వ్యాపారాలు నిర్వహిస్తూ లాభాలు గడిస్తుంటే, మరికొందరు ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా గంటకు వేలల్లో డబ్బులు సంపాదిస్తున్నారు.


ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ వద్ద కుంభమేళా జనవరి 13న ప్రారంభమైంది. ఈ నెల 26 మహా శివరాత్రి నాడు ముగుస్తుంది. ఇప్పటికీ 6 రోజులు పూర్తి చేసుకున్న కుంభమేళాలో భక్తుల రాక రోజురోజుకు పెరుగుతోంది. ఎటు చూసినా భక్తుల సందడి కనిపిస్తోంది. ఎందరో నాగ సాధువులు, అఘోరాలు తమ ఆవాసాలలో ఉంటూ భక్తులను ఆశీర్వదిస్తున్నారు. కుంభమేళాకు వచ్చే భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా యూపీ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు దేశ విదేశాల నుండి వస్తున్నారు. అయితే ఇక్కడ ఒక్క చిన్న చిట్కాతో వేలు గడిస్తున్నారు భక్తులు.

ఇప్పటికే మహా కుంభమేళాలో వేప పుల్లల వ్యాపారం సాగిస్తూ కొందరు రోజుకు వేలల్లో డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ బిజినెస్ లోకి ఎక్కువ మంది అడుగు పెట్టగా, కొందరు మరో కొత్త తరహా ప్లాన్ వేసి వేలు సంపాదిస్తున్నారు. మహా కుంభమేళాలో త్రివేణి సంగమం వద్ద ఎందరో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అంతేకాదు నిరంతరం త్రివేణి సంగమం భక్తుల రద్దీతో ఉంటోంది. అలాగే మహా కుంభమేళా ముగిసే సమయం కూడ సమీపిస్తుండగా ఇప్పుడు ప్రయాగ్ రాజ్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనితో పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్దీకరించే పనుల్లో నిరంతరం బిజీబిజీగా ఉండే పరిస్థితి.


ఇలా కోట్లల్లో భక్తులు మహా కుంభమేళాకు వస్తుండగా, కొందరు చిన్న టెక్నిక్ తో అధిక ఆదాయం పొందుతున్నారు. త్రివేణి సంగమం వద్ద పుణ్యం కోసం భక్తులు నాణేలు వేస్తున్నారు. ఆ నాణేలను తీసుకొనేందుకు కొందరు ఎంచక్కా పెద్ద ప్లాన్ వేశారు. అయస్కాంతాలను ఒక కట్టెకు తాడు సాయంతో కట్టి, నీటిలోకి వదలడం, దానికి అతుక్కొని వచ్చిన నాణెంలను తీసుకోవడం. అలా రోజుకు ఒక్కొక్కరు సుమారు రూ. 5 వేలకు పైగా సంపాదిస్తున్నారట.

Also Read: AP Govt Whatsapp Governance Service: విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు గుడ్ న్యూస్..

ఇదే తరహా ప్లాన్ వేసిన కొందరు భక్తులు.. తమకు మహా కుంభమేళాలో పాల్గొనే అవకాశం భక్తి కోసం కాగా, భుక్తి మార్గాన్ని కూడ చూపిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, నెటిజన్స్ కూడ సూపర్ ట్రిక్ అంటూ కామెంట్స్ రూపంలో తెలుపుతున్నారు. ఏదిఏమైనా కొందరు వేప పుల్లల వ్యాపారం, మరికొందరు ఇలాంటి ట్రిక్స్ తో కుంభమేళాలో బాగానే ఆదాయం పొందుతున్నారు. మరో 15 రోజుల్లో మహా కుంభమేళా ముగియనుండగా, వాహనాలన్నీ ప్రయాగ్ రాజ్ వైపు మళ్ళాయని చెప్పవచ్చు.

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×