Kurnool Crime: సమాజం ఎటు పోతోంది? కామంధకారంలో పడి కన్నప్రేమను మర్చిపోతున్నారు కొందరు మహిళలు. తప్పును నిలదీశాడనే కోపంతో నవమాసాలు మోసి, పెంచిన కొడుకునే కడతేర్చిందో ఓ కషాయి తల్లి. ఈ దారుణమైన ఘటన కర్నూలు జిల్లా అదోని మండలం జి. హూసళ్లి గ్రామంలో చోటుచేసుకుంది.
స్వ గ్రామానికి చెందిన గంగమ్మకు దర్గప్ప అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలిసిన గంగమ్మ కుమారుడు వీరేంద్ర (15) నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన గంగమ్మ, తన కుమారుడిని ఎలా అయినా వదిలించుకోవాలని తన ప్రియుడితో కలిసి కొడుకును కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా శవాన్ని స్థానిక శ్మశానంలో పాతిపెట్టింది. ఆపై ఏమీ తెలియనట్టు తన కొడుకు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు, విచారణ ఆలస్యమవుతోందంటూ హైకోర్టును కూడా ఆశ్రయించి నాటకమాడింది.
హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సిట్ అధికారులు నిఘా పెట్టగా అసలు నిజం బయటపడింది. కన్నతల్లే ఈ ఘాతుకానికి ఒడిగట్టిందని తేలింది. దీంతో రెవెన్యూ, వైద్య బృందాల సమక్షంలో శ్మశానంలో పాతిపెట్టిన వీరేంద్ర మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. అయితే, పోలీసుల విచారణ భయంతో తీవ్ర అనారోగ్యానికి గురైన తల్లి గంగమ్మ.. కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
Also Read: నిర్మల్ జిల్లాలో ఘోరం.. కూలర్‌లో నీళ్లు పోస్తూ తండ్రీకొడుకులు దుర్మరణం!
కర్నూలు జిల్లాలో అదోనిలో మండలం జి.హోసళ్లి గ్రామానికి చెందిన గంగమ్మ దర్గప్ప అనే వ్యక్తితో ఉన్న వివాహేతర సంబంధాన్ని నిలదీసినందుకు
కన్నకొడుకు వీరేంద్రను (15) తల్లి గంగమ్మ ప్రియుడితో కలిసి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసింది
శవాన్ని శ్మశానంలో పాతిపెట్టి..కొడుకు కనిపించడం లేదంటూ… pic.twitter.com/jOIWrAOqBF
— BIG TV Breaking News (@bigtvtelugu) June 1, 2026