NEET Exam: నీట్-2026 పరీక్ష విధానం మార్పుపై కీలక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పరీక్ష ప్రక్రియను మార్చడం కుదరదని తేల్చేసింది. సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. పేపర్ పెన్ ఫార్మాట్‌లో పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది.
నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
దేశవ్యాప్తంగా సంచనలం రేపింది నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం. నీట్ రీఎగ్జామ్‌కు ఏజెన్సీ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నీట్ పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఆదేశాలను సవరించాలని కోరుతూ రాష్ట్రీయ జనతా దళ్ నేత సుధాకర్ సింగ్ వేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణకు వచ్చింది. జస్టిస్ పీఎస్ నరసిహ, అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది.
పిటిషన్ తరపు న్యాయవాది లేవనెత్తిన అంశాలను పరిశీలించింది ధర్మాసనం. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీబీటీ పద్ధతిలో పరీక్షనిర్వహించడం సాధ్యకాదని పేర్కొంది. దీంతో ఆ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఎప్పటి మాదిరిగా ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించాలని సదరు ఏజెన్సీని ఆదేశించింది.
సీబీటీ పద్ధతికి నో.. పాత పద్దతిలో పరీక్ష
ఉన్నట్లుండి పరీక్షా విధానాన్ని మార్చడం, సమయాభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పేపర్ లీకేజీ ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం-ఏజెన్సీ తీసుకున్న చర్యలపై అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నీట్ రీఎగ్జామ్ ఓఎంఆర్ పద్ధతిలో జరగనుంది.
గత నెల మూడున దేశవ్యాప్తంగా జరిగిన పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలు వచ్చాయి. దీంతో పరీక్షను రద్దు చేసింది సదరు ఏజెన్సీ. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ లోతుగా జరుగుతోంది. దాదాపు 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్ష మళ్లీ నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో జూన్ 21న రీ-టెస్ట్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంతా రెడీ చేస్తోంది.
ALSO READ: సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్