E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Nalgonda: నల్గొండ నాలుగు హత్యల కేసు మిస్టరీ.. ఇంటి వ్యక్తుల పనే, హత్యల వెనుక కూతురు-అల్లుడు

Nalgonda: నల్గొండ నాలుగు హత్యల కేసు మిస్టరీ.. ఇంటి వ్యక్తుల పనే, హత్యల వెనుక కూతురు-అల్లుడు
Advertisement

Nalgonda: నల్గొండ పట్టణంలో సంచలనం రేపిన నాలుగు హత్యల కేసులో మిస్టరీ వీడింది. కేవలం ఆస్తి ఈ ఘటనకు కారణమని తేల్చేశారు పోలీసులు. ఈ కేసును అన్నికోణాల్లో విచారించిన అధికారులు, ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నాలుగు హత్యల వెనుక అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

నల్గొండ నాలుగు హత్యల కేసు మిస్టరీ

Advertisement

నల్గొండ పట్టణంలోని తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన తీవ్ర కలకలం రేపింది. మహమ్మద్‌ సుల్తాన్‌, ఆయన భార్య హసీనా, కొడుకు ముజమిల్‌, కూతురు అక్సర లు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ ఘటన ఆత్మహత్యా? హత్యా? అనేక అనుమానాల నేపథ్యంలో రంగంలోకి దిగారు పోలీసులు.

చివరకు ఈ కేసులో పురోగతి సాధించారు. సుల్తాన్‌, భార్య హసీనా, కొడుకు, కూతురు శరీరాలపై ఏకంగా 16 కత్తి పోట్లు ఉన్నాయి. కరాటే వచ్చిన ముజమిల్‌ ప్రతిఘటించడంతో ఒక్కడ్ని 16 చోట్ల కత్తులతో పొడిచినట్టు గుర్తించారు. హత్యల అనంతరం నిందితులు ఇంటి గేటుకు తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో దుండగులు పక్కా ప్రణాళికతో దారుణానికి పాల్పడ్డారు.

Advertisement

హత్యల వెనుక కూతురు-అల్లుడు పని, రంగంలోరి సుఫారీ గ్యాంగ్

ఈ కేసు దర్యాప్తులో మృతుల కుటుంబానికి చెందిన ముజామిల్ ప్రేమ వ్యవహారం హత్యలకు దారి తీసినట్లు తొలుత భావించారు. ఈ కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

సుల్తాన్-హసీనా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని సుఫారీ గ్యాంగ్ ద్వారా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. నిందితులంతా హైదరాబాద్ పాతబస్తీకి చెందిన రౌడీషీటర్లు. మృతులు సుల్తాన్ నల్గొండ పట్టణంలో బ్యాగుల వ్యాపారం చేసేవాడు. భార్య హసీనా ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఉంది.

ALSO READ: గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర ప్రమాదం.. క్షణాల్లో కాలిబూడిదైన కారు

ఇంట్లో నలుగురు మృతదేహాలు లభించడంతో అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. సంఘటనా స్థలం నుంచి సేకరించిన ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా ఆధారంగా ఈ కేసును ఛేదించారు. సొంత కూతురు-అల్లుడు ఆస్తి దక్కడం లేదని కారణంతో హత్యలు చేసినట్టు తేలింది. గతంలో ఇంట్లో దొంగతనం చేసింది కూతురు-అల్లుడి పనే తేలింది.

సుపారీ ఇచ్చి కుటుంబసభ్యులు నలుగుర్ని హత్య చేయించారు కూతురు-అల్లుడు. చనిపోయిన ఇద్దరు పిల్లలు సుల్తాన్ మొదటి భార్య పిల్లలు. ఆస్తి వాళ్లకు వెళ్తుందోనన్న ఆవేశంతో హసీనా సొంత కూతురు ఈ దారుణానికి పాల్పడింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ శివారులో ఉన్న హసీనా కూతురు-అల్లుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Related News

కేతన్ కేసు మరొక మలుపు.. హత్య వెనుక సియా ఏం చెప్పింది ఇదే, చేతన్ ఫ్యామిలీ ఏమంటోంది?

గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర ప్రమాదం.. క్షణాల్లో కాలిబూడిదైన కారు

కాగజ్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం: బూడిదైన ప్రముఖ బేకరీ, రూ.20 లక్షల నష్టం!

స్టాక్ ట్రేడింగ్ పేరుతో రూ.1.22 కోట్ల టోకరా.. ఆరుగురు సైబర్ మోసగాళ్లు అరెస్ట్

నీటి సంపులో చిన్నారి మృతి.. తట్టుకోలేక గుండెపోటుతో నానమ్మ మృతి!

ఒక్క‌సారి మైండ్‌లో ఫిక్స‌యితే.. బ్లైండ్‌గా వెళ్లిపోవ‌డ‌మే! మ‌హిళ‌లు ఇంకా ఇంత వివ‌క్ష ఎదుర్కొంటున్నారా?

కోల్‌కతాలో కూలిన పాత గోదాం.. శిథిలాల కింద 30 మంది కార్మికులు!

Big Stories

×