Intinti Ramayanam Today Episode august 10th : పల్లవి కమల్ బావా వెళ్ళు నేను రెడీ చేసి వస్తాను అని అంటుంది… పల్లవి రెడీ అవ్వాలని అనుకుంటుంది కానీ అశ్విని ఎందుకు వచ్చాడు కనుక్కోవాలి అని అతనికి ఫోన్ చేస్తుంది. అతను లిఫ్ట్ చేయకపోవడంతో పల్లవి నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అంటే వాడికి ఏదో పెద్ద ప్లాన్ తోనే వచ్చాడు నాకు చాలా భయంగా ఉంది అని కంగారు పడిపోతూ ఉంటుంది. అసలు వాడు ఏ ప్లాన్ తో వచ్చాడు ఎందుకు వచ్చాడు నాకు అర్థం కావడం లేదు అని పల్లవి ఆలోచిస్తూ భయపడిపోతూ ఉంటుంది.. పూజ కోసం అంత సిద్ధం చేస్తూ ఉండగా.. పల్లవి గదిలోకి అశ్విన్ రావడంతో అవనికి అనుమానం వస్తుంది.. పల్లవి కంగారు పడిపోతుంది ఇక తర్వాత అందరూ పూజలో కూర్చున్న తర్వాత అవన్నీ చీరకు నిప్పు పెట్టేస్తాడు అశ్విన్. మీ ఇంట్లో వాళ్ళందరూ చచ్చిపోతారు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పల్లవి..
పల్లవి అశ్విన్ఎందుకు వచ్చాడు నాకు అర్థం కావడం లేదు వీడు కచ్చితంగా నన్ను ఏదో ఒకటి చేయడానికి వచ్చాడు కదా అని ఆలోచిస్తూ ఉంటుంది.. అసలు వీడు ఎందుకు వచ్చాడు నన్ను ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నాడు? మీరు ఏదో ఒకటి చేయడానికి వచ్చినట్లు ఉన్నాడు అని పల్లవి కంగారు పడిపోతూ ఆలోచిస్తూ ఉంటుంది. అశ్విన్ ఏం చేసినా కూడా నా గురించి చేస్తాడు ఈరోజు ఎలాగైనా సరే నన్ను ఇరికించాలని చూస్తున్నాడు అని పల్లవి చాలా కంగారు పడిపోతూ భయపడుతూ ఉంటుంది. ఇక కమల్ తొందరగా రెడీ అవుతావా అని చెప్పగానే వెళ్లి రెడీ అవ్వడానికి లోపలికి వెళ్తుంది పల్లవి. అశ్విన్కి ఎన్ని సార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వీడు కచ్చితంగా ఏదో ఒకటి చేయడానికి వచ్చాడు ఏం చేస్తాడు అని భయపడిపోతూ ఉంటుంది.
పల్లవి ఎక్కడుందో తెలుసుకోవాలి అని అశ్విన్ ప్రయత్నాలు చేస్తాడు.. ఆరాధ్యను ఫ్రెండ్ గా చేసుకుని ఎలాగైనా సరే పల్లవి రూమ్ లోకి వెళ్ళాలి అని ప్లాన్ చేస్తాడు. అనుకున్నట్లుగానే ఆరాధ్య దగ్గరికి వెళ్లి మనిద్దరం ఫ్రెండ్స్ కదా మీ ఇల్లు నాకు చూపిస్తావా అని అడుగుతాడు. కాసేపు ఆలోచించిన ఆరాధ్య ఆ తర్వాత మనిద్దరం ఫ్రెండ్స్ అని చాక్లెట్ ఇవ్వడంతో సరే చూపిస్తాను అని అంటుంది.. ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళగానే ఇల్లంతా చూస్తూ ఉన్నా అశ్విన్ కమల్ బాబాయ్ పల్లవి పిన్ని రూమ్ ఎక్కడా అని అడుగుతాడు.. ఆరాధ్య ఆ రూమ్ ని చూపించగానే తనకి పోరమాలినట్టు నటించి ఆరాధ్యను నీళ్లు తీసుకురమ్మని లోపలికి పంపిస్తాడు. ఆ తర్వాత పల్లవి రెడీ అవుతుండగా తన రూమ్ లోకి వెళ్తాడు అశ్విన్.. అశ్విన్ ఎంటర్ అవ్వడంతో పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. అసలు నా గదిలోకి ఎందుకు వచ్చావు ఎవరైనా చూస్తే ఏమవుతుంది నువ్వెళ్ళు అశ్విని ఇక్కడి నుంచి అని పల్లవి ఎంతగా బ్రతిమిలాడినా సరే.. తను మాత్రం అసలు మాట వినకుండా నీ ఇంటికి వచ్చిన తర్వాత నేనేం చేస్తానో నువ్వు ఊహించలేవు అని బెదిరిస్తాడు..
పల్లవి కంగారు పడిపోతూ ఉండగా అప్పుడే అవని ఇల్లంతా సాంబ్రాణి వెయ్యాలి అని పల్లవి రూమ్ లోకి వస్తుంది.. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అశ్విన్ పల్లవి రూమ్ లో ఉండడంతో ఏమైంది.అసలు నువ్వు ఎందుకు ఎక్కడున్నావ్ అని అడుగుతుంది. ఇల్లు చూడాలని నేనే వచ్చాను అని చెప్పగానే.. అయితే ఇల్లు చూడాలి అంటే పెద్ద మనుషులని తీసుకొని రావాలి ఇలా నువ్వు ఒక్కడివే రావాలని కాదు అని అవని దిమ్మతిరిగిపోయేలా అశ్విన్ కి క్లాస్ పీకుతుంది. ముందు ఇకనుంచి వెళ్ళు అని అవని గట్టిగా చెప్పడంతో అశ్విని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పల్లవి నువ్వు చేసింది. ఏమైనా బాగుందా ఎవరైనా నీ రూమ్ లోకి వస్తే ఎందుకు వచ్చావు అని అడగాలి కానీ అలాగే చూస్తూ ఉండిపోతావా అని అవని అరుస్తుంది. నేను అదే అడుగుతున్నాను అక్క అంతలోపే నువ్వు వచ్చేసావు అని అవనికి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుంది పల్లవి.
పల్లవి పూజ చేస్తూ ఉండగా అశ్విన్ మెసేజ్ ల మీద మెసేజ్లు చేస్తాడు. పల్లవి ప్రశాంతంగా కూడా పూజ చేసుకుని ఇవ్వట్లేదు అని అనుకునే లోపల కమల్ ఆ ఫోన్ పక్కన పెట్టి పూజ మీద దృష్టి పెట్టు అని అంటాడు.. అయితే పల్లవి అశ్విన్ చేసిన మెసేజ్ ని చూస్తూ పొరపాటున అక్కడ ఉన్న దీపపు కుండీలను కిందపడిస్తుంది. ఆ దీపం వెలుగుతున్నది అవని చీర మీద పడడంతో చీర అంటుకుంటుంది. మంటలు చాలా రేగడంతో ఇంట్లోని వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు. ఇక మొత్తానికి మంట లార్పి అవని కాపాడుతారు.. పూజారి మాత్రం మృత్యుంజయ హోమం జరిపిస్తున్నప్పుడు ఇలాంటి అపశకనం జరగడం ఏంటి ఏదో జరగబోతుంది అని అనగానే ఇంట్లోని వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు.. పల్లవి మాత్రం అశ్విన్ వచ్చాడు అంటే కచ్చితంగా నాకే ఏదో పెద్ద ప్రమాదం ఉంది అని ఆలోచనలో పడుతుంది. మొత్తానికి చీర మార్చుకొని వచ్చిన తర్వాత అవని అందరూ కలిసి పూజ ని పూర్తి చేస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సీరియల్ హీరో.. ఫ్యాన్స్ షాకింగ్ రియాక్షన్..!