Brahmamudi serial today Episode: పెళ్లి చూపులకు వచ్చిన వాళ్లు లక్కీ ఏం చేస్తుంటారని అడిగితే.. గాలికి తిరుగుతుంటాడని భ్రమరాంబ చెప్తుంది. ఇంతకీ మీ అమ్మాయి ఏం చదివింది అని అడిగితే.. తొమ్మిది వరకు చదివింది తర్వాత కాలీగా ఉంటుందని చెప్పగానే.. ఆ భ్రమరాంబ వెటకారంగా మాట్లాతుంది. ఇంతలో పెళ్లి వాళ్లు లక్కీ అమ్మానాన్న ఎక్కడున్నారు అని అడిగితే.. భ్రమరాంబ వెటకారంగా మాట్లాడుతుంది. రాజు కోపంగా ఊరుకోమని చెప్పి.. వాళ్ల అమ్మ ఎవరో తెలియదండి అసలు వాళ్ల అమ్మ నాన్న ఎవరో వాడికే కాదు మాకు కూడా తెలియదు వాడు పుట్టినప్పుడే అనాథ ఆశ్రమంలో వదిలేసి వెళ్లిపోయింది అని చెప్పగానే.. పెళ్లి వాళ్లు అనాథ ఆశ్రమంలో వదిలేసి వెళ్లిపోయింది అంటే అసలు అది మనిషేనా..? అంటూ తిట్టగానే..
భ్రమరాంబ కూడా ఈ పాయింట్ కరెక్టుగా చెప్పారు. అసలు పిల్లల్ని వద్దు అనుకున్నప్పుడు ఎందుకు కనాలి..? ఎందుకు పారేయాలి..? శేషు అడవిలో జంతువులు నయం పశువులు నయం.. వాటి కడుపున పుట్టిన బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటాయి. వాటికున్న జ్ఞానం కూడా లేకుండా పోయింది ఆ తల్లికి నాకు తెలుసు అది ఎవరో మనిషే కాకుండా పోయింది అంటూ తిడుతుంటే.. రేఖ మనసులో బాధపడుతుంది. ఇంతలో పెళ్లి వారు పాపం ఈ పిల్లగాడు చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాడో ఏంటో అనగానే.. భ్రమరాంబ మరింత కోపంగా అలాంటి దరిద్రపు దాని కడుపున పుట్టినప్పుడు వీడి జాతకం ఇలా తగలబడక ఇంకెలా తగలడుతుంది. అదెవరో నాకు తెలిస్తే చెప్పు తిరగేసి కొట్టేదాన్ని చీపురు కట్ట తీసుకుని సింగారించేదాన్ని అంటూ తిడుతుంటే..
రేఖ కల్పించుకుని వదిన ఎవరి మీదో నీకెందుకు అంత కోపం అంటుంది. అందుకు భ్రమరాంబ అలా అంటావేంటి రేఖ ఆ దిక్కుమాలింది వదిలేయడం వల్లే కదా ఈ దిక్కుమాలినోడిని మన నెత్తిన పెట్టుకోవాల్సి వచ్చింది.. అదెవరో నాకు దొరకాలి వీధి చివరన చెక్క కుండీలో పడేసి తొక్కి తొక్కి పెడతా అంటూ తిడుతుంటే.. అపర్ణ సరేలే ఎవరో ఇక్కడ లేని మనిషి గురించి ఎందుకు మాట్లాడుకోవడం ముందు వాడి పెళ్లిచూపుల గురించి మాట్లాడండి.. అనగానే.. పెళ్లి వాళ్లు ఇంకా పెళ్లి చూపులేంటండి.. అబ్బాయికి అమ్మానాన్న లేరన్న విషయం ముందే చెప్పాలి కదా అంటారు. అబ్బాయికి ముందుండి ఎవరు పెళ్లి చేస్తారు అని అడగ్గానే.. రాజు రేఖ పిన్ని ఉంది కదా ముందుండి అన్ని చూసుకుంటుంది.. పిన్ని చెప్పండి.. లక్కీకి తల్లి స్థానంలో ఉంటావా..? వాళ్ల అమ్మవు నువ్వే అని చెప్తావా..? అని అడుగుతాడు. రేఖ మౌనంగా ఉండిపోతుంది. పెళ్లి వాళ్లు మాత్రం వద్దులేండి.. ఇంట్లో వాళ్లను బలవంతంగా ఎందుకు ఒప్పిస్తారు అంటుంది. ఎవరికి పుట్టాడో ఎలా పుట్టాడో తెలియని వాడిని మేము అల్లుడిగా ఎందుకు చేసుకోవాలి అంటూ తిడుతూ వెళ్లిపోబోతుంటే..
రాజు ఫ్లీజ్ పిన్ని ఒప్పుకో అంటుంటే.. నాకు సంబంధం లేని వాళ్ల గురించి తల్లిగా నిలబడాల్సిన అవసరం నాకు లేదు అంటూ రేఖ వెళ్లిపోతుంది. పెళ్లి వాళ్లు వెళ్లిపోతారు. లక్కీ బాధగా ఏంటి మామ ఇదంతా ఎందుకు ఈ పెళ్లి చూపులు ఎందుకు జరిపించావు.. అందరి ముందు పరువు తీసేశావు అంటూ బాధగా వెళ్లిపోతాడు. ఇందు బాధగా మనం అనవసరంగా లక్కీని బాధపెట్టేశాం అనగానే.. లేదు ఇందు దీని వల్ల కూడా ఒక మంచి జరిగింది. లక్కీని అందరూ అవమానిస్తుంటే… రేఖ పిన్ని కళ్లల్లో బాధ కనిపించింది. ఇప్పుడు వాడు బాధపడ్డా తర్వాత హ్యాపీగా ఉంటాడు అని చెప్పి పైన రేఖ రూంలోకి వెళ్తాడు.
కోపం మీదున్న రేఖ, రాజును చూసి ఎందుకొచ్చావు రూంలోకి అని అడుగుతుంది. రాజు మాత్రం నువ్వు గ్రేట్ పిన్ని కన్నకొడుకుకి అవమానం జరుగుతున్నా బయటపడకుండా ఉన్నావు.. కానీ నిన్ను కూడ అవమానించారు కదా..? అయినా ఎలా ఉండగలిగావు.. నీ అమ్మతనం గురించి కూడా అవమానంగా మాట్లాడారు కదా నీకేం బాధ అనిపించలేదా అని అడగ్గానే.. రేఖ అనిపించలేదు అని చెప్తుంది. అందుకు రాజు శభాష్ పిన్ని మహాభారతంలో కుంతీదేవిని మించిపోయిన పాత్ర పిన్ని.. నీ గుండెల్లో ఇసుమంతైన బాద అనిపించలేదు కదా.? అంటూ అడగ్గానే.. నువ్వు నన్న రెచ్చగొట్టడానికే ఇలా చేశావు కదా అని రేఖ అడిగితే అవునని నీకు నువ్వే నిజం ఒప్పుకుటే సరి లేదంటే తానే టైం చూసి అందరికీ నిజం చెప్పేస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు.
ఐశ్వర్యకు శశి ఫోన్ చేస్తాడు. బర్తుడే విషెష్ చెప్తుంది ఐషు. వెంటనే తాను కొన్న గోల్డ్ రింగ్ చూసుకుని వెంటనే శశికి గిఫ్ట్ గా ఇవ్వాలని డిసైడ్ అవుతుంది. తర్వాత రెడీ అయి శశి దగ్గరకు వెళ్తుంటే.. స్వాతి వెళ్లి ఆపేస్తుంది. నువ్వు పార్టీకి వెల్లొద్దని రాత్రిళ్లు తిరిగితే నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది కదక్కా ఒక్కసారి అర్థం చేసుకో అని చెప్తుంది. చిన్నదానివి చిన్నదానిలా ఉండు.. నాకు చెప్పేంత దానివి కాదు అంటూ తిడుతూ వెళ్లిపోతుంది. స్వాతి వెళ్లి ఇందుకు విషయం చెప్తుంది. ఐషు అక్క బయటకు వెళ్లింది అని చెప్పగానే… ఈసారి తను ఏదో చేయబోతుంది. ఏదేదో పిచ్చిపిచ్చిగా వాగేసి వెళ్లిపోయింది. ఐషు అక్క ఏదో చేయాలనుకుని ఇంకేదో చేసేసి ఏదో అయిపోయేలా ఉంది అని చెప్పగానే.. నువ్వేం భయపడకు నేను చూసుకుంటాను అని ఇందు చెప్తుంది. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.