E-Paper
Advertisement

Lipstick Killer: లిప్‌స్టిక్ కిల్లర్ కేస్.. డ్రైనేజీలో చిన్నారి శరీర భాగాలు, మరో ఇద్దరు హత్య.. ఆ కుర్రాడే చంపాడా?

Lipstick Killer: లిప్‌స్టిక్ కిల్లర్ కేస్.. డ్రైనేజీలో చిన్నారి శరీర భాగాలు, మరో ఇద్దరు హత్య.. ఆ కుర్రాడే చంపాడా?
Advertisement

‘ది లిప్‌స్టిక్ కిల్లర్’.. 1945-46 మధ్యలో అమెరికాలో జరిగిన సీరియల్ మర్డర్ కేసు. చికాగోలో నెలల వ్యవధిలో మూడు హత్యలు జరిగాయి. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు, దోషిగా తేల్చి.. శిక్ష విధించిన వ్యక్తికి ఉన్న సంబంధం గురించి ఇప్పటికీ ఎన్నో అనుమానాలు ఉన్నాయి.  హత్యా స్థలంలో గోడ మీద లిప్‌స్టిక్ తో రాసిన మెసేజ్ కారణంగానే ప్రపంచ వ్యాప్తంగా లిప్‌స్టిక్ కిల్లర్ కేసుగా గుర్తింపు పొందింది. ఈ రాతలకు విలియం హెయిరెన్స్ అనే విద్యార్థికి సంబంధం ఉందని, అతడే ఈ హత్యలు చేశాడని పోలీసులు అనుమానించారు. అదే సమయంలో అతడి నిర్దోషిత్వానికి సంబంధించిన వాదనలూ  బలంగానే ఉన్నాయి. ఇంతకీ ఈ కేసు ఏంటి? చివరికి ఏం జరిగింది? నిజంగా ఆ కుర్రాడు హత్యలు చేశాడా? న్యాయస్థానం ఏ తీర్పు చెప్పింది?

‘లిప్‌స్టిక్ కిల్లర్’ కేసు గురించి..  

1945-1946 మధ్య సుమారు 7 నెలల వ్యవధిలో చికాగోలో మూడు హత్యలు జరిగాయి. వీరిలో ఇద్దరు మహిళలు కాగా, ఓ చిన్నారి ఉంది. జూన్ 5, 1945న 43 ఏళ్ల జోసెఫిన్ రాస్ తన అపార్ట్ మెంట్ లో కత్తితో గొంతుకోసి చంపబడింది. డిసెంబర్ 10, 1945న 33 ఏళ్ల ఫ్రాన్సిస్ బ్రౌన్ అనే మహిళ తన అపార్ట్ మెంట్ లో తుపాకీతో కాల్చడంతో పాటు కత్తితో పొడిచి చంపబడింది. ఆమెను చంపిన తర్వాత గోడమీద లిప్‌స్టిక్తో “స్వర్గం వెళ్లేందుకు నేను మరింత మంది చంపబోతున్నాయి. వెంటనే నన్ను పట్టుకోండి. లేకపోతే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను” అని రాసి ఉంది. ఈ రాతలను చూసి మీడియా ‘లిప్‌స్టిక్ కిల్లర్’ అని పిలవడం మొదలుపెట్టింది.  జనవరి 7, 1946లో సుజాన్ డెగ్నాన్ అనే 6 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. ఇంట్లో పడుకుని ఉన్న అమ్మాయిని ఎత్తుకెళ్లి గొంతు నులిమి చంపేశారు. ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మురికి కాలువలో పడేశారు. ఈ మూడు హత్యలు పోలీసులపై తీవ్ర ఒత్తిని పెంచాయి. మీడియాలో ఈ హత్యలు హైలెట్ అయ్యాయి.  పోలీసులు ఎన్ని రకాలుగా విచారణ చేసినా, క్లూస్ పట్టుకోలేకపోయారు.

జూన్ 26, 1946లో 17 ఏళ్ల కుర్రాడు అరెస్ట్

Advertisement

జూన్ 26, 1946న చికాగో యూనివర్సిటీ విద్యార్థి, చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడే 17 ఏళ్ల  విలియం హెయిరెన్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగతనం కేసులో అతడిని అరెస్ట్ చేసినా, ఆ తర్వాత సుజాన్ హత్యకు అతడే కారణం అని చెప్పుకొచ్చారు. హత్యలు చేసింది తనే అని చెప్పించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఆధారాలను పట్టించుకోకుండా, ఎలాగైనా అతడిని ఈ కేసుకు లింకప్ చేయాలనుకున్నారు. 6 రోజుల పాటు నిద్ర, ఫుడ్ లేకుండా హింసించారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. నిజం చెప్పేందుకు  ‘ట్రూత్ సీరం’ అనే డ్రగ్ ఇచ్చారు. ఆ మత్తులో విలియం మూడు హత్యలు తానే చేశానని ఒప్పుకున్నాడు. కానీ, ఆ తర్వాత తనను హింసించి అలా చెప్పించారని కోర్టు ముందు విలపించాడు.

ఆధారాల విషయంలోనూ అనుమానాలు

వాస్తవానికి విలియం హెయిరెన్స్ ఆ హత్యలు చేసినట్లు కచ్చితమైన సరైనా ఆధారాలు లభించలేదు. అతడి చేతిరాతకు లిప్‌స్టిక్ మెసేజ్ కు అస్సలు పొంతన లేదు. హ్యాంగ్ రైటింగ్ ఎక్స్ ఫర్ట్స్ కూడా ఇదే విషయాన్ని తేల్చారు. నేర స్థలాల్లో దొరికిన వేలిముద్రలు అతని ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ కాలేదు. అతడు ఎవరినీ లైంగికంగా వేధించలేదు. కానీ, ఇద్దరు మహిళలపై లైంగిక దాడి జరిగిన తర్వాతే చంపినట్లు ఆధారాలు లభించాయి. అటు ఈ హత్యలను తానే చేశానని, మర్డర్స్ కు సంబంధించిన వివరాలు తనకు తెలుసని ఓ వ్యక్తి చెప్పినా, పోలీసులు అతడిని పట్టించుకోలేదు. కోర్టు కూడా పోలీసుల అసంపూర్ణ వాదనలతోనే ఏకీభవించింది. తనకు ఆ హత్యలతో సంబంధం లేదని చెప్పినా న్యాయస్థానం పట్టించుకోలేదు. చివరికి జీవిత ఖైదు విధించింది.  విలియం అమెరికాలో అతి ఎక్కువ కాలం జైలులో ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందాడు. 17 ఏళ్ల వయసులో జైలు వెళ్లి..  65 సంవత్సరాలకు పైగా జైల్లోనే శిక్ష అనుభవించాడు. మార్చి 5, 2012న 82 ఏళ్ల వయసులో జైల్లోనే చనిపోయాడు. మరణానికి కాసేపటి ముందు కూడా తాను ఆ హత్యలు చేయలేదని చెప్పాడు విలియం.

‘లిప్‌స్టిక్ కిల్లర్’ కేసుపై ఇప్పటికీ ఎన్నో ఆరోపణలు 

Advertisement

చాలా మంది న్యాయవాదులు, ప్రొఫెసర్లు ఇప్పటికీ విలియం హెయిరెన్స్ నిర్దోషి అని నమ్ముతారు. కొంతమంది తను  దోషి అని భావిస్తారు. 100 శాతం ఏది వాస్తవం అనేది ఎవరూ చెప్పలేకపోయారు. విలియం హెయిరెన్స్ తన జీవితం అంతా జైలు గోడల మధ్యే గడపాల్సి వచ్చింది. తాను చేయని హత్యలకు  జీవితాన్నే పణంగా పెట్టాల్సి వచ్చిందని ఎన్నోసార్లు చెప్పాడంటారు తోటి ఖైదీలు. ఇప్పటికీ  ఇదో మిస్టీరియస్ కేసుగానే మిగిలిపోయింది. అసలు నిందితుడు ఎవరో ఆ పైవాడికే తెలియాలి.

Read Also: ఒడిలో నిద్రిస్తున్న చిన్నారి మాయం.. 6 నెలలు తర్వాత ఊహించనిది జరిగింది, కన్నీళ్లు పెట్టించే ఘటన!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×