Nizamabad Crime News: స్నేహితుడిగా నటించాడు.. నిజమేనని నమ్మాడు తొటి ఫ్రెండ్. ఆ తర్వాత చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. డబ్బు ఆశ చూపించాడు, నిజమేనని నమ్మేశాడు. సమయం, సందర్భం కోసం వెయిట్ చేశాడు. సరిగ్గా అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి, మనసులో వేసిన స్కెచ్‌ని అమలు చేశాడు. పైకి ఏమీ తెలీనట్టుగా వ్యవహరించాడు. చివరకు పోలీసుల విచారణతో అడ్డంగా దొరికిపోయాడు. నేరం చేశానని అంగీకరించాడు. సంచలనం రేపిన ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసింది.
స్టోరీలోకి వెళ్తే..
నిజామాబాద్ నగర శివారు బ్రాహ్మణ కాలనీలో నివాసం ఉంటున్నాడు సందీప్. అతడికి నాగారంలో ఉండే సతీష్‌గౌడ్ నాలుగేళ్లుగా పరిచయం ఉంది. ఎక్కడకు వెళ్లినా ఇద్దరు కలిసి వెళ్లేవారు. ఆ తర్వాత చెడు వ్యసనాలకు అలవాటుపడ్డాడు సతీష్. కాకపోతే ఆ విషయంలో సందీప్ దూరంగా ఉంటూ వచ్చాడు. సందీప్ ఆటో వేసి జీవనం సాగించేవాడు.
సందీప్ వద్ద డబ్బులు చూశాడు సతీష్. ఆటో వేయడం వల్లే డబ్బులు సంపాదిస్తున్నాడని భావించాడు. దాన్ని సొంతం చేసుకుంటే తనకు డబ్బులు వస్తాయని భావించాడు. ఫ్రెండ్ ఆటోను ఎలా సొంతం చేసుకోవాలని ఆలోచన చేశాడు. ఒకటీ, రెండు కాదు.. రోజులు, వారాలు, నెలలు గడిచాయి. చెడు వ్యసనాలకు బానిసైన సతీష్, డబ్బుల కోసం అలవాటు పడ్డాడు. సింపుల్‌గా చెప్పాలంటే కష్టపడడానికి ఇష్టపడేవాడు కాదు.
డబ్బు కోసమే ఫ్రెండ్‌ని చంపేశాడు
ఈ క్రమంలో రకరకాల అలవాట్లకు బానిసయ్యాడు సతీష్. దాని నుంచి బయట పడలేకపోయాడు. ఫిబ్రవరి 15న ఆటో నడపగా వచ్చిన డబ్బులతో సందీప్-సతీష్ ఇద్దరు కలిసి మద్యం పుచ్చుకున్నారు. మత్తులో ఉన్న సందీప్‌ను కామారెడ్డి వెళ్తే ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చని ఆశ చూపించాడు సతీష్. నిజమేనని నమ్మిశాడు సందీప్. ఇద్దరు కలిసి బయల్దేరారు.
ALSO READ: నిద్రపోతున్న తండ్రిపై పెట్రోల్ పోసి
ఇందల్‌వాయి సమీపంలో చంద్రయాన్‌పల్లి అటవీ ప్రాంతంలో సందీప్ మూత్ర విసర్జనకు వెళ్లాడు. ఆ వెనకాల వెళ్లిన సతీష్‌గౌడ్ వెళ్లి, ఫ్రెండ్‌ని పెద్ద గుంతలోకి తోసేశాడు. అందులో పడిపోయాడు అరవడం మొదలుపెట్టాడు. అనంతరం ఛాతిపై పెద్ద బండరాయితో కొట్టి చనిపోయాడని నిర్ధారించుకున్నాడు సతీష్. ఎండు పుల్లలు తెచ్చి శవానికి నిప్పంటించాడు.
ఆటోలో హైదరాబాద్‌కు నిందితుడు
సందీప్ చరవాణి తీసుకుని ఆటోలో హైదరాబాద్‌కు వచ్చాడు సతీష్. ఈ నెల 16న సందీప్ తప్పిపోయినట్లు ఆయన భార్య ఐదో ఠాణాలో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు చంద్రయాన్‌పల్లి అటవీ శివారులో కాలిపోయిన స్థితిలోవున్న మృతదేహాన్ని గుర్తించి కేసు నమోదు చేశారు. అయితే ఘటనా స్థలంలో ఆటో కనిపించక పోవడంతో పోలీసులు నిఘా పెట్టారు.
నిందితుడు సతీష్ బుధవారం హైదరాబాద్ నుంచి అదే ఆటోలో నిజామాబాద్‌కు వచ్చాడు. మాధవనగర్ వద్ద అదుపులోకి తీసుకొని అతడ్ని పోలీసులు విచారించారు. తొలుత పొంతన లేని సమాధానాలు చెప్పాడు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టేసరికి నిజాలు బయటపెట్టాడు. చివకు సందీప్‌ను హత్య చేసినట్లు అంగీకరించాడు.
నిందితుడు హిస్టరీలోకి
ఇక నిందితుడు సతీష్ ప్లాష్‌బ్యాక్ లోకి వెళ్దాం. సతీష్ క్రైమ్ హిస్టరీ నార్మల్‌గా లేదు. గతంలో హైదరాబాద్‌లో ఓ మహిళ హత్య చేశాడు. ఆ తర్వాత నిజామాబాద్‌లో మరొక హత్య చేశాడు. హైదరాబాద్‌లో రెండు చోరీ కేసుల్లో జైలుకెళ్లొచ్చాడు కూడా. కేసు ఛేదనలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. సందీప్ హత్యపై ఆయన భార్య అనుమానాలు వ్యక్తం చేసింది. ఒక్కరే హత్య చేశారంటే నమ్మలేమని అంటోంది. దీని వెనుక ఇంకా ఉంటారని అంటోంది. దీంతో ఈ కేసును మరింత లోతుగా విచారణ చేపట్టారు పోలీసులు. మొత్తానికి కీలక నిందితుడు మాత్రం పోలీసులకు దొరికిపోయాడు.