Noida Scam Girls Adult Content | ఓ విదేశీ కంపెనీ యువతులకు భారీగా జీతాలిచ్చి ఉద్యోగాల్లో నియమించుకుంటోంది. వారికి ప్రతినెలా లక్షల్లో చెల్లిస్తోంది. అయితే ఇదంతా ఇల్లీగల్.. చట్ట వ్యతిరేకం. ఆ యువతులకు లక్షల్లో జీతాలు చెల్లిస్తున్నా.. వారి చేత వ్యభిచారం, అడల్ట్ కంటెంట్ ఆన్ లైన్ షోలు, వీడియోలు తీసి విక్రయిస్తోంది. మరో షాకింగ్ విషయమేమిటంటే ఇండియాలో ఆ కంపెనీకి ఏజెంట్లుగా భార్యభర్తలు పనిచేస్తున్నారు. యువతులకు భారీగా డబ్బు ఆశ చూపి వారితో ఆన్ లైన్ అడల్ట్ షోలు చేయిస్తున్నారు. తాజాగా పోలీసులకు ఈ సమాచారం లీక్ కావడం ఆ ఏజెంట్ దంపతులను పట్టుకున్నారు. వారి ఇంట్లో నుంచి పోలీసులు కోట్లలో డబ్బు స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని నోయిడా ప్రాంతంలో ఉజ్వల్ కిశోర్, అతని భార్య నీలూ శ్రీవాస్తవ నివసిస్తున్నారు. వారు ఒక ఖరీదైన అపార్ట్ మెంట్ ఫ్లాట్ లో ఉంటున్నారు. రెండు రోజుల క్రితం పోలీసులు వారి ఇంట్లో తనిఖీలు చేసి దాదాపు రూ.16 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. వారి బ్యాంక్ అకౌంట్లలో లావాదేవీలు పరిశీలిస్తే.. ఆ డబ్బులన్నీ విదేశాల నుంచి వారికి అందాయి. అయితే అవన్నీ సిప్రస్ దేశానికి చెందిన టెక్నియస్ లిమిటెడ్ అనే కంపెనీ నిధులని.. తాము ఆ కంపెనీ కోసం పనిచేస్తున్నామని నిందితులు ఉజ్వల్, అతని భార్య నీలూ తెలిపారు. ఆ నిధులతో కంపెనీకి మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, రీసెర్చ్ చేస్తున్నామని వెల్లడించారు.
కానీ వారు చెప్పినదాంట్లో కొన్నే నిజాలు అని పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసలో భారీగా డబ్బులు స్వాధీనం కావడంతో ఈడీ అధికారులు విచారణ ప్రారంభించారు. లోతుగా విచారణ చేస్తే. .షాకింగ్ విషయాలు తెలిశాయి. ఆ దంపతులు ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అందమైన యువతుల కావాలని.. వారికి భారీగా పారితోషకం చెల్లిస్తామని ప్రకటనలు ఇస్తారు. ఆ ప్రకటనలు చూసి వారి ఆఫీసుకు సంప్రదించిన యువతులు భారీ మోసపోతారు. ఎందుకంటే ఆ యువతుల చేత మాడలింగ్ చేయిస్తామని ఈ ఏజెంట్లు నమ్మిస్తారు. ముందుగా వారికి కొంత అడ్వాన్స్ డబ్బులిచ్చి తమ కంపెనీ కోసం మోడలింగ్ చేయాలని కాంట్రాక్ట్ చేయించుకుంటారు. కానీ కొన్ని రోజులు వారి అందమైన ఫొటో షూట్లు చేశాక.. ఇంకా ఎక్కువ చెల్లిస్తాం.. తమకు ఆన్ లైన్ షోలు ఉన్నాయని.. ఆ షోలు నటిస్తే రెట్టింపు చెల్లిస్తామని చెబుతారు.
Also Read: భార్య ప్రియుడిని బతికుండగానే పాతిపెట్టాడు.. అబ్బా! హత్య కోసం ఎంత ప్లాన్ వేశాడంటే
భారీగా డబ్బుకు ఆశపడే యువతులు.. ఆ షోలు చేయడానికి ఒప్పేసుకుంటారు. అయితే ఆ దంపతులకు ఇంట్లో ఒక రహస్య స్టూడియో నిర్మాణం చేశారు. ఆ స్టూడియోలో ఈ యువతుల చేత అసభ్యంగా నృత్యాలు చేయిస్తారు. సగం దుస్తుల్లో పోల్ డ్యాన్స్ లు చేయిస్తారు. ఆ తరువాత స్ట్రిప్ టీజ్ (క్రమంగా బట్టలన్నీ తీసేయడం) చేయిస్తారు. ఇదంతా లైవ్ షో గా అన్ లైన్ లో ప్రసారం చేస్తారు. ఆ తరువాత వీడియోలను ఎక్స్ హ్యామ్ స్టర్, స్ట్రిప్ చాట్ వంటి అశ్లీల విదేశీ వెబ్ సైట్లకు విక్రయిస్తారు. అయితే ఇదంతా ఇండియాలో చేయకముందు ఉజ్వల్ రష్యాలో చేశాడు. రష్యాలో పరిస్థితులు అనుకూలించకపోవడంతో గత అయిదు సంవత్సరాలుగా ఇండియాలో ‘echato dot com’ అనే మోడలింగ్ కంపెనీ పేరుతో ఈ దందా చేస్తున్నాడు. ఉజ్వల్ చేస్తున్న ఈ చట్టవ్యతిరేక పనిలో అతని భార్య నీలూ సహకారం అందిస్తోంది.వీరు గ్రామాల్లో నివసించే అమ్మాయిలను కూడా ట్రాప్ చేసి.. ఓన్లీ ఫ్యాన్స్ అనే అడల్ట్ ప్లాట్ ఫామ్ లో పనిచేయిస్తున్నట్లు తెలిసింది.
వీరికి కంపెనీ నిధులే కాకుండా ఆన్ లైన్ లో కస్టమర్లు కూడా ఉన్నారు. కస్టమర్లు షోలో డ్యాన్స్ చేసే యువతుల్లో ఎవరినైనా ఎంపిక చేసుకోవచ్చు.. ఆ తరువాత వారితో పడక సుఖం కోసం ఆన్ లైన్ లోనే డబ్బులు చెల్లించి బుకింగ్ చేసుకోవాలి. కొందరు కస్టమర్ల నుంచి క్రిప్టో కరెన్సీ పేమెంట్ కూడా వీరికి అందిందని ఈడీ అధికారులు వెల్లడించారు. ఇలా వచ్చే సంపాదనలో కంపెనీ 50 శాతం, ఉజ్వల్, నీలూ 25 శాతం తీసుకుంటున్నారని తెలిసింది. మిగతా 25 శాతం యువతులకు చెల్లిస్తున్నారు. ఈ ఇద్దరు కేడీ దంపతులు ఇప్పటికే వేల మంది యువతులను ఈ మోడ్రన్ వ్యభిచార కూపంలోకి లాగినట్లు విచారణలో తేలింది.