Woman tragic decision: పూజ చేయడానికి పీరియడ్స్ అడ్డు వచ్చాయని ఓ మహిళ దారుణమైన నిర్ణయం తీసుకుంది. తాను ఏదో తప్పు చేసినట్లుగా బాధ పడిపోయి ఎకంగా ప్రాణం తీసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీలో ఈ ఘటన చోటు చేసుకుంది. చైత్ర నవరాత్రి పూజల్లో పాల్గొనలేక పోయినందుకే తన భార్య అత్మహత్య చేసుకుందని ప్రియాంశ సోని(36) భర్త ముఖేష్ చెప్పారు.
దాదాపు ఒక సంవత్సరం నుంచి ప్రియాంశ నవరాత్రి కోసం ఎదురుచూసిందని తెలిపాడు. తీరా పూజ చేసే సమయం వచ్చే సరికి పీరియడ్స్ వచ్చాయని తెలిపింది. అందుకే ఉపవాసం, పూజలు చేయలేకపోయిందని అన్నాడు. ఆశగా ఎదురు చూసిన తర్వాత చివరి క్షణంలో పీరయడ్స్ వల్ల పూజలో పాల్గొననందుకు ఆమె చాలా ఒత్తిడికి లోనయిందని ముఖేష్ వెల్లడించాడు.
ALSO READ: విశాఖలో దారుణం.. LKG చిన్నారిపై..
తనకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదని అన్నారు. పీరియడ్స్ సహజ ప్రక్రియ అని, ప్రతీ నెలా జరిగే విషయమే అని తనకు చెప్పేందుకు చాలా సార్లు ప్రయత్నించినట్లు తిలిపింది. తనకు బదులుగా పూజలు చేస్తానని చెప్పినా ప్రియాంశ వినలేదని ముఖేష్ చెప్పాడు.
పూజ సమయంలో పీరియడ్స్ రావడంతో ఏదో తప్పు చేసినట్లుగా ప్రియాంశ భావించిందని అతను తెలిపారు. జరిగిన దాని నుంచి తేరుకోవడానికి తనను వాళ్ల అమ్మ వాళ్ల ఇంటికి పంపించారట. అయితే ఆమె మరింత ఒత్తిడికి లోనయ్యి సూసైడ్ చేసుకొని చనిపోయిందని వెల్లడించారు.