E-Paper
Advertisement

గద్వాల జిల్లాలో దారుణం.. తనిఖీ పేరుతో మైనర్ బాలికను తీసుకెళ్లి రహస్యంగా వివాహం!

గద్వాల జిల్లాలో దారుణం.. తనిఖీ పేరుతో మైనర్ బాలికను తీసుకెళ్లి రహస్యంగా వివాహం!
Advertisement

Child Marriage: స్వేచ్ఛ బ్యూరో: జోగుళాంబ గద్వాల జిల్లాలో బాల్య వివాహాలను అడ్డుకోవడంలో అధికారులు ప్రదర్శించిన నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాల్యవివాహం జరుగుతుందన్న సమాచారంతో తనిఖీలకు వెళ్లిన అధికారులు, కనీస విచారణ చేయకుండా చేతులు దులుపుకోవడం చర్చనీయాంశంగా మారింది.

వివరాలు ఇలా ఉన్నాయి…

జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఓ మండలంలో ఈనెల 23న మైనర్ బాలికకు బాల్యవివాహం జరుగుతున్నట్లు సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. ఈమేరకు ఐసిడిఎస్, పోలీసులు,‌ సంబంధిత అధికారులు ఈనెల 22 గురువారం రాత్రి మైనర్ బాలిక స్వగ్రామానికి అక్కడికి చేరుకున్నారు. అయితే, పెళ్లి పెద్దలు చాకచక్యంగా వ్యవహరించి అసలైన వధువును రహస్య ప్రదేశంలో దాచిపెట్టారు. ఆమెకు బదులుగా ఆమె చెల్లిని (మైనర్ బాలిక) అధికారులకు చూపించారు. అధికారులు కనీసం వధువు యొక్క ఆధార్ కార్డు లేదా పెళ్లి పత్రిక వంటి ప్రాథమిక ఆధారాలను కూడా సరిచూసుకోకుండా, పెళ్లి పెద్దలు చూపించిన బాలికనే వధువుగా భావించి ఆమెను అక్కడ నుండి తీసుకెళ్లారు.

Advertisement

Also Read: ఫస్ట్ టైమ్ కారు కొంటున్నారా? ఈ టాప్ 5 మోడల్స్ ట్రై చేయండి!

అధికారుల కళ్లముందే..

అధికారులు వధువు‌ (మైనర్ బాలిక) బదులు బాలిక చెల్లెలు(మైనర్ బాలిక)ను తీసుకుని వెళ్లిన వెంటనే, పెళ్లి పెద్దలు దాచిపెట్టిన అసలైన వధువు గుర్తు తెలియని ప్రాంతంలో రహస్యంగా వివాహం జరిపించినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. అధికారుల కళ్లముందే ఇంతటి హైడ్రామా నడిచినా, వాస్తవాలను గుర్తించడంలో వారు విఫలమయ్యారు. నిబంధనల ప్రకారం వదువు (మైనర్ బాలిక) ఎవరు, వయస్సును నిర్ధారించుకోకుండా, అధిజారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారులను వివరణ కోరగా మైనర్లు వివాహాలు చేస్తే చట్టరీత్యా నేరమని అన్నారు. మైనర్ బాలిక పెళ్లి జరుపుతున్నట్లు‌ సమాచారం వచ్చిందని, బాలిక తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Also Read: మేడిపల్లిలో వరుస చోరీలు కలకలం.. భయంతో జంకుతున్న స్ధానికులు

Related News

బీఎన్ రెడ్డి నగర్‌లో దారుణం.. భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

అన్న చేసిన తప్పుకు చెల్లి బలి.. వికారాబాద్‌లో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య!

నందిగామలో రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా.. VROపై దాడి

హిమాచల్‌లో ఘోర ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన కారు, ఇద్దరు దుర్మరణం!

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యాన్‌ను ఢీకొన్న కారు.. 15 మంది మృతి!

బైక్ ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు యువకులు స్పాట్‌లో మృతి

డిచ్‌పల్లిలో పట్టపగలే భారీ చోరీ.. 12 తులాల బంగారం, నగదు మాయం!

ఆస్తి కోసం కన్నతల్లిదండ్రుల ఇంటికే నిప్పు.. చిలకలూరిపేటలో విషాదం!

Big Stories

Advertisement
×