French Surgeon : వైద్యం కోసం వచ్చే వారికి మత్తు మందు ఇచ్చి.. వారిపై అత్యాచారాలకు పాల్పడ్డే ఓ క్రూరమైన సర్జన్ వ్యవహారం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతను చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంటే.. బాధితులు సైతం షాక్ అవుతున్నారు. ఇతని బాధితుల్లో ఎక్కువ మంది అభం శుభం తెలియని చిన్నారులే కావడం ఇతని పైశాచితకకు అద్దం పడుతోంది. ఇతని దారుణాలకు ఏకంగా 300 మందికి పైగా చిన్నారులు బాధితులుగా మారడంతో.. ఇప్పుడు ఈ వార్త సంచలనంగా మారింది. ఫ్రాన్స్ లో చోటుచేసుకున్న ఈ ఘటనలో.. నిందితుడు దాదాపు మూడు దశాబ్దాలుగా సాగుతున్న దుర్చర్యలు ఓ చిన్న కేసు కారణంగా వెలుగు చూశాయి. దీంతో.. 74 ఏళ్ల మాజీ సర్జన్‌ను జో లీ స్కౌర్నెక్ పై విచారణ జరుగుతోంది.
మాజీ సర్జన్‌ను ఎలా గుర్తించారు?
దాదాపు మూడు దశాబ్దాలుగా సాగుతున్న ఇతని దారుణాలు.. 2017లో స్కౌర్నెక్ పొరుగింటిలోని ఓ ఆరేళ్ల బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో విచారణ భాగంగా.. పోలీసులు నిందితుడి ఇంటిని తనిఖీ చేశారు. అప్పుడే అసలు విషయాలు వెలుగుచూశాయి. అతని ఇంట్లో 3 లక్షలకు పైగా ఫోటోలు, 650కి పైగా అశ్లీల వీడియోలు బయటపడ్డాయి. అలాగే.. తనను తాను పెడోఫైల్‌గా అభివర్ణించింకుంటూ.. అతని ఏ రోజు ఎవరిపై అత్యాచారం చేశాడో వివరంగా నోట్‌బుక్‌లో రాసుకున్నాడు.
అతని బాధితుల్లో చాలామంది ఆత్మహత్యకు పాల్పడ్డారని, మద్యం, మాదకద్రవ్యాల వ్యసనంతో బాధపడుతున్నారని తెలుస్తోంది. నిందితుడు స్కౌర్నెక్ 2020లో తన ఇద్దరు మేనకోడళ్లతో సహా నలుగురు పిల్లలపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో దోషిగా తేలాడు. అతడికి 15 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అంతకు ముందు.. 2005లో పిల్లల లైంగిక వేధింపుల సామగ్రిని ఉండడం, ఆయా వస్తువుల్ని దిగుమతి చేసుకోవడంపై స్కౌర్నెక్ దోషిగా నిర్ధారించారు. అతడిని సర్జన్ ప్రాక్టీస్ నుంచి నాలుగు నెలల సస్పెండ్ విధించారు. ఆ నేరం రుజువైనప్పటికీ.. మరుసటి ఏడాది నుంచే అతను ఆసుపత్రి ప్రాక్టీషనర్‌గా నియమించారు.
బాధితుల్లో చిన్నారులే ఎక్కువ
అతని దగ్గరకు వైద్యం కోసం వచ్చే వారికి మత్తు మందు ఇచ్చే స్కౌర్నెక్.. తన గదిలోనే చిన్నారులపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఇతను.. అమ్మాయిలు, అబ్బాయిలనే తేడా లేకుండా.. అందరిపై అత్యాచారం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేరాలను నిందితుడు సైతం అంగీకరించాడు. తాను అసహ్యకరమైన చర్యలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. తన చర్యల కారణంగా ఆ చిన్నారులపై మనసుపై ఏర్పడిన గాయాలు ఎప్పటికీ మానుకోనివి అని తెలిసినా.. తాను ఆ తప్పులకు పాల్పడినట్లు కోర్టుకు తెలిపాడు. ఈ కేసులో నిందితుడు దోషిగా తేలితే 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. 2020లో పిల్లలపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో అతను ఇప్పటికే 15 ఏళ్ల శిక్షాకాలంలో ఉన్నాడు. ఇతని దారుణాలపై గురైన చాలా మంది చిన్నారులపై ఇతను చేసిన అకృత్యాల గురించి ఎలాంటి అవగాహన లేదు. పోలీసులు స్వాధీనం చేసుకున్న డైరీలో తమ పేర్లు చూసుకుని చాలా మంది ఆశ్యర్చపడిపోతున్నారు.