Maharaja Hanwant Singh: రాజుల కథల వెనుక ఎంతో మిస్టరీ ఉంటుంది. ముఖ్యంగా కొందరు రాజులు మరణించిన తీరు అయితే ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది. అలా మూడు పెళ్లిళ్లు చేసుకొని, అనుమానస్పద రీతిలో మరణించిన రాజు కథ ఇది. అతడే మహారాజా హన్వంత్ సింగ్. ప్రపంచంలో అత్యధిక ధనవంతుల్లో ఒకడిగా హన్వంత్ సింగ్ పేరు తెచ్చుకున్నారు. తన రాజభవనంలో బొమ్మలు కూడా బంగారం, వెండి, వజ్రాలతోనే ఉండేవట. ఆయన అంత ధనవంతుడు. జోధ్‌పూర్‌లో మొట్టమొదటి ఎయిర్‌స్ట్రిప్‌ను ఏర్పాటు చేసి అసలు ఎయిర్‌స్ట్రిప్ అంటే ఏంటో అందరికీ తెలిసేలా చేశారు హన్వంత్ సింగ్. ఆయన సామ్రాజ్యాన్ని ఎలా ఏలేవారు అనే విషయంకంటే ఆయన వైవాహిక జీవితం గురించే ప్రజలు ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉండేవారు. ఎందుకంటే ఆయన జీవితంలో ఒకటి కాదు.. మూడు ప్రేమకథలు ఉన్నాయి.
పెళ్లయ్యాక ప్రేమ
మహారాజా హన్వంత్ సింగ్ (Maharaja Hanwant Singh).. 1923లో పుట్టారు. ఆయన 24 ఏళ్లకే ధరంగద్రా రాజ్యానికి చెందిన కృష్ణ కుమారి అనే యువరాణిని పెళ్లి చేసుకున్నారు. వివాహం జరిగిన నాలుగేళ్ల తర్వాత జోధ్‌పూర్ రాజ్యానికి 24వ రాథోడ్ మహారాజు అయ్యారు. పెళ్లి తర్వాత ఆయన వేరే మహిళతో ప్రేమలో పడ్డారు. ఇండియాకు స్వాతంత్ర్యం రాకముందు మహారాజా తరచుగా యూరోప్ వెళ్తుండేవారు. అలా అక్కడే పుట్టి పెరిగిన సాండ్రా అనే నర్స్‌ను ప్రేమించడం మొదలుపెట్టారు. ప్రేమించిన తర్వాత సాండ్రాను విడిచి ఉండలేని మహారాజా.. తనను జోధ్‌పూర్‌కు తీసుకొచ్చారు. మహారాణితో పాటు సాండ్రాను కూడా ఉమైద్ ప్యాలెస్‌లోనే ఉంచారు. తనను పెళ్లి చేసుకోకపోయినా తనకు రాజమర్యాదలు దక్కేలా చేశారు. కానీ సాండ్రాకు ఇది నచ్చలేదు. అందుకే పెళ్లి చేసుకోమని పట్టుబట్టింది.
Also Read: అమితాబ్ కోసం హేమ మాలిని అలాంటి నిర్ణయం.. షాక్‌లో మేకర్స్
పెళ్లికి ఒప్పుకోలేదు
పెళ్లి చేసుకోకపోతే తిరిగి బ్రిటన్ వెళ్లిపోతానంటూ మహారాజాను బెదిరించడం మొదలుపెట్టింది సాండ్రా. కానీ ఈ పెళ్లికి రాజ్యంలో ఎవరూ సమ్మతించలేదు. అంతే కాకుండా రాజస్థాన్‌కు చెందిన హిందూ మహారాజాలు ఎవరూ కూడా దీనిని ఒప్పుకోలేదు. అటు రాజ్యం బాధ్యత.. ఇటు ప్రేమ మధ్యలో మహారాజా హన్వంత్ సింగ్ ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఉమైద్ ప్యాలెస్‌ను వదిలేసి మెహ్రాంఘడ్ కోటకు వచ్చేశారు. 1948 సెప్టెంబర్‌లో ఆర్య సమాజ్‌లో మహారాజాకు, సాండ్రాకు వివాహం జరిగింది. అప్పటికీ సాండ్రా వయసు 19 ఏళ్లే. పెళ్లి తర్వాత తన పేరును సుందర దేవిగా కూడా మార్చేసుకుంది సాండ్రా. వీరి వివాహం జరిగిన సమయంలోనే మహారాజాకు భార్యకు కొడుకు జన్మించాడు. తన పేరే గజ్ సింగ్. పెద్దయిన తర్వాత ఎంపీగా కూడా దేశానికి సేవలు చేశారు గజ్ సింగ్.
మళ్లీ మళ్లీ ప్రేమ
ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే కానీ.. సాండ్రా, హన్వంత్ సింగ్ ఎప్పుడూ సంతోషంగా లేరు. తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి. అందుకే విడాకులు తీసుకొని, భారీ భరణంతో తిరిగి బ్రిటన్ వెళ్లిపోయింది సాండ్రా. తను వెళ్లిపోయిన తర్వాత మహారాజాకు మళ్లీ ప్రేమ కనిపించింది. ఈసారి అది జుబేదా బేగం రూపంలో ఎదురయ్యింది. జుబేదా బేగం (Zubeida Begum) ఒక నటి. అప్పటికే తనకు పెళ్లయ్యి కొడుకు కూడా ఉన్నాడు. కానీ భర్తతో మనస్పర్థలు రావడంతో విడాకులు కూడా అయిపోయాయి. అలా మహారాజా, జుబేదా దగ్గరయ్యారు. మహారాజాను పెళ్లి చేసుకోవడం కోసం హిందువుగా కూడా మారింది జుబేదా. విద్యా రాణిగా పేరు మార్చుకొని 1950 డిసెంబర్ 17న హన్వంత్ సింగ్‌ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ కొన్నాళ్లకే హుకుమ్ సింగ్ రాథోర్ అనే కొడుకు కూడా పుట్టాడు.
Also Read: వామ్మో.. నెలకు రూ.24 లక్షలు అద్దె చెల్లిస్తున్న షారుఖ్.. అసలేమైందంటే.?
ఒకేసారి మరణం
జుబేదాను పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న మహారాజా.. రాజకీయాల్లో చేరాలని ఫిక్స్ అయ్యారు. 1952లో ఏర్పాటు చేసిన మొదటి లోక్ సభ ఎన్నికల్లో పాల్గొన్నారు కూడా. ఈ ఎన్నికల కోసం ప్రచారానికి బయల్దేరిన మహారాజా హన్వంత్ సింగ్, జుబేదాలు విమాన ప్రమాదంలో అక్కడికక్కడే మరణించారు. జుబేదాను రాయల్ ఫ్యామిలీ అని అంగీకరించకపోయినా తన కుమారుడిని మాత్రం రాజభవనంలోకి రానిచ్చారు. అనుకోకుండా ఒకరోజు జుబేదా కుమారిడిని రాజభవనంలోనే తల నరికి హత్య చేశారు దుండగులు. ఇప్పటికే అసలు హన్వంత్ సింగ్, జుబేదా విమాన ప్రమాదం ఒక యాక్సిడెంట్ కాదని, తమ కుమారిడిని కావాలనే రాజభవనంలో ఉన్నవారే హత్య చేశారని.. ఇలా రకరకాల పుకార్లు వినిపిస్తూ ఉంటాయి. మొత్తానికి హన్వంత్ సింగ్ జీవితకథ ఒక వీడని మిస్టరీగా మిగిలిపోయింది.