Hyderabad Narsingi Double Murder : హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జంట హత్యలు సంచలనం సృష్టించాయి. ఆ ప్రాంతంలో గుర్తు తెలియన మహిళను, మరో వ్యక్తిని కత్తితో పొడిచి, బండరాయితో మోది హంతకులు దారుణంగా చంపడంతో.. ఈ ఘటన కలకలం రేపింది. మహిళ వివస్త్రంగా కనిపించడం అనుమానాలకు కారణమైంది. మృతుడు మధ్యప్రదేశ్‌కు చెందిన అంకిత్ సాకేత్ కాగా మృతురాలు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బిందుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన జనవరి 11, 2025న జరిగింది. క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఏం జరిగింది?
నార్సింగి పరిధి పుప్పాలగూడలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం సమీపంలోని కొండ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కొండ ఎత్తుగా ఉండటంతో ప్రజలు ఉదయాన్నే సూర్యోదయాన్ని చూడటానికి ఇక్కడికి వస్తారు. మంగళవారం ఉదయం కొందరు యువకులు కొండపైకి వెళ్లినప్పుడు మొదట ఓ మృతదేహాన్ని (సాకేత్‌ది) కనుగొన్నారు.
వారు వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మొదటి మృతదేహాన్ని పరిశీలించి, ఇది హత్య అని భావించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో, సాకేత్ డెడ్‌బాడీ నుంచి 60 మీటర్ల దూరంలో మరో మృతదేహం (బిందు) కనిపించింది. మహిళ శవం వివస్త్రంగా ఉండటంతో పోలీసుల అనుమానాలు మరింత బలపడ్డాయి.
Also Read: టిండర్ యాప్‌లో స్వలింగ సంపర్కుల డేటింగ్.. కిడ్నాప్ చేసి దోపిడి
కత్తిపోట్ల గాయాలు
పోలీసులు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయగా, డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. సాకేత్ శరీరంపై కత్తిపోట్ల గాయాలు ఉన్నట్టు గుర్తించారు. హంతకులు కత్తితో దాడి చేసి, తర్వాత బండరాయితో మోదీ హత్య చేసినట్లు స్పష్టం చేశారు.
ఇద్దరు అక్కడికి ఎందుకువచ్చారు?
సాకేత్ (25) నానక్‌రామ్‌గూడలో ఉంటూ ఓ ఇంట్లో పని చేస్తున్నాడని, బిందు ఎల్బీ నగర్‌లో నివాసం ఉండేదని పోలీసులు గుర్తించారు. వీరు టూవీలర్‌పై అక్కడికి వచ్చినట్లు తెలిసింది. ఆ ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు ఎందుకు అక్కడికి వెళ్లారు, ఎవరైనా తీసుకువెళ్లారా?, వీరి మధ్య సంబంధం ఎలా ఏర్పడింది? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనా స్థలంలో బీరు సీసాలు
హత్యలు జరిగిన ప్రదేశంలో దాదాపు 10 బీరు సీసాలు ఉన్నట్టు గుర్తించారు. మద్యం మత్తులో అక్కడ ఇతర దుండగులు ఎవరైనా ఈ హత్యలు చేశారా? లేదా గొడవ వల్ల జరిగాయా అని ఆరా తీస్తున్నారు. సాకేత్, బిందు గతంలో పరిచితులని, సాకేత్ ఇటీవల బిందును తన ఇంటికి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి విచారణ తర్వాత మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.