Klaasen Six: టి-20 క్రికెట్ అంటేనే ఉత్కంఠకు మారుపేరు. ఇన్నింగ్స్ చివరి బాల్ వరకు ఇరుజట్ల మధ్య విజయం దోబూచులాడుతూ ఉంటుంది. అంతర్జాతీయ టి-20 లు, ఐపీఎల్, టీ-20 టోర్నీల్లో జరిగిన కొన్ని మ్యాచ్ లు అభిమానులకు ఉత్కంఠను కలిగించడమే కాక.. వారిని మునివేళ్లపై నిలబెట్టేలా చేస్తాయి. ఈ టి-20 టోర్నీలలో సిక్సుల వరదలు పారుతుంటాయి. బ్యాటర్ కొట్టిన బంతి స్టాండ్స్ లో ఉన్న అభిమానుల మధ్య పడడం వంటివి మనం చూస్తూనే ఉంటాం.
Also Read: Olympic Medal Rust: తుప్పు పట్టిన ఒలింపిక్స్ పతకాలు.. అథ్లెట్లకు అదిరిపోయే న్యూస్ !
ఆ బంతిని అభిమానులు కూడా క్యాచ్ గా తీసుకుంటుంటారు. అయితే తాజాగా జరిగిన ఓ మ్యాచ్ లో సిక్స్ వెళ్లిన బంతిని ఓ అభిమాని ఎత్తుకెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. సౌత్ ఆఫ్రికా టీ-20 లీగ్ (SA20) లో భాగంగా మంగళవారం రోజు జోబర్గ్ సూపర్ కింగ్స్ – డర్బన్ సూపర్ జెయింట్స్ మధ్య ఎనిమిదవ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన జోబర్గ్ సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ బ్యాటింగ్ లో జోబర్గ్ సూపర్ కింగ్స్ బ్యాటర్లు నిరాశపరిచారు.
20 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం లక్ష్యాన్ని చేదించడానికి బలిలోకి దిగిన డర్బన్ జట్టు కేవలం 7 ఓవర్లలోనే 51 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో డికాక్ 55 పరుగులతో రాణించాడు. మరోవైపు క్లాసెన్ కూడా ఇన్నింగ్స్ లో స్పీడ్ పెంచే ప్రయత్నం చేశాడు. ఆ దశలో అతడు రెండు ఫోర్లు, రెండు సిక్స్ లతో కేవలం 29 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే అతడు కొట్టిన రెండు సిక్స్ లలో ఒక సిక్స్ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సిక్స్ ఘటనని డర్బన్ క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకంగా నిలిచిపోతుంది. తబ్రేజ్ షంషీ బౌలింగ్ లో.. క్లాసెన్ 10.5 బంతిని బలంగా బ్యాక్ పుట్ నుంచి బాదాడు. ఆ బంతి 87 మీటర్ల దూరం నీ దాటి స్టేడియం పైకప్పుకి తాగింది. అక్కడినుండి మళ్లీ బౌన్స్ అయి నేరుగా పక్కనే ఉన్న రోడ్డుపైకి వెళ్ళింది. అయితే ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్నా ఓ అభిమాని ఆ బంతిని చూసి.. వెంటనే దానిని తీసుకొని పారిపోయాడు.
Also Read: Rohit Sharma: రోహిత్ శర్మ ప్రాణాలకే ముప్పు..పాకిస్థాన్ వెళ్లొద్దు అంటూ ఫ్యాన్స్ రచ్చ !
దీంతో స్టాండ్స్ లో ఉన్న అభిమానుల పెదవులపై నవ్వులు విరబూశాయి. ఈ ఘటనతో ఆ మ్యాచ్ లో బంతిని మార్చాల్సి వచ్చింది. అతడు ఈ బంతిని దొంగిలించిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ మ్యాచ్ లో డర్బన్ సూపర్ జెంట్స్ 18 ఓవర్లలో 141 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. దీంతో డర్బన్ పై జోబర్గ్ సూపర్ కింగ్స్ 28 పరుగులు తేడాతో గెలుపొందింది.
— rohitkohlirocks@123@ (@21OneTwo34) January 14, 2025