AP Govt: ఏపీ ప్రభుత్వం మహిళలకు తీపి కబురు చెప్పేసింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద దాదాపు 90 వేల మంది ప్రయోజనం చేకూరనుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆ మహిళల కళ్లలో ఆనందం అంతా ఇంతా కాదు. చాన్నాళ్లు పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టేసింది. ఇంతకీ ఆ స్కీమ్ డీటేల్స్‌లోకి ఒక్కసారి వెళ్లొద్దాం.
వితంతువులకు శుభవార్త
వితంతువులకు శుభవార్త చెప్పింది చంద్రబాబు ప్రభుత్వం. గడిచిన రెండేళ్ల నుంచి పెన్షన్ పొందుతూ మధ్యలో చనిపోయిన భర్తల స్థానంలో వారి భార్యలకు కొత్తగా పెన్షన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. దీని ప్రకారం దాదాపు 89,788 మందికి లబ్ది చేకూరనుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆ మహిళలకు ఇదొక అద్భుతమైన అవకాశం.
భర్త పోయిన తర్వాత చాలామంది మహిళలు నరకం అనుభవిస్తున్నారు. వారిని కొడుకులు చూసిన సందర్భం లేదు. దీంతో దినదిన గండంగా జీవిస్తున్నారు. కాకపోతే పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే పెన్షన్ వస్తుంది. ఈ విషయాన్ని మాత్రం గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు అప్లై చేస్తే మే ఒకటి నుంచి నెలకు రూ.4000 వేలు పెన్షన్ వస్తుంది.
నేటి నుంచి దరఖాస్తులు స్వీకరణ
అర్హులైన మహిళలు గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల చివరిలోపు (ఏప్రిల్ 30) అవసరమైన వివరాలు అందజేయాలి. అందుకు సంంధించిన పత్రాలు సమర్పిస్తే మే ఒకటి నుంచి పెన్షన్ అందుకోవచ్చు. మీ ఆధార్, ఓటర్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, భర్త మరణానికి సంబంధించిన పత్రాన్ని సచివాలయంలో ఇవ్వాలి.
ALSO READ: అన్నదమ్ముల మధ్య కోల్డ్ వార్, ఫుల్‌స్టాప్ ఎప్పుడు?
ఇంకేమైనా కావాలంటే అక్కడ సిబ్బంది చెబుతారు. దయచేసి సమీపంలోని సచివాలయానికి వెళ్లి, పూర్తి వివరాలు తెలుసుకోండి. ఆపై అప్లై చేయండి.. ఏ మాత్రం ఆలస్యం చేయవద్దు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే మే నెల పెన్షన్ మిస్సయ్యే అవకాశం ఉంది.
టెక్నాలజీ సాయంతో
దీనికి సంబంధించిన వ్యవహారం కొన్నాళ్లుగా నలుగుతూ వస్తోంది. సీఎం చంద్రబాబు వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో ఆమోద ముద్ర పడలేదు. ఈ విషయాన్ని కొందరు అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పేద వితంతువులకు ఆర్థిక భద్రత కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
ఈ స్కీమ్ కింద ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వితంతువులకు కొంత రిలీఫ్. ఏపీలో పెన్షన్ పథకం కింద 63.27 లక్షల మంది లబ్ధిదారుల కోసం నెలకు రూ. 2,722 కోట్లు పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. సామాజిక భద్రత పెన్షన్ల కోసం ఏడాదికి రూ. 33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. పేదరిక నిర్మూలనకు ముఖ్యమైన కార్యక్రమంగా దీన్ని వర్ణించారు. దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేయడానికి టెక్నాలజీని ఉపయోగిస్తుంది. దీనిద్వారా పారదర్శకతతో పెన్షన్లు పంపిణీ చేయవచ్చు. ఈ స్కీమ్ గురించి మరిన్ని వివరాలు సమీపంలోని సచివాలయాన్ని సంప్రదించవచ్చు.