Pune Bus Rape Case: పుణెలోని స్వర్గేట్ బస్టు క్లాంపెక్సులో మహిళపై అత్యాచారం చేసిన నిందితుడు పోలీసులకు చిక్కాడు. శుక్రవారం వేకువజామున ఫుణె జిల్లాల్లోని శిరూర్ తహసీల్‌లో అరెస్ట్ చేశారు. నిందితుడు దత్తాత్రేయ గాడెను అక్కడి నుంచి పోలీసుస్టేషన్‌కు తరలించారు. బస్సుకోసం వేచి ఉన్న బాధితురాలిని ప్రలోభ పెట్టి అత్యాచారానికి పాల్పడిన ఈ ఘటన మహారాష్ట్రలో తీవ్ర కలకలం రేపింది.
స్వార్గేట్ బస్సుస్టేషన్‌లో బస్సులో 26 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు నిందితుడు దత్తాత్రేయ్ గాడే. ఈ వ్యవహారం మహారాష్ట్రలో తీవ్ర దుమారం రేపింది. నిందితుడ్ని పట్టిస్తే రివార్డు ఇస్తామని ప్రకటించారు పోలీసులు. నిందితుడి కోసం ప్రత్యేకంగా 13 టీమ్‌లను ఏర్పాటు చేశారు అధికారులు. గాలింపు చర్యలు చేపట్టిన ఆయా టీమ్‌లకు దత్తత్రేయ చిక్కాడు.
దత్తాత్రేయ్ గాడేని నగరంలో శిరుర్ తహసీల్‌లో అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దత్తాత్రేయ్ గాడే ఒక చిల్లర దొంగ. పూణె, అహిల్యా నగర్ జిల్లాలలో అరడజనుపైగా దొంగతనాలు, దోపిడీ, చైన్ స్నాచింగ్ కేసుల్లో కీలక నిందితుడు. ఓ కేసులో గడిచిన ఆరేళ్ల నుంచి బెయిల్‌పై బయట ఉన్నాడు. గాడేని పట్టుకోవడానికి శిరూర్ తహసీల్‌లో గురువారం డ్రోన్లు, డాగ్ స్క్వాడ్‌ను మోహరించాయి ప్రత్యేక టీమ్‌లు.
మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు డిపోల్లో పూణెలోని స్వార్గేట్ అతి పెద్దది. బాధితురాలి కథనం ప్రకారం.. మంగళవారం ఉదయం దాదాపు ఆరుగంటల సమయంలో సతారా జిల్లాలోని ఫాల్టాన్‌కు బస్సు కోసం మహిళ ఎదురుచూస్తోంది. ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై ఎదురు చూస్తుండగా ఆమెని గమనించాడు గాడే. ఆ తర్వాత ఆమెతో మాట్లాడటం ప్రారంభించాడు.
ALSO READ: చదువు లేదు.. 100 కోట్లకు కుచ్చుటోపి
తొలుత అక్క అని పిలిచి మరింత దగ్గరయ్యాడు. సతారా వెళ్లేందుకు బస్సు మరొక ప్లాట్‌ఫామ్ మీదికి వచ్చిందని చెప్పి నమ్మించాడు. ఆమెను పక్కనే ఖాళీగా ఉన్న ఓ ఏసీ బస్సులోకి తీసుకెళ్లాడు. బస్సులో లైట్లు లేకపోవడంతో తొలుత లోపలికి వెళ్లడానికి ఇష్టపడలేదు. కానీ ఈ బస్సునని చెప్పి నమ్మించాడు. నిజమేనని నమ్మేసింది ఆ మహిళ. ఆ తర్వాత గాడే తనను వెంబడించి అత్యాచారం చేశాడు. హెల్త్ సెక్టార్‌లో బాధితురాలు పని చేస్తున్నట్లు సమాచారం. పోలీసుల విచారణలో నిందితుడు ఇంకెన్ని కొత్త విషయాలు బయటపెడతాడో చూడాలి.