BigTV English

Trump Gaza : విలాసవంతమైన గాజా జీవనం.. ట్రంప్ వీడియోపై తీవ్ర వ్యతిరేకత!

Trump Gaza : విలాసవంతమైన గాజా జీవనం.. ట్రంప్ వీడియోపై తీవ్ర వ్యతిరేకత!

Trump Gaza Criticism | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియాలో “ట్రంప్ గాజా” అనే ఏఐ జనరేటెడ్ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో గాజాను ఒక విలాసవంతమైన ప్రాంతంగా చిత్రీకరించారు, దీనిలో ఆకాశాన్ని తాకే ఎత్తైన భవనాలు, లగ్జరీ ఓడలు, బంగారు రంగులో మెరిసే నగరం, స్ట్రిప్ క్లబ్బులు,  ట్రంప్, ఎలాన్ మస్క్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ వంటి వ్యక్తులు విలాసాలు అనుభవిస్తూ కనిపిస్తున్నారు. అయితే.. ఈ వీడియో గాజా ప్రజల వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించడం లేదని విమర్శలు వచ్చాయి.


హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు బసీమ్ నయీమ్ ఈ వీడియోను ఖండిస్తూ, “గాజా ప్రజలు కోరుకున్నది పునర్నిర్మాణం, స్వేచ్ఛ అంతేకానీ బంధీఖానాల్లో మెరుగైన జీవితం కాదు” అని పేర్కొన్నారు. ట్రంప్ ఈ వీడియో ద్వారా గాజా ప్రజల ఆకాంక్షలను నిర్లక్ష్యం చేశారని చాలా మంది తప్పబట్టారు.

గాజాలో ప్రస్తుతం ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై  దాడి చేసిన తర్వాత.. గాజాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేసింది. ఇప్పటివరకు 48,200 మంది పాలస్తీనా ప్రజలు మరణించారు, వీరిలో మహిళలు, పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంది. 90 శాతం గాజా ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. అయితే ఇప్పుడు యుద్ధం ఆగిపోయే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాజా ప్రజల మనోభావాలు దెబ్బతినేవిధంగా వీడియో పోస్ట్ చేయడం వివాదాస్పదంగా మారింది.


Also Read: అలా చేస్తేనే ఖనిజాలిస్తాం.. అమెరికాకు షరతులు విధించిన ఉక్రెయిన్

గాజా పునర్నిర్మాణం కోసం ట్రంప్ ఒక ప్రతిపాదనను ముందుకు తెచ్చారు, దీని ప్రకారం గాజాలోని 21 లక్షల పాలస్తీనా ప్రజలను ఇతర అరబ్బు దేశాలకు ప్రాంతాలకు తరలించి, గాజాను ఒక విలాసవంతమైన ప్రాంతంగా మార్చాలని సూచించారు. ఈ ప్రతిపాదనకు ఇజ్రాయెల్ మద్దతు తెలిపినప్పటికీ, అరబ్ దేశాలు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ విషయంపై ఈజిప్ట్ మార్చి 4న ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది.

ప్రస్తుతం ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉంది. ఈ ఒప్పందం ప్రకారం.. బందీల మార్పిడి జరుగుతోంది. ఈ పరిస్థితులలో ట్రంప్ వీడియో, ప్రతిపాదనలు వివాదాస్పదంగా మారాయి.

గాజాను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను అరబ్ దేశాల్నీ వ్యతిరించాయి. అమెరికా మిత్రదేశాలైన ఈజిప్ట్ , జోర్డాన్, సౌదీ అరేబియా సైతం ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించడం గమనార్హం. తాజాగా ట్రంప్ గాజా పునర్నిమాణం పేరుతో విలావంతమైన భవనాలు, క్లబ్బుల ఏఐ వీడియోపై ప్రతిపక్ష డెమోక్రాట్లతో పాటు ఆయన సొంత అభిమానులు కూడా వ్యతిరేకిస్తున్నారు.

ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం. ‘ట్రంప్ గాజా’ పేరిట ఉన్న ఈ వీడియో ఒక దేశాధ్యక్షుడు విడుదల చేయడం దురదృష్టకరం అని ఒక ట్రంప్ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. మరో అభిమాని అయితే.. నేను ఈ వీడియోని ద్వేషిస్తున్నాను. కానీ నాకు ప్రెసిడెంట్ అంటే ప్రేమ. అయినా ఈ వీడియో మాత్రం చాలా భయంకరంగా ఉంది అని రాశాడు.

మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికాలో అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపకుడు కూడా ఈ వీడియోని తప్పుబట్టారు. శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో ఈ వీడియో రావడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ట్రంప్ వెంటనే ఈ వీడియోని తొలగించాల్సిందిగా ఆయన కోరారు.

Related News

Larry Ellison: నా ఆస్తుల్లో 95 శాతం పంచేస్తా.. ప్రపంచంలోనే సెకండ్ రిచెస్ట్ పర్సన్ ల్యారీ ఎల్లిసన్ కీలక ప్రకటన

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

Big Stories

×