Thaman: టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసి బ్లాక్ బస్టర్ హిట్ మూవీలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు సినిమాల్లో యాక్టర్ గా కనిపించాడు. హీరో సిద్ధార్థ తో కలిసి బాయ్స్ సినిమాలో నటించాడు. అయితే అప్పట్లో సిద్ధార్థ కు తమన్ కి అస్సలు పడేది కాదని సంచంద్ర విషయాన్ని బయట పెట్టాడు తమన్.. ఇటీవల ఆది పినిశెట్టి హీరోగా నటించిన శబ్దం మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతు సిద్దార్థ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవ్వడంతో తమన్ పై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అసలు వీరిద్దరి గొడవలకు కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అరివళగన్ దర్శకత్వంలో ఆది పినిశెట్టి హీరోగా నటించిన శబ్ధం సినిమాకు తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ మూవీ ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇటీవల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మూవీ యూనిట్ తో పాటు తమన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తమన్ మాట్లాడుతూ సినిమాల్లోకి తను ఎంట్రీ ఇచ్చిన విషయాలను గురించి అందరితో పంచుకున్నారు..
Also Read :సొంతూరికి వెళ్లిన బాలయ్య.. ఒక్క మాటతో ఊరివాళ్ళ పై ఫైర్..
ఈ ఈవెంట్ లో తమన్ మాట్లాడుతూ.. బాయ్స్ సినిమా లో ఎక్కువ పారితోషికం అందుకున్నాను. సిద్దార్థ్ కు, నాకు అస్సలు పడేది కాదు. వాడు నేనే హీరో అంటే.. నువ్వు హీరో అయితే ఏంటి? హీరోయిన్ అయితే నాకేంటి? ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటోంది నేను.. అనేవాడిని. చాలా టార్చర్ పెట్టేవాడిని. సినిమా షూటింగ్‌లో ఓసారి సిద్దార్థ్‌కు నైకీ సాక్స్ ఇచ్చి నాకు ఏదో మామూలు సాక్స్ ఇచ్చారు. ఇక దీనిపై ఏకంగా నిర్మాత తోనే నేను మాట్లాడంతో వాళ్ళు నాకు మళ్ళీ అంతకుమించి ఎక్కడ తక్కువ కాకుండా చూసుకున్నారని తమన్అన్నారు.. బాయ్స్ సెట్‌లో ఎవరి మాటా వినకుండా అందరినీ టార్చర్ పెట్టేవాడిని. క్యారవాన్‌లో ప్లగ్ తీసేసి కరెంట్ ఆపేవాడిని. బాత్రూమ్‌కు వెళ్లే నీళ్ల పైప్ కూడా కట్ చేసేవాడిని. ఇలా చాలా పెంటలు చేశాను. ఇవన్నీ అరివళగన్ కంట్రోల్ చేసేవాడు. సినిమా డైరెక్షన్ నేర్చుకోవడానికి వచ్చి నన్ను చూసుకునే పనిలో పడ్డాడని తమన్ సరదాగా అన్నారు.. ఈ వీడియో వైరల్ అవ్వడంతో తమన్ శాడిజం గురించి విని అందరూ షాక్ అవుతున్నారు. ఇక తమన్ సినిమాలు విషయానికొస్తే ఇటీవల టాక్ మహారాజ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. అఖండ 2 సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.. తమన్ తెలుగు తో పాటు తమిళ్లో కూడా పలు చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల రిలీజ్అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రతి సినిమాకి తమన్ సంగీతాన్ని అందించారు.