Rachakonda CP Sudhir Babu: అంతర్ రాష్ట్ర డ్రగ్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. నిందితుల నుంచి 53.5 కిలోల పప్పీ స్ట్రా డ్రగ్ ను సీజ్ చేశారు. పట్టుబడిన డ్రగ్ విలువ మార్కెట్‌లో కోటి 25 లక్షలు. సోమవారం ఉదయం రాచకొండ సీపీ సుధీర్‌బాబు మీడియా సమావేశంలో ఈ విషయాన్ని బయటపెట్టారు.
దీనికి సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మంగీలాల్ భిష్ణోయి, మంగీలాల్ ధాక, బైరా రామ్‌లు. వీరంతా రాజస్థాన్‌కు చెందినవారు. నిందితులు మధ్యప్రదేశ్ నుండి హైదరాబాద్‌కు పప్పీ స్ట్రాను అక్రమ రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. ఈజీ మనీ కోసం నార్కోటిక్ డ్రగ్స్ విక్రయించాలని నిందితులు ప్లాన్ చేసినట్టు వెల్లడించారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌కు చెందిన పింటూ అనే డ్రగ్ పెడ్లర్లతో పరిచయం పెంచుకున్నాడు.
పింటూ నుండి తక్కువ ధరకు పప్పీస్ట్రాను కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు చిక్కారు. లారీలు, బస్సుల, రైళ్ల ద్వారా పప్పీ స్ట్రాను హైదరాబాద్ సిటీకి తీసుకువచ్చి విక్రయాలు చేస్తున్నట్లు తేలింది. పక్కా సమాచారంతో ఎల్బీనగర్ జోన్ ఎస్ఓటి పోలీసులు-మీర్‌పేట్ పోలీసుల సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు.
53.5 కేజీల పప్పీ స్ట్రా డ్రగ్‌తోపాటు మూడు మొబైల్ ఫోన్స్ సీజ్ చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు. త్వరలో వారిని అరెస్ట్ చేస్తామన్నారు. గతేడాది మంగీలాల్ బిస్నోయిని హయత్‌నగర్ పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. హెరాయిన్ విక్రయిస్తుండగా పట్టుబడ్డాడు.
ALSO READ: అద్దెకు బ్యాంక్ అకౌంట్.. డబ్బే డబ్బు.. ఆశ పడితే ఇక అంతే!
NDPS చట్టం 1985 ప్రకారం.. పప్పీ స్ట్రా అనేది మాదక ద్రవ్యాలలో ఒకటి. పప్పీ స్ట్రాను విక్రయించడం ముమ్మాటికీ నేరం కూడా. మెయిన్ ఫెడ్లర్ పింటుని పట్టుకోవడం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే మరో ముగ్గురు స్థానిక రిసీవర్స్ ఉన్నారని, వారిని పట్టుకుంటామన్నారు సీపీ సుధీర్‌బాబు. ప్రస్తుతం పట్టుబడిన డ్రగ్ రైలులో హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. పప్పీ స్ట్రాను ప్రాసెస్ చేస్తే ఓపీఎం వస్తుంది.