Skin Whitening Tips: గ్లిజరిన్ చర్మ సంరక్షణలో మాయిశ్చరైజర్‌గా, అద్భుతంగా పనిచేస్తుంది. గ్లిజరిన్‌ను కాస్మోటిక్‌లలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వీటివల్ల చర్మం కాంతివంతంగా, అందంగా తయారు అవుతుంది. గ్లిజరిన్ స్కిన్ కేర్‌లో ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం.
గ్లిజరిన్, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్
ముందుగా చిన్న బౌల్ తీసుకుని అందులో.. రెండు టేబుల్ స్పూన్ గ్లజరిన్, రెండు టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమంలో దూది కాటన్ ముంచి ముఖానికి పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.. ముఖం కాంతివంతంగా, బ్రైట్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా గ్లిజరిన్ వల్ల స్కిన్ చాలా స్పూత్‌గా ఏర్పడుతుంది. ముఖంపై మృతకణాలు తగ్గిస్తుంది. అలాగే ముడతలు కూడా తగ్గిపోతాయి.
గ్లిజరిన్, చక్కెర, నిమ్మరసం ఫేస్ ప్యాక్
ముందుగా చిన్న గిన్నె తీసుకుని.. అందులో రెండు టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్, టేబుల్ స్పూన్ గ్లిజరిన్, టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేయండి. 10-15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. ముఖంపై మచ్చలు, మృతకణాలు, ట్యాన్ తొలగిపోతాయి. ముఖం కాంతివంతంగా, మెరిసేలా చేస్తుంది. ఇలా రెగ్యులర్‌గా చేస్తే.. చాలా యంగ్‌గా కనిపిస్తారు.
ముల్తానీ మిట్టి, గ్లిజరిన్, పచ్చిపాలు ఫేస్ ప్యాక్
చిన్న గిన్న తీసుకుని అందులో.. రెండు టేబుల్ స్పూన్ ముల్తానీ మిట్టి, రెండు టేబుల్ స్పూన్ పచ్చిపాలు, టీ స్పూన్ గ్లిజరిన్ కలిపి ముఖానికి పెట్టుకోండి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే.. ముఖంపై ముడతలు తగ్గిపోతాయి. అలాగే మొటిమలు, మచ్చలు తొలగిపోయి కాంతివంతంగా, మిలమిల మెరుస్తుంది.
గ్లిజరిన్, తేనె, టీట్రీ ఆయిల్
ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ గ్లిజరిన్, టీ స్పూన్ తేనె, రెండు, మూడు చుక్కలు టీట్రీ ఆయిల్ కలిపి ముఖానికి పెట్టుకోండి. 10-14 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం ముఖాన్ని క్లీన్ చేసుకోండి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే.. ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గిపోయి యవ్వనంగా కనిపిస్తారు.
గ్లిజరిన్, పెరుగు, ఓట్స్ ఫేస్ ప్యాక్
చిన్న గిన్నె తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ పెరుగు, టీ స్పూన్ గ్లిజరిన్, ఓట్స్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్ కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా మూడు రోజులకు ఒకసారి చేస్తే.. మెరిసే చర్మం మీ సొంతం.
అయితే గ్లిజరిన్‌ను ఉపయోగించే ముందు.. అతి తక్కువ మాత్రమే ఉపయోగించాలి. అది కూడా చాలా పలుచగా ముఖానికి రాసుకోవాలి. లేదంటే చర్మానికి హాని కలిగిస్తుంది.
Also Read: ఉల్లితో ఇలా చేస్తే.. ఊడిన జుట్టు మళ్లీ వస్తుంది తెలుసా?
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.