E-Paper
Advertisement

రీల్స్‌ కోసం వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి.. 16 గంటలు అక్కడే చిక్కుకుని..

రీల్స్‌ కోసం వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి.. 16 గంటలు అక్కడే చిక్కుకుని..
Advertisement

Reels Accident: సోషల్ మీడియా పిచ్చి యువతను ఏ స్థాయికి తీసుకెళ్తుందో చెప్పడానికి ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనే ఒక పెద్ద ఉదాహరణ. కేవలం కొన్ని లైకులు, కామెంట్ల కోసం ప్రాణాలను పణంగా పెట్టి రీల్స్ చేయడం ఇప్పుడు ఒక ప్రమాదకరమైన ట్రెండ్‌గా మారింది. సిద్ధార్థ్‌నగర్ జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది.

సిద్ధార్థ్‌నగర్ జిల్లాకు చెందిన ఐదుగురు మైనర్ బాలురు రీల్స్ షూట్ చేయాలనే ఉత్సాహంతో ఒక పాత వాటర్ ట్యాంక్ పైకి ఎక్కారు. షూటింగ్ పూర్తి చేసుకుని కిందకు దిగుతున్న సమయంలో ఊహించని ప్రమాదం జరిగింది. ఆ పాత ట్యాంక్ నిచ్చెన ఒక్కసారిగా విరిగిపోయింది. దీంతో ముగ్గురు బాలురు ఒక్కసారిగా పైనుంచి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఒక బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.

Advertisement

నిచ్చెన విరిగిపోవడంతో మిగిలిన ఇద్దరు బాలురు ట్యాంక్ పైనే చిక్కుకుపోయారు. కింద పడిపోయిన వారి పరిస్థితి చూసి వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వారిని రక్షించేందుకు రాత్రంతా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు పరిస్థితి తీవ్రతను గమనించిన యంత్రాంగం భారత వైమానిక దళం (IAF) సహాయం కోరింది.

దాదాపు 16 గంటల పాటు మృత్యువుతో పోరాడిన ఆ ఇద్దరు బాలురను వైమానిక దళ హెలికాప్టర్ ద్వారా సురక్షితంగా కిందకు దించారు. ఒక చిన్న రీల్ కోసం చేసిన ప్రయత్నం ఒకరి ప్రాణం తీయడమే కాకుండా, మరికొందరిని చావు అంచుల వరకు తీసుకెళ్లింది. ఇప్పటికైనా యువత ఇలాంటి సాహసాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Also Read: మిర్యాలగూడలో భారీ అగ్నిప్రమాదం.. సబ్ స్టేషన్‌లో ఎగిసిపడ్డ మంటలు!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×