Shoaib Akhtar : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విషం కక్కుతున్నారు. ఐపీఎల్ టోర్నమెంట్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఐపీఎల్ అంటేనే మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ బాంబు పేల్చుతున్నారు. ఇక లేటెస్ట్ గా టీమిండియా పై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) హాట్ కామెంట్స్ చేశారు. భవిష్యత్తులో టీమిండియాతో ఏం మ్యాచ్ జరిగినా చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా 2027 వన్డే వరల్డ్ కప్ లో ( 2027 ODI World Cup ) టీమిండియాను ఓడించి ఇంటికి పంపిస్తామని సవాల్ విసిరారు షోయబ్ అక్తర్. అలా టీమ్ ఇండియాను ఓడించకపోతే, బట్టలు లేకుండా పాకిస్తాన్ వీధుల్లో తిరుగుతానని సంచలన చాలెంజ్ విసిరారు షోయబ్ అక్తర్.
Also Read: Islamabad United vs Hyderabad Kingsmen, Eliminator 2 PSLలో మరో అరాచకం.. డబ్బులు లేక ఆంటీలతో క్లీన్ చేయిస్తున్నారు, దొంగల్లా దూరేస్తున్నారు
పాకిస్తాన్ సూపర్ లీగ్ ( PSL 2026), ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) ఒకేసారి జరుగుతున్న నేపథ్యంలో రకరకాల ఆరోపణలు చేస్తున్నారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు. ఈ క్రమంలో టీమిండియాను చిత్తుగా ఓడిస్తామని శపథం చేశారు మాజీ పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ( Shoaib Akthar). ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు చాలా బలంగా ఉందని వ్యాఖ్యానించారు. గతంలో కంటే భయంకరంగా కనిపిస్తోందని వెల్లడించారు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ సెక్షన్ కూడా అద్భుతంగా ఉందన్నారు. ఇదే ఊపుతో వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ లోకి వెళ్తే టీం ఇండియాను చిత్తుగా పాకిస్తాన్ ఓడిస్తుందని చాలెంజ్ విసిరారు. ఇండియా ను ( Team India) ఓడించకపోతే బట్టలు లేకుండా తిరుగుతానని సవాల్ చేశారు షోయబ్ అక్తర్.
టీమిండియా పై షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలకు వీరేంద్ర సెహ్వాగ్ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. కొన్ని పిచ్చి కుక్కలు ఇలాగే మాట్లాడతాయని… కానీ టీమిండియాను ఓడించడం ఎవడి తరం కాదన్నారు. టీమిండియాను ఓడించే ముందు జింబాబ్వే జట్టు పైన విజయం సాధించాలని షోయబ్ అక్తర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వీరేంద్ర సెహ్వాగ్.ఇప్పటికే చాలా టోర్నమెంట్లలో పాకిస్తాన్ జట్టును టీమిండియా చిత్తు చేసిందని వ్యాఖ్యానించారు. ఇది గుర్తు లేకుండానే షోయబ్ అక్తర్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పుడే కాదు గతంలో కూడా చాలా మ్యాచుల్లో పాకిస్తాన్ ను మట్టి కనిపించామని వెల్లడించారు. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ కు చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ గా మారాయి. మరి దీని పై షోయబ్ అక్తర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Also Read: Ramiz Raja Hug: కామెంట్రీలో చేస్తుండగా రొమాన్స్..రమీజ్ రాజా, లీసా హాట్ వీడియో వైరల్
https://www.facebook.com/photo/?fbid=993879260219483&set=a.808612632079481