E-Paper
Advertisement

భారత్‌లోకి తోషిబా MiniLED టీవీలు.. అదిరిపోయే సౌండ్, పిక్చర్ క్వాలిటీతో!

భారత్‌లోకి తోషిబా MiniLED టీవీలు.. అదిరిపోయే సౌండ్, పిక్చర్ క్వాలిటీతో!
Advertisement

Toshiba Z670SP MiniLED TV: ప్రముఖ గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ తోషిబా (Toshiba), ఇండియన్ మార్కెట్లోకి తన సరికొత్త Z670SP MiniLED TV సిరీస్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో.. సరికొత్త విప్లవం సృష్టిస్తూ, ఈ సిరీస్‌లో ఏకంగా 100 ఇంచుల భారీ స్క్రీన్ వేరియంట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. గేమింగ్ లవర్స్2ను అలరించేలా 144Hz రిఫ్రెష్ రేట్, మెరుగైన ఆడియో కోసం ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు ,పవర్‌ఫుల్ REGZA ఇంజిన్‌తో ఈ టీవీలు రూపొందాయి. ప్రీమియం ఫీచర్లు ఉన్నప్పటికీ.. ధరలో ఇవి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.

Toshiba Z670SP MiniLED TV పూర్తి వివరాలు:
తోషిబా తన ప్రీమియం టీవీ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ భారత్‌లో Z670SP సిరీస్‌ను ప్రవేశపెట్టింది. ఈ సిరీస్‌లో ప్రధానంగా ఐదు సైజులు (55, 65, 75, 85 , 100 ఇంచులు) అందుబాటులో ఉన్నాయి.

Advertisement

డిస్ప్లే, పిక్చర్ క్వాలిటీ:
ఈ టీవీలలో వాడిన MiniLED టెక్నాలజీ వల్ల సాధారణ LED టీవీల కంటే అద్భుతమైన బ్రైట్‌నెస్, డీప్ బ్లాక్ కలర్స్ కనిపిస్తాయి. ఇందులో QLED కలర్ టెక్నాలజీని కూడా ఉండటం వల్ల రంగులు చాలా సహజంగా, స్పష్టంగా ఉంటాయి. 4K రిజల్యూషన్‌తో పాటు డాల్బీ విజన్ సపోర్ట్ ఉండటంతో సినిమా చూస్తున్న ఫీల్ కలుగుతుంది.

గేమింగ్ ఫీచర్లు:
గేమర్ల కోసం ఈ టీవీలో Native 144Hz రిఫ్రెష్ రేట్ ప్యానెల్‌ను అమర్చారు. దీనివల్ల వేగంగా కదిలే యాక్షన్ సీన్లు లేదా గేమింగ్ గ్రాఫిక్స్ చాలా స్మూత్‌గా కనిపిస్తాయి.గేమ్ మోడ్ ప్రో ఫీచర్ ద్వారా ఇన్‌పుట్ లాగ్ తగ్గి, గేమ్ ప్లే మెరుగ్గా ఉంటుంది. VRR (Variable Refresh Rate), ALLM (Auto Low Latency Mode) వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

Advertisement

ఆడియో పెర్ఫార్మెన్స్:
చాలా టీవీల్లో స్పీకర్లు కిందికి లేదా వెనకకు ఉంటాయి. కానీ ఈ తోషిబా మోడల్‌లో ముందు ఇచ్చారు. దీని వల్ల సౌండ్ నేరుగా మనకు చేరుతుంది. REGZA Power Audio+, Dolby Atmos టెక్నాలజీతో కూడిన ఈ ఆడియో సిస్టమ్ థియేటర్ లాంటి సౌండ్ ఎఫెక్ట్‌ను అందిస్తుంది.

Also Read: తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ కావాలా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే

REGZA ఇంటెలిజెన్స్:
తోషిబా సొంత REGZA Engine ZRi ప్రాసెసర్ ఈ టీవీలకు మెదడు లాంటిది. ఇది ఏఐ సాయంతో మీరు చూసే కంటెంట్‌ను బట్టి పిక్చర్ సెట్టింగ్స్ మరియు సౌండ్‌ను రియల్ టైమ్‌లో ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది. దీని వల్ల సాధారణ కేబుల్ టీవీ ఛానెల్స్ కూడా 4K నాణ్యతలో కనిపిస్తాయి.

ధర :
ప్రారంభ ధర: ఈ తోషిబా సిరీస్ రూ. 64,990 నుంచి ప్రారంభమవుతుంది.అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్ , ఆఫ్‌లైన్ స్టోర్లలో లభిస్తాయి.

లాంచ్ ఆఫర్: కస్టమర్లు రూ. 10వేల వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అలాగే.. 2 ఏళ్ల వారంటీ, నో-కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉన్నాయి.

మీరు ఇంటినే సినిమా థియేటర్‌లా మార్చుకోవాలనుకుంటే లేదా పెద్ద స్క్రీన్‌పై గేమింగ్ ఆస్వాదించాలనుకుంటే.. తోషిబా Z670SP MiniLED టీవీ ఒక అద్భుతమైన ఆప్షన్. ముఖ్యంగా 100 అంగుళాల మోడల్ టీవీ ప్రియులకు మంచి ఫీల్ ఇస్తుంది.

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×