E-Paper
Advertisement

Property Tax: ట్యాక్స్ కలెక్షన్స్ పై యాక్షన్ షురూ.. నలుగురు బిల్ కలెక్టర్ల పై సస్పెన్షన్ వేటు

Property Tax: ట్యాక్స్ కలెక్షన్స్ పై యాక్షన్ షురూ.. నలుగురు బిల్ కలెక్టర్ల పై సస్పెన్షన్ వేటు
Advertisement

Property Tax: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ లోని ప్రజలకు పౌర, అత్యవసర సేవలందించే మూడు మున్సిపల్ కార్పొరేషన్ల ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ పై అధికారులు ఉచ్చు భిగిస్తున్నారు. ట్యాక్స్ కలెక్షన్ లో అధికారుల ఆదేశాలను ఉల్లంఘించి ఫీల్డు లెవల్ విధులకు హాజరు కాని, ఇచ్చిన టార్గెట్ ప్రకారం ట్యాక్స్ వసూలు చేయని బిల్ కలెక్టర్లపై కొరడా ఝుళిపిస్తున్నారు. మూడు కార్పొరేషన్లలో కలిపి వర్తమాన ఆర్థిక సంవత్సరం రూ.3 వేల కోట్ల కలెక్షన్ ను టార్గెట్ గా పెట్టుకోగా, ఇప్పటి వరకు మూడు కార్పొరేషన్లలో సుమారు రూ. 2 వేల కోట్ల పై చిలుకు వసూలైనట్లు తెలిసింది. ఈ నెలాఖరుతో వర్తమాన ఆర్థిక సంవత్సరం ముగియనున్నందున మిగిలిన 21 రోజుల్లో టార్గెట్ కు మిగిలి ఉన్న సుమారు రూ. వెయ్యి కోట్లను వసూలు చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించి మూడు కార్పొరేషన్ల పరిధిలోని 145 మంది ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు, 343 మంది బిల్ కలెక్టర్లకు వారి డాకెట్లను బట్టి డైలీ టార్గెట్లు కూడా ఫిక్స్ చేశారు.

నలుగురు బిల్ కలెక్టర్లపై సస్పెన్షన్ వేటు..

ఈ టార్గెట్లను నిర్లక్ష్యం చేస్తున్నట్లు, చాలా మంది ట్యాక్స్ స్టాఫ్ కలెక్షన్ వసూళ్ల కోసం ఫీల్డు లెవెల్ విధులకు హాజరు కావటం లేదన్న సమాచారాన్ని సేకరించిన మాల్కాజ్ గిరి, ఎల్బీనగర్ జోన్లకు చెందిన జోనల్ కమిషనర్లు నాచారం, మాల్కాజ్ గిరి, సరూర్ నగర్, అల్వాల్ సర్కిళ్ల పరిధిలో ఇటీవలే ఆకస్మిక తనిఖీలు నిర్వహించటంతో నలుగురు బిల్ కలెక్టర్లు ఫీల్డు లెవెల్ విధుల్లో లేకపోయినా, ఉన్నామని చెప్పటంతో అధికారులు దాన్ని వెరిఫై చేయగా, తప్పుడు సమాచారమిచ్చినట్లు గుర్తించిన అధికారులు నలుగురు బిల్ కలెక్టర్లపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిసింది. ట్యాక్స్ స్టాఫ్ పై అకారణంగా సస్పెన్షన్ వేటు వేశారంటూ ప్రశ్నించినందుకు ట్యాక్స్ సెక్షన్ లోని విధు నిర్వహిస్తూ, యూనియన్ నేతలుగా వ్యవహారిస్తున్న మరో ఇద్దరు యూనియన్ నేతలను కూడా బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.

21 రోజుల్లో రూ. వెయ్యి కోట్ల టార్గెట్..

Advertisement

వర్తమాన ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా కేవలం 21 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఇదివరకే ఫిక్స్ చేసిన టార్గెట్ ను అధిగమించాలంటే రూ. వెయ్యి కోట్ల వరకు ట్యాక్స్ కలెక్షన్ చేయాల్సి ఉంది. ఇందుకు గాను ఇప్పటికే సర్కిళ్ల వారీగా, బిల్ కలెక్టర్లకు, ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లకు డైలీ కలెక్షన్ టార్గెట్లు ఫిక్స్ చేసినట్లు తెలిసింది. రూజువారి కలెక్షన్ ను కమిషనర్ ఆర్.వి.కర్ణన్ తో పాటు అదనపు కమిషనర్ (రెవెన్యూ), అదనపు కమిషనర్ ( ఫైనాన్స్), చీఫ్ వ్యాల్యుయేషన్ ఆఫీసర్లు టెలీ కాన్ఫరెన్స్‌లో తరుచూ సమీక్షిస్తుంటారు. దీనికి తోడు ప్రతి జోన్ లో 200 మంది టాప్ డిఫాల్టర్లకు జాబితాను కూడా తయారు చేసి, చివరి రెడ్ నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. భారీగా పేరుకుపోయిన మొండి బకాయిలను వసూలు చేసుకునేందుకు జోనల్, డిప్యూటీ కమిషనర్లు నేరుగా రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి మొండి బకాయిలపై మరింత ఉచ్చు భిగించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రాపర్టీల సీజింగ్ లను ముమ్మరం చేసి, ట్యాక్స్ వసూలు చేసుకోవాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది.

Also Read: Minister Seethakka: అంగన్ వాడీ చిన్నారులకు.. త్వరలో మరో కొత్త పథకం..!

స్తంభించిన ట్యాక్స్ కలెక్షన్.. ఆగిన జీతాల చెల్లింపులు

Advertisement

జీహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని జోన్లతో పాటు ప్రధాన కార్యాలయంలోని పలు విభాగాల ఉద్యోగులకు ఇంకా జీతాలు చెల్లించలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్చి మాసం 10వ తేదీ దాటిన తమకు జీతాలు చెల్లించకపోవటంతో సంబంధిత అధికారులను సంప్రదించగా, జీతాల చెల్లింపునకు నిధుల్లేవని, అవసరమైతే కమిషనర్ ను అడగాలని సూచిస్తున్నట్లు పలు విభాగాల ఉద్యోగులు వాపోతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్ల పరిధిలో డైలీ కలెక్షన్ అవుతున్న ప్రాపర్టీ ట్యాక్స్ నుంచే జీతాలు చెల్లిస్తున్నట్లు, కొద్ది రోజులుగా కలెక్షన్ ఆశించిన స్థాయిలో జరగకపోవటంతో జీతాల చెల్లింపులు స్తంభించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆర్థిక మాసం చివరి నెల రోజుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో రోజువారీగా కనిష్టంగా రూ. 40 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు, గరిష్టంగా మార్చి నెల చివరి రోజుల్లో రూ. వంద కోట్ల వరకు ట్యాక్స్ కలెక్షన్ అయిన సందర్భాలున్నాయి. కానీ ఈ సారి వసూల్లు బాగా తగ్గిపోయిన కారణంగానే జీతాల చెల్లింపులు జరగటం లేదని కొందరు అధికారులు చెబుతున్నారు.

తుస్సుమన్న ఓటీఎస్..

జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లలో దీర్ఘకాలికంగా పేరుకుపోయిన ఆస్తి పన్ను మొండి బకాయి వసూళ్ల కోసం గత డిసెంబర్ మాసం మొదటి వారంలోనే సర్కారు వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్) స్కీమ్ ను అమల్లోకి తెచ్చింది. రూ. వేల కోట్లలో మొండి బకాయిలుండగా, ఓటీఎస్ అమల్లోకి వచ్చిన మూడు నెలల్లో కేవలం రూ. 155 కోట్లు మాత్రమే వసూలు కావటంతో సర్కారు అమలు చేస్తున్న ఓటీఎస్ తుస్సుమన్నది. మొండి బకాయిలపై ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ విధించిన వడ్డీలో 90 శాత రాయితీ ఇస్తున్నా, ఓటీఎస్ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు జీహెచ్ఎంసీ ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించకపోవటమే ఓటీఎస్ తుస్సుమనేందుకు ప్రధాన కారణమన్న వాదనలున్నాయి.

Also Read: Organ Transplant: ప్రైవేట్ ఆసుపత్రులపై మంత్రి గరం గరం.. ఆ ధరలపై సీరియస్..?

Related News

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×