Woman Kidnapped: స్వేచ్ఛ బ్యూరో: సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలంలో యువతి కిడ్నాప్ కలకలం రేపింది. తనను కాదని ఇతరులతో పెళ్లి నిశ్చయం చేసినందుకు కోపంతో స్వంత మేన మరదలిని కిడ్నాప్ చేసిన సంఘటన శనివారం ఉదయం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి వట్‌పల్లి ఎస్‌ఐ లవ కుమార్ వివరిస్తూ ఉదయం 10 గంటల ప్రాంతంలో మండల పరిధిలోని ధరఖాస్తు పల్లి గ్రామానికి చెందిన యువతి రూప (20) తన సోదరుడితో కలిసి తన పొలం వద్ద నున్న దర్గాకు వెళ్లి పూజలు చేసిన అనంతరం బైకుపై ఇంటికి వెళుతుండగా మేన బావ అయిన జగదీశ్వర్ చూసి తన సోదరుడు శ్రీకాంత్‌కు ఫోన్ చేసి వెంటనే రావాలని కోరగా తన స్నేహితుడు లక్ష్మన్‌తో కలిసి కారులో అక్కడికి చేరుకున్నాడు.
రూప, సోదరుడు వస్తున్న బైకును కారుతో తన్ని ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించారు. రూప అనే అమ్మాయిని మేన బావ అయిన శ్రీకాంత్ చేసుకోవాలని భావించాడు. అయితే ఇటీవల ఆమెను వేరు అబ్బాయితో పెళ్లి నిశ్చయం చేయడంతో ఆ రోజు నుంచి ఆమెపై కసిని పెంచుకొని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేసారు. కిడ్నాప్ చేసిన యువతి రూపను మార్గమద్యలో చెప్పుతో కొడుతూ, చిత్రహింసలకు గురి చేయడమే నన్ను పెళ్లి చేసుకోకపోవతే చంపేస్తానని బెదిరింపులకు గురి చేసారు.
Also Read: Control Room: త్వరలో కోర్ అర్బన్ ఏరియాలో.. ఆరోగ్య సేవలపై స్పెషల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
అంతే కాకండా పెళ్లి నిశ్చయమైన వ్యక్తికి వీడియో కాల్ చేసి ఇదిగో నీవు చేసుకోబోయే భార్యను కిడ్నాప్ చేసానంటూ వార్నింగ్ ఇచ్చాడు. యువతి సోదరుడు 100 నంబర్‌కు కాల్ చేయడంతో అప్రమత్తమైన వట్‌పల్లి, పుల్కల్ పోలీసులు మూడు బందాలుగా ఏర్పడి పుల్కల్ శివారులో కారుతో పాటు యువతిని, కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. కారులో నుంచి యువతి తప్పించుకునేందుకు కారు అద్దాలను కాలితో తన్ని పగలగొట్టినట్లు తెలిసింది. యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో జగదీశ్వర్, శ్రీకాంత్, లక్ష్మణ్‌లపై కిడ్నాప్, హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ లవ్‌కుమార్ తెలిపారు.
Also Read: Holi 2026 Safety tips: హోలీ ఆడుతున్నారా? చర్మం, కళ్లు జాగ్రత్త.. ఈ టిప్స్ తప్పక పాటించండి!