Bhairavam Movie Update: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో భారీ తారాగణంతో ఊహించని స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం భైరవం (Bhairavam ).. నారా రోహిత్ (Nara Rohit), మంచు మనోజ్ (Manchu Manoj), బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) కలయికలో వస్తున్న ఈ సినిమా మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విజయ్ కనకమేడల (Vijay Kanakamedala) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఆనంది (Anandi ), అదితి శంకర్(Aditi Shankar), దివ్యా పిళ్ళై(Divya pillai) హీరోయిన్లుగా నటిస్తున్నారు. విభిన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ డ్రామా గా.. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్డేట్ తెరపైకి వచ్చింది.
ఘనంగా భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్..
ఇక తాజాగా భైరవం మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ అభిమానులలో సంతోషాన్ని కలిగిస్తోంది. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను మేకర్స్ ప్రకటించారు. భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మే 18వ తేదీన ఏలూరులో ఇండోర్ స్టేడియం గ్రౌండ్లో చాలా ఘనంగా నిర్వహించనున్నారు. మే 18న సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది అంటూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో ఉత్సవాలు జరుగుతుండగా.. ఏదో అనూహ్య గొడవ జరగగా.. అటు మంచు మనోజ్, ఇటు నారా రోహిత్ మధ్యలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కోపంతో రౌడీల వైపు చూస్తున్నట్లు పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక మే 18 అనగా రేపు సాయంత్రం జరగబోయే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ఎవరు చీఫ్ గెస్ట్ గా వస్తారు అన్న విషయాన్ని ఇంకా మేకర్స్ ప్రకటించలేదు. ఇకపోతే ఈ ఈవెంట్ కి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో పాటు మంచు మనోజ్, నారా రోహిత్, అదితి శంకర్ రాబోతున్నారు. ఒక ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న శంకర్ కూతురు అదితి శంకర్ ఈ సినిమాతో తొలిసారి తెలుగు పరిచయం కాబోతోంది.
భైరవం సినిమా విశేషాలు..
విజయ్ కనకమేడల అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదల అవ్వగా.. అన్నీ కూడా ఒకదానికి మించి మరొకటి సినిమాపై అంచనాలు పెంచేశాయి. అటు టీజర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక డం డమారే అంటూ ఇటీవల విడుదల చేసిన పాటను ఈ ఫ్రెండ్షిప్ సాంగ్ ను శ్రీ చరణ్ పాకాల కంపోజ్ చేయగా.. భాస్కరభట్ల రాసిన లిరిక్స్, రేవంత్, సాహితీ చాగంటి, సౌజన్య కలిసి పాడి తీరు అందర్నీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు సహజత్వాన్ని ఉట్టిపడేలా ఉన్నాయి. మరి ఇంతటి భారీ తారాగణంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
ALSO READ:Big TV Exclusive: చిరు – అనిల్ మూవీలో స్పెషల్ బీట్.. రంగంలోకి ఆ బ్యూటీ..!