Lip Stick Side Effects: ఆడవాళ్లు ఎక్కడ ఉంటే అక్కడ అద్ధం ఉంటుంది.. అందానికి నిర్వచనం ఆడవాళ్లు.. అందంగా కనిపించాలనిఆడవాళ్లు ఎంత పిచ్చిగా ఆలోచిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అమ్మాయిలు మాత్రమే కాదు.. ప్రస్తుత కాలంలో మహిళలు మెుత్తం అందానికే ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం చాలా మంది లిప్‌స్టిక్ పెట్టకుండా బయటికి వెళ్లడం లేదు.. చిన్న పిల్లలకు కూడా లిప్‌స్టిక్ పిచ్చి ఎక్కువైపోతుంది. కానీ లిప్‌స్టిక్ ఎక్కువగా వాడటం వల్ల ఆరగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు.
అయితే అందాన్ని పెంచుకునేందుకు, ఉన్న అందాన్ని మరింత అందంగా చూపించుకునేందుకు ఆడవారు అనవసరమైన కెమికల్స్‌తో కూడిన క్రీమ్స్‌ని వాడుతూంటారు. అవి వెంటనే ఫలితం కనిపించకుండా చాలా సంవత్సరాల తర్వాత అయినా కూడా చర్మం పొడి బారిపోవడం లేదా మరేదైనా చర్మ సమస్యలు రావడం జరుగుతుంది.. ఇటీవల క్యాన్సర్ కూడా వస్తుంది.
చర్మ సమస్యలు
ఎక్కువ శాతం ఆడవారు నాసిరకం లిప్‌స్టిక్ వాడుతున్నారు. దాని వల్ల అత్యంత ప్రమాదంను వారు భవిష్యత్తులో ఎదుర్కోబోతున్నారని సదరు సంస్థ పేర్కొంది. దీని వల్ల చర్మానికి అలెర్జీలు, మచ్చలు మరియు ఇతర చర్మ సమస్యలకు కారణం అవుతుంది. అంతేకాకుండా లిప్‌స్టిక్ వాడినప్పుడు అది మనకు తెలియకుండానే దానిని మింగేస్తూ ఉంటారు. దీంతో లిప్‌స్టిక్ శరీరంలోకి వెళ్లి దానిలో ఉండే రసయనాలు జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది, జీర్ణ సంబంధిత సమస్యలకు దారీతిస్తుంది. ముఖ్యంగా ఇది మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది.
మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది
లిప్‌స్టిక్ కేవలం పెదాలకు మాత్రమే కాకుండా అనేక అనారోగ్య సమస్యలకు దారితిస్తుందని నిపుణులు చెబుతున్నారు. లిప్‌స్టిక్‌లో ఎక్కువగా ‘లెడ్’, అల్యూమినియం, క్రోమియం, కాడ్మియం, మెగ్నీషియం వంటి కెమికల్స్ ఉపయోగిస్తున్నారు. దాని వల్ల నాడీ వ్యవస్థ పై తీవ్ర ప్రభావం పడుతుంది. అంతేకాకుండా మెదడు ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది. హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా లిప్‌స్టిక్‌లోని రసాయనాలు గర్భాశయానికి హాని కలిగిస్తుంది. అలాగే గర్భాశయ సమస్యలకు దారితీస్తుంది. అందుకే గర్భవతీగా ఉన్నప్పుడు లిప్‌స్టిక్ వాడకుండా ఉంటే మంచిది. లేదంటే గర్భంలోని పిల్లలకు కూడా హాని కలిగిస్తుంది. ఇక ఎవరైతే ఎక్కువ లిప్ స్టిక్ లను ఉపయోగిస్తారో వాటిలో ఉండే రసాయన మూలకాల కారణంగా చర్మ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
Also Read: మీ పిల్లలకు జలుబు చేస్తే నెబులైజర్ వాడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
అంతేకాకుండా ఇందులోని సీసం మీ రక్తపోటును పెంచుతుంది. అలాగే గుండె సమస్యలను కూడా కలిగిస్తుంది. లిప్ స్టిక్ లోని పారాబెన్ డయేరియాకు కారణమవుతుందని పలు అధ్యయనాలలో రుజువైంది. కొన్ని లిప్‌స్టిక్‌లు చర్మం చికాకు, గురక, దగ్గు ,కంటి చికాకు కలిగిస్తాయి. మీకు ఇప్పటికే ఈ సమస్యలు ఉంటే లిప్ స్టిక్ ఉపయోగించకపోవడమే మంచిది.
అలాగే పునరుత్పత్తి వ్యవస్థపై కూడా నాసిరకపు లిప్‌స్టిక్ ప్రభావం చూపుతుందని, శరీరం ఎదుగుదలపై కూడా ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ఖరీదైనా లిప్‌స్టిక్‌తో పోలిస్తే.. మామూలు లిప్‌స్టిక్‌లో అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ ఉంటున్నాయని చెబుతున్నారు. షైనింగ్ ఎక్కువగా ఉండేందుకు అధిక కెమికల్స్‌ను చిన్న కంపెనీల వారు వాడుతారని, అందుకే ప్రముఖ కంపెనీల తయారు చేసే ఖరీదైన లిప్‌స్టిక్ వాడితే పరవాలేదు కానీ.. చిన్న చిన్న షాపుల్లో చీప్‌గా దొరికే లిప్‌స్టిక్ వల్ల ప్రాణాలకే ప్రమాదం.. పలు క్యాన్సర్స్ కూడా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. . సాధ్యమైనంత వరకు లిప్ స్టిక్స్ వాడకుండా ఉంటేనే మంచిది. అలా కాకుండా ఒకవేళ వాడితే నాసిరకం లిప్ స్టిక్స్‌ను అసలే వాడకండి.