E-Paper
Advertisement

Karimganar: అయ్యో దేవుడా..! ఏడు నెలల గర్భిణీ ఉరి వేసుకుని సూసైడ్, కరీంనగర్‌లో ఘటన

Karimganar: అయ్యో దేవుడా..! ఏడు నెలల గర్భిణీ ఉరి వేసుకుని సూసైడ్, కరీంనగర్‌లో ఘటన
Advertisement

Karimganar: కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని ఇల్లందకుంట మండలం, శ్రీరాములపల్లి గ్రామంలో విషాదం జరిగింది. ఏడు నెలల గర్భిణీ అయిన మౌనిక (21) ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధించడమే తన కూతురు ఆత్మహత్యకు కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మృతురాలు మౌనిక వివాహం గత డిసెంబర్ నెలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, గణపురం మండలం, బుద్దారం గ్రామానికి చెందిన ప్రశాంత్ తో జరిగింది. వివాహ సమయంలో కట్నం కింద కొంత మొత్తాన్ని.. బంగారం, ఇతర సామగ్రిని ఇచ్చారు. అయితే, పెళ్లయిన కొద్ది రోజులకే ప్రశాంత్, అతని కుటుంబ సభ్యులు మరింత అదనపు కట్నం తీసుకురావాలని మౌనికను వేధించడం ప్రారంభించారని ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ వేధింపులు రోజురోజుకు ఎక్కువవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక తన పుట్టినిల్లు శ్రీరాములపల్లిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఈ విషాద సంఘటన గురించి తెలుసుకున్న మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కట్నం వేధింపుల కారణంగానే తమ ఏడు నెలల గర్భంతో ఉన్న కూతురు బలవన్మరణానికి పాల్పడిందని.. దీనికి కారణమైన భర్త ప్రశాంత్‌తో పాటు అత్తమామలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే శ్రీరాములపల్లి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. మౌనిక మృతికి కట్నం వేధింపులే కారణమా అనే కోణంలో పోలీసులు కూలంకషంగా విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

ALSO READ: DK Sivakumar: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేదేలే.. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయను, డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×