Bengaluru Daycare: డే కేర్ సెంటర్లు పేరు చెబితే చాలు చాలామంది తల్లిదండ్రులు హడలి పోతారు. ఎందుకంటే.. డే కేర్ సెంటర్లలో పని చేస్తున్న ఆయాలు చేస్తున్న దారుణాలు అన్నీఇన్నీ కావు. ఈ తరహా యవ్వారాలు బయటపడుతున్నా, పని చేసినవారు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తాజాగా బెంగుళూరు డే కేర్ సెంటర్‌లో జరిగిన దారుణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిపై కేసులు నమోదు అయ్యాయి.
బెంగళూరు డే-కేర్ సెంటర్‌లో దారుణాలు
బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీ క్యాంపస్‌లోని చిన్నారుల సంరక్షణ కేంద్రం ఉంది. బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలో పని చేస్తున్న ఐటీ కంపెనీల్లో పని చేస్తున్న భార్యాభర్తలు.. తమ పిల్లలను డే కేర్ సెంటర్‌లో జాయిన్ చేస్తుంటారు. రెండు నుంచి మూడేళ్ల వయసున్న పిల్లలు ఏడ్చినా, అల్లరి చేసినా, పని చేసే ఆయాలు వారిని బెదిరిస్తున్నట్లు ఆరోపణలు రెట్టింపు అయ్యాయి.
కార్పొరేట్ శిశు సంరక్షణ కేంద్రంగా పని చేస్తోంది. డిజిటల్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లలో అంతర్గత వీడియో ఫుటేజ్ లీకై ఆ తర్వాత వైరల్‌గా మారాయి. దీంతో చిన్నారుల సంరక్షణ కేంద్రంలో పిల్లలను శారీరకంగా హింసించిన వీడియోలు బయటకు వచ్చాయి. చిన్నారులను ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్‌లో పెట్టడం వంటివి వెలుగులోకి వచ్చాయి.
పిల్లలను వాషింగ్ మెషిన్ లోపల పెట్టిన వీడియోలో హంగామా, ఐదుగురిపై కేసు
వెస్ట్రన్ టాయిలెట్‌పై కూర్చోబెట్టడం, టాయిలెట్ జెట్ స్ప్రే ఉపయోగించడం, నోటిపై నీళ్లు చల్లడం, బాత్‌రూమ్‌ల్లో బంధించడం వంటి ఆరోపణలు వెల్లువెత్తాయి. వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు రావడంతో రంగంలోకి దిగారు పోలీసులు. ఈ క్రమంలో ఐదుగురు మహిళా సంరక్షకులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వారిని వీడియోలు చూపించి పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే దానిపై ఆరా తీశారు. అయితే ప్రస్తుతానికి ఎవరినీ అరెస్టు చేయలేదని అంటున్నారు. ఈ ఘటనపై మరిన్ని ఆధారాలు సేకరణ మొదలుపెట్టారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ALSO READ: హనుమకొండలో విషాదం.. పెళ్లింట్లో విద్యుత్ షాక్ తో తండ్రి, కొడుకు మృతి
ఈ వ్యవహారం చివరకు కర్ణాటక స్టేట్ కమిషన్ ఫర్ చిల్డ్రన్ వద్దకు చేరింది. దీనిపై ఆ సంస్థ విచారణ జరుపుతోంది. అధికారులు తమకు రిపోర్టు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని టెక్నాలజీ హబ్‌గా ఈ తరహా ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. కార్పొరేట్-ప్రైవేట్ శిశు సంరక్షణ కేంద్రాలపై పర్యవేక్షణ లేకపోవడం కారణంగా తెలుస్తోంది.
అంతర్గత పర్యవేక్షణ కొరవడడం, అందులో పని చేసినవారికి కఠినమైన మానసిక పరీక్షలు నిర్వహించకపోవడాన్ని తల్లిదండ్రుల సంఘాలు తీవ్రంగా విమర్శించాయి. రాష్ట్ర బాలల రక్షణ కమిటీలతో ఆకస్మిక తనిఖీలతోపాటు, తల్లిదండ్రులకు తప్పనిసరిగా అందులోని సీసీటీవీ కెమెరాల స్ట్రీమింగ్ సదుపాయాన్ని కల్పించాలని బాలల హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.