Podarillu Today Episode July 2nd: రాత్రి అందరూ భోజనానికి కూర్చోవడానికి సిద్ధంగా ఉంటారు.. కన్నా చాలా సంతోషంగా అందరిని భోజనానికి రండి అని పిలుస్తాడు.. అయితే చక్రి నన్ను కూడా కూర్చోమంటారా అని అడుగుతాడు. మహాలక్ష్మి కన్నా పక్కన కూర్చోవడం చూసి నాకు ఎటు చూసినా ఈవిడ కనిపిస్తుంది అని అనుకుంటాడు.. కానీ నారాయణ మాత్రం అరే ఫుల్లు మహాలక్ష్మి నిజంగానే వచ్చింది కళ్ళు తెరిచి చూడరా అని అంటాడు.. అయితే మహాలక్ష్మి వచ్చింది అని తెలుసుకున్న చక్రి చాలా సంతోషంగా ఉంటాడు. మీరు వచ్చేసారు నాకు చాలా సంతోషంగా ఉంది అని చక్రిలోడలోడా వాగేస్తుంటే మహాలక్ష్మి ఇతను వెళ్ళిపోతాను అంటే నేను వచ్చాను ఎప్పుడు వెళ్ళిపోతాడు కనుక్కో పెద్ది అని అంటుంది.. రేపు నేను వెళ్ళిపోతాను అని చక్రి అంటాడు.. అయితే మొత్తానికి అందరూ కలిసి చాలా సరదాగా ఉంటారు. ఇదా కేశవ బయటికి వచ్చి తనకి మెసేజ్ చేయాలని వస్తాడు.. కేశవా మెసేజ్ చేస్తూ ఉండగా మహాలక్ష్మి వచ్చి సలహాలు ఇస్తుంది అది చూసినా కేశవ అది లవ్వు కాదు అని అసలు నిజం చెప్తాడు.. చక్రి వచ్చి మధ్యలో అది లవ్ అని చెప్పడంతో మహాలక్ష్మి కూడా నిజమే అని నమ్ముతుంది.
కేశవ తన గర్ల్ ఫ్రెండ్ తో మెసేజ్ చేయడానికి గాని బయటికి వచ్చి ఏం చేయాలా అని ఆలోచిస్తూ అటు ఇటు చూస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి వచ్చిన మహాలక్ష్మి లవ్ సింబల్ పెడితే బాగుంటుంది అని అంటుంది.. ఇక చక్రి కూడా రావడంతో కేశవ లవ్ స్టోరీ గురించి బయట పడిపోతుంది.. అమ్మ ఈ చాలా మంచిది చిన్నపిల్లలాగా మాట్లాడుతుంది కాబట్టి తనది చిన్న పిల్ల మనస్తత్వం అని నాకు బాగా అర్థమవుతుంది.. అసలు ఆ అమ్మాయిని వదులుకోవద్దు అని మహాలక్ష్మి అంటుంది.. కానీ ఇప్పుడే తను చెప్పినట్టే వినాలి అన్నట్టుగా ప్రవర్తిస్తుంది నేను ఎంత చెప్పినా తను అర్థం చేసుకోవడం లేదు అని చెప్పగానే.. తనని అర్థం చేసుకుంటే తను కూడా మీకు అర్థమవుతుంది అని మహాలక్ష్మి చెప్తుంది.. ఇక చక్రి కేశవ ఫోన్ అడగడంతో తను నా ఫోన్ అసలు ఇవ్వను అని అంటాడు.. చక్రి ఎలాగైనా సరే ఫోన్ తీసుకోవాలని అనుకుంటాడు. కానీ కేశవ్ మాత్రం అక్కడి నుంచి పారిపోతాడు మహాలక్ష్మి చక్కగా నవ్వుతూ ఉండడం చూసి చక్రి నా మీద కోపం పోయింది అని అనుకుంటాడు..
మహాలక్ష్మి నవ్వుతూ ఉండడం చూసినా చక్రి మీరు నవ్వుతూ ఉంటే చాలా బాగుంటారు.. నన్ను క్షమించి మీరు ఇక్కడికి రావడం నాకు చాలా బాగుంది అని చక్రి అంటాడు.. నేను క్షమించాను అని ఎప్పుడు చెప్పాను ఇక్కడికి రావడానికి వేరే కారణం ఉంది.. కానీ మీరు ఇంట్లోంచి వెళ్ళిపోతాను అన్నారు కదా అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని మహాలక్ష్మి అంటుంది.. మరి మీరు ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు చెప్పండి అని మహాలక్ష్మి అనగానే చక్రి హాస్టల్ అయినా ఒక నెల టైం ఇస్తారు.. మీరు మాత్రం ఇలా ఒకటి రెండు రోజుల్లోనే వెళ్లిపొమ్మంటారా కాస్త ఆగండి అని చక్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు..
అయితే అర్థం వదలకుండా శైలు రెడీ అవుతూ ఉండటం చూసి వాళ్ళ అన్న అక్కడికి వచ్చి ఏంటే కాలేజ్ లేదన్నావ్.. ఇప్పుడు ఇంతకు రెడీ అవుతున్నావు అని అంటాడు.. కాలేజ్ లేదని నిన్న చెప్పాను కానీ ఇవాళ కాలేజ్ ఉందని ఫోన్ చేశారు నేను వెళ్తున్నాను అని శైలు అంటుంది.. అయితే వరాలు నేను ఇప్పుడు బయటకు వెళ్లి వస్తాను అని వాళ్ళ నాన్న అంటాడు.. కాలేజీ ఉందని రెడీ అయ్యి అక్కడికి రావడం చూసి ఏంటి కాలేజ్ లేదని చెప్పావు మళ్ళీ ఇప్పుడు రెడీ అవుతున్నావు ఏంటమ్మా అని అడుగుతాడు.. మా కాలేజ్ కాదు నాన్న వేరే కాలేజ్ అంతా ఇవాళ కాలేజ్ ఉంది నేను కీర్తితో వెళ్తాను అని అంటుంది.. అయితే శైలు వాళ్ళ అమ్మ వచ్చి మీ కూతురికి పెళ్లి చేయను అంటే రేపు నీ అల్లుడని ఒకరిని పరిచయం చేస్తుంది అప్పుడు ఏం చేస్తావు అని అంటుంది.. శైలు మాత్రం నేను మీరు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను నాన్న అని మాటిస్తుంది..
మహాలక్ష్మి పనిచేస్తున్న ఆఫీసులో అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాయి చాలా సంతోషించాల్సిన విషయం అని విక్కీ చెప్పగానే అందరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు.. ఇక హారిక ఫోన్ చేసి మనం ఎప్పుడు కలుసుకుని రెస్టారెంట్ లోనే నేను ఉన్నాను.. నువ్వు వస్తే కలిసి మాట్లాడాలి అని అనుకుంటున్నానని హారిక అనగానే వెంటనే వస్తున్నాను వదినా అని విక్కీ దగ్గర పర్మిషన్ తీసుకుని మహా అక్కడికి వెళుతుంది.. మహా అక్కడికి వెళ్ళగానే హారికకు జాబ్ వచ్చిందని చెప్తుంది.. ఆ ఇంట్లో నువ్వు ఇన్ని రోజులు ఉండడానికి కారణం ఏంటో నాకు అర్థం కావడం లేదు.. నువ్వు వెంటనే చక్రితో విడాకులు తీసుకో… చక్రి నేను ప్రేమించలేదు కదా మరి విడాకులు తీసుకోవడం మంచిదే కదా అని హారిక అంటుంది.. ఆ మాట వినగానే మహా ఒక్కసారిగా షాక్ అవుతుంది… సరే వదిన నేను చక్రితో విడాకులు తీసుకుంటాను అని మహా మాటిస్తుంది..
మహా చక్రిని కలవాలని అడుగుతుంది.. అయితే చక్రి మహాకోసమని ఒక రెస్టారెంట్ కి వస్తాడు.. చక్రి తో మాట్లాడాలని పిలిచిన మహా మౌనంగా ఉండడంతో చక్రిలోడలోడా బాగా వేస్తూ ఉంటాడు.. నాకు మీరు ఒక మాట ఇవ్వాలి ఒకటి ఇవ్వాలి అని మహాలక్ష్మి అడుగుతుంది.. నాకు విడాకులు కావాలి మనిద్దరం విడాకులు తీసుకోవడం మంచిది అని మహాలక్ష్మి అనగానే చక్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు.. మన ఉత్తుత్తి బంధం ఎందుకు పనికిరాదు కదా విడాకులు తీసుకోవడమే మంచిది అని మహా అనగానే చక్రి ఫ్యూజుల్ ఎగిరిపోతాయి. కానీ మహాలక్ష్మి కచ్చితంగా నాకు విడాకులు ఇవ్వాల్సిందే అని చెప్పడంతో చక్రి ఇక ఏమీ చేయలేక ఇస్తాను అని మాటిస్తాడు.. ఇక కేశవా నువ్వు కలిసిన శైలుని వాళ్ళ నాన్న చూసి చాలా బాధపడతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…