E-Paper
Advertisement

మొగలి రేకులు నటి శిరీషకు మరో పెళ్లి ?.. వరుడు కూడా ..

మొగలి రేకులు నటి శిరీషకు మరో పెళ్లి ?.. వరుడు కూడా ..
Advertisement

Mogali rekulu shireesha :’మొగలి రేకులు’, ‘రాములమ్మ’, ‘చెల్లెలి కాపురం’, ‘స్వాతి చినుకులు’..వంటి సీరియల్స్ తో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న సీరియల్ నటి శిరీష ఇపుడు మళ్ళీ పెళ్లి చేసుకోబోతుందన్న వార్త ఇపుడు నెట్టింట వైరల్ అవుతుంది.అవును …సీరియల్స్ లో తనకంటూ మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న శిరీష త్వరలోనే ప్రముఖ RJ, యాంకర్ మహేంద్ర బొర్రాతో పెళ్లి పీటలు ఎక్కనుందన్న వార్త ఇపుడు ఫిలిం సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది.

గతంలోనే పెళ్లి చేసుకున్న శిరీష 

అయితే శిరీషకి ఇది మొదటి పెళ్లి కాదని గతంలో కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు నవీన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుందని,ఆ దంపతులకి ఒక కొడుకు కూడా ఉన్నాడని తెలుస్తుంది.. అయితే కొంతకాలం కుటుంబ జీవితాన్ని కొనసాగించిన తర్వాత, కొన్ని వ్యక్తిగత కారణాలు మరియు మనస్పర్థల నేపథ్యంలో వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయినట్లు సమాచారం. ఆ తర్వాత శిరీష తన కుమారుడిని చూసుకుంటూనే మరో వైపు సీరియల్స్ లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది.

పెళ్లి చేసుకోబోయే వ్యక్తీ అతనేనా ?

Advertisement

ఇక శిరీష పెళ్లి చేసుకోబోయే మహేంద్ర బొర్రా విషయానికి వస్తే ఆయన రేడియో జాకీగా (RJ) కెరీర్ ప్రారంభించి తన ప్రత్యేకమైన టైమింగ్, వాయిస్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్‌గా అనేక షోలు చేస్తూనే, నటుడిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ‘ఇంటింటి రామాయణం’, ‘మగువ ఓ మగువ’ వంటి సీరియల్స్‌తో పాటు సెలబ్రిటీల ఇంటర్వ్యూల్లో ఆయన పేరు తరచూ కనిపిస్తూనే ఉంటుంది.ఇలా ఇద్దరికీ మీడియా మరియు సీరియల్ రంగంతో సుదీర్ఘ అనుబంధం ఉండటం విశేషం.

ఈవెంట్‌ సందర్భంగా మొదటిసారి పరిచయం

ఇక వీరిద్దరికీ గతంలో ఒక సినీ ఈవెంట్‌ సందర్భంగా వీరిద్దరికీ మొదటిసారి పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం కొద్దిరోజుల్లోనే మంచి స్నేహంగా మారిందని ఇండస్ట్రీ లో వినిపిస్తున్న టాక్. క్రమక్రమంగా ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని, ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ దగ్గరయ్యారని తెలుస్తోంది. ఈ స్నేహమే ఆ తర్వాత ప్రేమగా మారి, చివరకు జీవిత భాగస్వాములుగా కలిసి ముందుకు సాగాలనే నిర్ణయానికి దారితీసిందని ప్రచారం జరుగుతోంది.

ఎలా రియాక్ట్ అవుతారో !

Advertisement

ఎలాంటి హంగామా లేదా ఆర్భాటాలు లేకుండా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య చాలా సింపుల్‌గా ఈ వేడుకను ముగించాలని ఇద్దరూ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయంలో శిరీష నుంచి కానీ, మహేంద్ర బొర్రా నుంచి కానీ ఇప్పటివరకు అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్ మెంట్ వదల్లేదు.చూడాలి మరి వస్తున్న ఈ వారలపై అటు శిరీష కాని, ఇటు మహేంద్ర బొర్రా కాని ఎలా రియాక్ట్ అవుతారో !

also read :తెలుగు రానోళ్లతో తెలుగు బిగ్‌బాస్ ఆడిషన్స్ ఏంటి భయ్యా? నిఖిల్ ఫైర్!

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×