Suryapet Student Suicide: కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం రామాపురం గ్రామంలోని గేట్ కాలేజీలో చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పిగుడుపల్లి గ్రామానికి చెందిన కృష్ణవేణి రామాపురంలోని గేట్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఉగాది సెలవులకు ఇంటికి వెళ్లిన కృష్ణవేణి తల్లితో కలిసి శుక్రవారం రోజే కాలేజీకి వచ్చింది. తల్లితో కలిసి కాలేజీ హాస్టల్‌లో నిద్రించిన కృష్ణవేణి..ఇవాళ తెల్లవారుజామున వాష్ రూమ్‌కి వెళ్తున్న చెప్పి బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
గమనించిన విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కృష్ణవేణిని ఆసుపత్రికి పరిశీలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణవేణి ఆత్మహత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు.
తమ కూతురికి కాలేజీలో ఎలాంటి గొడవలు లేవు. తనతో ఎలాంటి డిస్కషన్ చేయలేదని చెబుతోంది కృష్ణవేణి తల్లి. ఆత్మహత్య చేసుకునే ముందు తనతో ఎలాంటి విషయాలు చెప్పలేదని చెప్పింది. అయితే కృష్ణవేణి చివరగా మాట్లాడినటువంటి ఫోన్ కాల్ డేటా ఆధారంగా.. పోలీసులు విచారణ ప్రారంభించారు. నిన్న రాత్రి మంచిర్యాల జిల్లాకు చెందిన వ్యక్తితోటే మూడు సార్లు ఫోన్ మాట్లాడినట్లు తెలిసింది. తరుచూ కూడా అతనితో కాల్ సంభాషణ ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఆ ఫోన్‌లో నెంబర్ కూడా మై సోల్ అని పెట్టుకుంది. కాబట్టి ఖచ్చితంగా ఆమెకు ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమా అని పోలీసులు అనుమానిస్తున్నారు. కృష్ణవేణి సూసైడ్‌తో కాలేజీ యాజమాన్యం, స్టూడెంట్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
Also Read: ప్రాణం తీసిన ఐపీఎల్ బెట్టింగ్.. డబ్బులు కోసం బుల్లెట్, ఐఫోన్ అమ్మి చివరకు
కృష్ణవేణి మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిన్నటి నుంచి ఆ తల్లి కూతురుతో పాటు ఉండి.. రాత్రంతా కృష్ణవేణితో పాటు నిద్రించింది. ఉదయం ఆరు గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణం అయి ఉంటదా..? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కృష్ణవేణి మూడు సంవత్సరాలుగా చిలుకూరు గేట్ కాలేజీలోనే ఇంజనీరింగ్ చదువుతోంది. ఉగాది పండుగకు వెళ్లి ఇన్ని రోజులు ఇంటి దగ్గర ఉంటానికి కారణం ఏంటి..? కాలేజీకి వచ్చే ముందు తల్లిని కాలేజీకి తీసుకురావడానికి గల కారణాలేంటి అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లి కూడా పూర్తిగా నిరక్షరాసులు కావడంతో ఏం చెప్పలేకపోతుంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.