Jio 365 Days Plan: ఇటీవల కాలంలో మొబైల్ రీఛార్జ్ ధరలు బాగా పెరిగిపోయాయి. ఎయిర్‌టెల్, జియో లాంటి దిగ్గజ కంపెనీలు ప్లాన్ల రేట్లు పెంచడంతో సామాన్యులపై భారం పడింది. ఇలాంటి సమయంలో పదే పదే రీఛార్జ్ చేసుకునే తిప్పలు లేకుండా, ఒకేసారి ఏడాది వాలిడిటీతో వచ్చే ప్లాన్లు తీసుకోవడం ఎంతో ఉత్తమం. వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రిలయన్స్ జియో రెండు అద్భుతమైన వార్షిక ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ మాత్రమే కాకుండా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు, గూగుల్ జెమిని ఏఐ వంటి ఎన్నో అదిరిపోయే ప్రయోజనాలను ఈ ప్లాన్లు అందిస్తున్నాయి.
ఏడాది పొడవునా నిశ్చింతగా ఉండాలనుకునే వారి కోసం జియో రూ.3599 ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు 365 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ప్రతిరోజూ 2.5GB హైస్పీడ్ డేటాను వాడుకోవచ్చు. అంటే మొత్తంగా ఒక ఏడాదికి 912.5GB డేటా పొందొచ్చు అన్నమాట. ఒకవేళ రోజువారీ డేటా లిమిట్ అయిపోయినా ఇంటర్నెట్ ఆగిపోదు.. కాకపోతే స్పీడ్ 64 kbpsకు తగ్గుతుంది. దీంతోపాటు దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే రోజుకు 100 ఉచిత SMSలు కూడా లభిస్తాయి.
Also Read: ఫోన్, ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్ అన్నింటికీ ఒకే ఛార్జర్.. టాప్-5 వైర్‌లెస్ ఛార్జర్స్ లిస్ట్ ఇదిగో!
ఈ ప్లాన్ కేవలం డేటా, కాలింగ్‌కే పరిమితం కాలేదు. దీనిలో వినోదానికి కొదవ లేకుండా మూడు నెలల పాటు జియోహాట్‌స్టార్ మొబైల్, టీవీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ఇస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా గూగుల్ యొక్క సరికొత్త సాంకేతికత Gemini AI Pro సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఉచితంగా పొందొచ్చు. అంతేకాదు.. జియో టీవీ ద్వారా రకరకాల టీవీ షోలను, లైవ్ ఛానెళ్లను ఫ్రీగా చూడొచ్చు. అలాగే మన ఫోన్ స్టోరేజ్ సమస్యలను తీర్చడానికి జియో క్లౌడ్ అదనపు మెమరీని కూడా అందిస్తోంది. ఒకవేళ మీరు ఉండే ప్రాంతంలో 5G నెట్‌వర్క్ ఉంటే.. అన్‌లిమిటెడ్ 5G డేటాను ఉచితంగా ఎంజాయ్ చేయవచ్చు.
క్రీడాభిమానుల కోసం జియో మరో అదిరిపోయే ప్లాన్‌ను తీసుకొచ్చింది. అదే రూ.3999 ప్లాన్. దీని వాలిడిటీ కూడా 365 రోజులు. ఇందులో కూడా రోజుకు 2.5GB డేటా, అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాలింగ్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. మూడు నెలల జియోహాట్‌స్టార్ యాక్సెస్, ఉచిత గూగుల్ జెమిని ఏఐ ప్రో, జియో టీవీ, జియో క్లౌడ్ సేవలు కామన్‌గా వస్తాయి. అయితే ఈ ప్లాన్ ప్రత్యేకత ఏంటంటే.. దీనిలో FanCode ఓటీటీ యాప్ సబ్‌స్క్రిప్షన్ అదనంగా లభిస్తుంది.
ఈ రెండు ప్లాన్లను గమనిస్తే ప్రయోజనాలన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. ధరలో ఉన్న రూ.400 తేడాతో కేవలం ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్‌లో మాత్రమే మార్పు ఉంటుంది. మీకు నచ్చిన లైవ్ స్పోర్ట్స్, ఫార్ములా 1 రేసింగ్ లాంటి వినోదాన్ని ప్రత్యేకంగా చూడాలనుకుంటే ఫ్యాన్‌కోడ్ సపోర్ట్ ఉన్న రూ.3999 ప్లాన్ ఎంచుకోవచ్చు. లేదు మాకు నార్మల్ వినోదం చాలు అనుకుంటే రూ.3599 ప్లాన్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ ప్లాన్ల గురించి మరిన్ని వివరాల కోసం వినియోగదారులు జియో అధికారిక వెబ్‌సైట్ లేదా మైజియో యాప్‌ను సందర్శించవచ్చు.